» »శివయ్య తలక్రిందులుగా ఉన్న క్షేత్రం ఇదే...

శివయ్య తలక్రిందులుగా ఉన్న క్షేత్రం ఇదే...

Written By: Beldaru sajjendrakishore

సాధారణంగా శివుడు మనకు లింగ రూపంలో దర్శనమిస్తాడు. అయితే కొన్ని క్షేత్రాల్లో మాత్రమే విగ్రహ రూపంలో ఉంటాడు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్షేత్రంలో పరమశివుడు విగ్రహరూపంలోనే కాక శీర్షాసంలో ఉంటారు. ఆయన పక్కనే పార్వతీదేవి నెలల పసికందు అయిన శివుడిని తన ఒడిలో లాలిస్తూ ఉంటుంది. వీరి ముగ్గురూ ఒకే పానివట్టం మీద ఉండటం మరొక విశేషం. ఇటువంటి విలక్షణ క్షేత్రం ఎక్కడ ఉంది. అక్కడికి ఎలా చేరుకోవాలన్న విషయాలన్నీ నేటివ్ ప్లానెట్ పాఠకుల కోసం

1. ఎక్కడ ఉంది

1. ఎక్కడ ఉంది

Image source:

ఈపుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావారి జిల్లాలో యనమదుర్రు అనే గ్రామంలో ఉంది. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరంకు కేవలం 7 కిలోమీటర్ల దూరంలోనే ఈ క్షేత్రం ఉంటుంది.

2. ఎవరు నిర్మించారు.

2. ఎవరు నిర్మించారు.

Image source:

ఈ గ్రామంలోని దేవాలయాన్ని శ్రీ శక్తీశ్వరస్వామి దేవాలయం. దీనిని తూర్పు చాళుక్యులు నిర్మించినట్లు ఇక్కడ లభించిన చారిత్రాత్మక ఆధారాల వల్ల తెలుస్తోంది.

3.రెండు స్థల పురాణాలు

3.రెండు స్థల పురాణాలు

Image source:


ఈ క్షేత్రానికి రెండు స్థలపురాణాలు ఉన్నాయి. మొదటిది యముడు తన కర్తవ్య నిర్వహణ విషయంలో విరక్తి చెంది తనకు మోక్షం ప్రసాధించాల్సిందిగా శివుడిని ప్రార్థిస్తాడు.

4. శివుడు ప్రత్యక్షమవుతాడు

4. శివుడు ప్రత్యక్షమవుతాడు

Image source:

శివుడు ప్రత్యక్షమయ్యి నీ పేరుమీద ఒక గ్రామం అందులో ఒక శివాలయం వెలుస్తుందని అప్పడు నీ పై ఉన్న అపప్రద తొలిగి నిన్ను కూడా దేవతల మాదిరి జీవులు గుర్తిస్తాడని అభయమిస్తాడు.

5.అందుకే యమనదుర్రుకు ఆ పేరు

5.అందుకే యమనదుర్రుకు ఆ పేరు

Image source:

అదే యమనదుర్రు గ్రామం. అందులో వెలిసిన దేవాలయమే శ్రీ శక్తీశ్వరస్వామి దేవాలయం. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే దీర్ఘరోగాలకు ఉపశమనం కలుగుతుందని భక్తుల నమ్మకం.

6.శంబిరుడనే రాక్షసుడు

6.శంబిరుడనే రాక్షసుడు

Image source:

రెండో కథనం ప్రకారం శంబిరుడనే రాక్షసరాజు ప్రజలను తీవ్ర హింసలకు గురిచేస్తుంటాడు. దీంతో మునులు యమధర్మరాజు వద్దకు వెళ్లి తమ బాధలు చెప్పుకుంటారు.

7. వారికి అభయమిస్తాడు

7. వారికి అభయమిస్తాడు

Image source:


చిత్రగుప్తుడి ద్వారా శంబిరుడి ఆయువును యముడి లెక్కగడుతాడు. శంబిరుడి ఆయువు త్వరలో తీరుపోతుందని దీంతో అతి త్వరలో ఆ రాక్షసుడిని సంహరిస్తారని యముడు వారికి చెబుతాడు. అయితే శంబిరుడు ఈశ్వరుడి పరమ భక్తుడు.

8. యముడు శివుడి గురించి తపస్సు చేసిన ప్రాంతం

8. యముడు శివుడి గురించి తపస్సు చేసిన ప్రాంతం

Image source:


గతంలో ఈశ్వర ఆజ్జన ప్రకారం ఈశ్వరుడి భక్తులను సంహరించాలంటే ముందుగా ఈశ్వరుడి అనుమతి తీసుకోవాలి. దీనిని జ్జప్తికి తెచ్చుకున్న యముడు యమనదుర్రులో ఘెర తప్పస్సు చేసి ఉన్నఫళంగా ప్రత్యక్షం కావాలని లేదంటే లోక వినాశనం తప్పదని యోగమాయ ద్వారా శివుడికి చేరవేస్తాడు.

9.ఆ సమయంలో శీర్షాసనంలో ఉంటాడు

9.ఆ సమయంలో శీర్షాసనంలో ఉంటాడు

Image source:

ఆ సమయంలో శివుడు శీర్షాసనంలో తపస్సు చేస్తుంటాడు. ఆయన పక్కనే పార్వతీ దేవి కుమారస్వామిని ఒడిలో లాలిస్తుంటుంది. దీంతో పార్వతికి విషయం చెప్పి పరమశివుడు అదే స్థితిలో యముడికి ప్రత్యక్షమవుతాడు. అందువల్లే ఇక్కడ శివుడు శీర్షాసన స్థితిలో కనిపిస్తాడని శివపురాణం చెబుతోంది.

10.అదే రూపంలో దర్శనమిస్తాడు

10.అదే రూపంలో దర్శనమిస్తాడు

Image source:


శంబిరుడిని సంహరించడనికి పరమశివుడు యముడికి అనుమతి ఇవ్వడమే కాకుండా ఇక పై తాము ఇదే స్థితిలో భక్తులకు దర్శనమిస్తామని శివుడు తెలిపాడు.

11. ఒకే పీఠం పై

11. ఒకే పీఠం పై

Image source:


అదే విధంగా ఇక్కడ ఒకే పీఠం పై పార్వతి, పరమేశ్వరులు, కుమారస్వామి కొలువై ఉంటారు. ఈ ప్రాంతాన్ని సందర్శిస్తే దీర్ఘ రోగాలు నయమవుతాయని కూడా ఇక్కడి పూజారులు చెబుతున్నారు.

12. వాయు మార్గం ద్వారా

12. వాయు మార్గం ద్వారా

Image source:

యమనదుర్రు శ్రీ శక్తీశ్వరస్వామి ఆలయానికి 90 కిలోమీటర్ల దూరంలో రాజమండ్రి విమానాశ్రయం ఉంది. ఇక్కడి నుంచి యమనదుర్రుకు క్యాబ్, ట్యాక్సీ లేదా ప్రభుత్వ, ప్రైవేటు బస్సుల్లో చేరుకోవచ్చు.

13. రైలు సౌకర్యం ఉంది

13. రైలు సౌకర్యం ఉంది

Image source:

ఇక ఆలయానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే భీమవరం రైల్వేస్టేషన్ ఉంది. హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, గుంటూరు, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లు ఇక్కడ ఆగుతాయి.

14. రోడ్డు మార్గం ద్వారా ఇలా

14. రోడ్డు మార్గం ద్వారా ఇలా

Image source:

భీమవరం నుంచి ప్రభుత్వ, ప్రైవేటు బస్సులతో పాటు షేరింగ్ ఆటోలు కూడా యమనదుర్రు శ్రీ శక్తీశ్వరస్వామి ఆలయానికి చేరుకోవచ్చు.