Search
  • Follow NativePlanet
Share
» »ఐరావతం స్నానం చేసిన చోటు..చర్మ రోగాలన్నీ మాయమయ్యే క్షేత్రం ఇదే

ఐరావతం స్నానం చేసిన చోటు..చర్మ రోగాలన్నీ మాయమయ్యే క్షేత్రం ఇదే

ఐరావతేశ్వరం దేవాలయానికి సంబంధించిన కథనం. Airavatesvara Temple is a Hindu temple of Tamil architecture located in the town of Darasuram, near Kumbakonam in the South Indian state of Tamil Nadu.

By Beldaru Sajjendrakishore

ఇంద్రుడి వాహనమైన ఐరావతం స్నానం చేసి తన శాపాన్ని విముక్తి చేసుకున్న చోటు ఇదే. ఇదే కొలనులో సాక్షాత్తు యముడు కూడా స్నానం చేసి పక్కనే ఉన్న శివుడిని ఆరాధించి తన శాపాన్ని కూడా పోగొట్టు కొన్నాడు. దీంతో ఈ కోనేరులో స్నానం చేస్తే చర్మరోగాలన్నీ పోతాలయని భక్తులు చాలా కాలంగా నమ్ముతున్నారు.

నర-మృగ రూపు విగ్రహం నుంచి స్వేదం అదే భక్తులకు తీర్థం ఇక్కడనర-మృగ రూపు విగ్రహం నుంచి స్వేదం అదే భక్తులకు తీర్థం ఇక్కడ

అందుకే అమిత్ షా ఈ క్షేత్రానికి వెళ్లాడాఅందుకే అమిత్ షా ఈ క్షేత్రానికి వెళ్లాడా

పక్షి రెక్కలతో పాటు విహరిద్దాంపక్షి రెక్కలతో పాటు విహరిద్దాం

దీని కోసం దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. అన్ని మహిమలు కలిగిన ఈ ప్రాంతంలోని దేవాలయం భారత తీయ శిల్పకళకు అద్ధం పడుతుంది. ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ దేవాలయం గురించి మనం తెలుసుకుందాం. దీనితో పాటు ఇక్కడికి దగ్గర్లో ఉన్న కుంభకోణం అనే పుణ్యక్షేత్రం గురించి కూడా క్లుప్తంగా తెలుసుకుందా.

1. శైవ క్షేత్రం

1. శైవ క్షేత్రం

1. శైవ క్షేత్రం

Image Source:

ఐరావతేశ్వర దేవాలయం ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇది దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణం పట్టణానికి దగ్గర్లోని దారాసురంలో నెలకొంది. ఇది ద్రావిడ నిర్మాణ శైలి కలిగిన ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఈ దేవాలయాన్ని 12 వ శతాబ్దంలో రాజరాజ చోళుడు II నిర్మించాడు. ఇక్కడి శిల్ప సంపద చోళల కాలం నాటికి అద్ధం పడుతుంటుంది. సజీవమైన శిల్పాలుగా మనకు కనిపిస్తాయి.

2. యునెస్కో వారి ప్రపంచ వారసత్వ సంపద

2. యునెస్కో వారి ప్రపంచ వారసత్వ సంపద

2. యునెస్కో వారి ప్రపంచ వారసత్వ సంపద

Image Source:

ఇది యునెస్కో వారి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా తంజావూరులోని బృహదీశ్వర ఆలయం మరియు చోళపురం లోని గంగైకొండ చోళీశ్వర దేవాలయాలతోపాటు గుర్తించబడింది. ఈ దేవాలయాలు చోళుళ నిర్మాణ శైలికి తార్కాణాలు. ఈ మూడు దేవాలయాల్లోని శిల్పాలు భారత తీయ శిల్పకళకు సజీవ సాక్షాలు. వీటిని చూడటానికే చాలా మంది వస్తుంటారు.

3. మూల విరాట్టు శివుడే

3. మూల విరాట్టు శివుడే

3. మూల విరాట్టు శివుడే

Image Source:

ఐరావతేశ్వర దేవాలయం ప్రసిద్ధ శివాలయం. ఈ దేవాలయంలోమూలవిరాట్టు మహాశివుడు. ఈ దేవాలయం లోని ప్రధాన దైవాన్ని దేవతల రాజైన ఇంద్రుని యొక్క ఐరావతం పూజించినట్లు పురాన గాథ. ఇప్పటికీ ఇక్కడున్న శివుడు ఎంతో మందికి ఆరాధ్య దైవం. చాలా మంది స్థానిక ప్రజలు ఈ శివుడిని ఇంటి దైవంగా పూజిస్తుంటారు.

4. ఐరావతం రంగును కోల్పోయి

4. ఐరావతం రంగును కోల్పోయి

4. ఐరావతం రంగును కోల్పోయి

Image Source:

పురాణాల ప్రకారం ఐరావతం దాని వాస్తవ రంగు తెలుపును దుర్వాస మహాముని శాపం వల్ల కోల్పోయి ఈ దేవాలయంలో శివుని అర్చించి అచట గల కోనేరులోని నీటిలో స్నానమాచరించినపుడు దాని పూర్వపు రంగును పొందినది. ఈ ఇతిహాసం దేవాలయం లోని అంతర్గత మందిరంలో ఇంద్రుడు ఐరావతంతో కూర్చుని ఉండే చిత్రం ద్వారా తెలుస్తుంది. ఈ గాథ కారణంగా ఈ దేవాలయాన్ని ఐరావతేశ్వరాలయం అని పిలుస్తారు. .

5. యముడు కూడా ఆరాధించాడు

5. యముడు కూడా ఆరాధించాడు

5. యముడు కూడా ఆరాధించాడు

Image Source:

పురాణాల ప్రకారం నరకాధిపతి యముడు కూడా శివుణ్ణి ఇచట అర్చించినట్లు తెలుస్తుంది. యముడు ఒక మహర్షి శాపం మూలంగా తన శరీరమంతా మంటలతో మండుతున్నట్లు అనిపించి ఆ బాధను పోగొట్టుకొనడానికి ఈ దేవాలయంలోని ప్రధాన దైవమైన శివుడిని అర్చించినట్లు తెలుస్తుంది. ఈ విషయాలన్నీ కూడా ఇక్కడి శిల్పాల్లో అందంగా చెప్పబడి ఉన్నాయి.

6. యమతీర్థం అంటారు

6. యమతీర్థం అంటారు

6. యమతీర్థం అంటారు

Image Source:

యముడు ఈ దేవాలయ కోనేరులో స్నానమాచరించి శరీర మంటలను పోగొట్టుకున్నాడని తెలుస్తుంది. ఈ కారణంగా ఈ సరస్సును "యమ తీర్థం" అని పిలుస్తారు. ఈ యమ తీర్థంలోనే దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులు స్నానం చేస్తుంటారు. తద్వారా తమ శరీరంలోని చర్మ రోగాలన్నీ పోతాయనేది వారి నమ్మకం. ఈ విధానం తరతరాలుగా వస్తోంది.

7.అమ్మన్ దేవాలయం ఉంది

7.అమ్మన్ దేవాలయం ఉంది

7.అమ్మన్ దేవాలయం ఉంది

Image Source:

ఈ దేవాలయానికి ఉత్తర దిశగా పెరియ నాయకి అమ్మన్ దేవాలయం విడిగా ఉంది. బయటి భాగంలో ప్రాకారాల నిర్మాణం తర్వాత ఇది ప్రధాన దేవాలయంలో ఒక భాగంగా నెలకొంది. ప్రస్తుతం ఆలయంలో దేవత నిలబడి ఉండేటట్లు ఉండే దేవాలయంగా వేరుగా నెలకొంది. ఈ దేవాలయాల్లోని శిల్ప సంపద చాలా చూడ ముచ్చటగా ఉంటుంది.

8. అనేక శిల్పాల సమహారం

8. అనేక శిల్పాల సమహారం

8. అనేక శిల్పాల సమహారం

Image Source:

ఈ దేవాలయం అనేక శిల్పాల సమాహారం. ఇందులోఅనేక రాతి శిల్పాలు నెలకొన్నవి. ఈ దేవాలయం బృహదీశ్వరాలయం లేదా గంగైకొండ చోళీశ్వర దేవాలయాల కంటే కొంచెం చిన్నది. శిల్పకళలో వాటికంటే విశిష్టమైనది. ఎందుకంటే ఈ దేవాలయం నిత్య వినోదం, శాశ్వత వినోదం కోసం నిర్మించబడినట్లు తెలుస్తుంది. ఈ విషయాలన్నీ ఇక్కడి శాసనాల్లో చెప్పబడ్డాయి

9. చాలా ఎత్తులో గోపురం

9. చాలా ఎత్తులో గోపురం

9. చాలా ఎత్తులో గోపురం

Image Source:

ఈ దేవాలయం యొక్క మహద్వారం తూర్పు వైపున ఉంది. ఈ దేవాలయ విమానం (టవర్) 24 మీ (80 అడుగులు) ఎత్తులో ఉంటుంది. దాని దక్షిణం వైపు గల మంటపం పెద్ద రాతి చక్రాలు మరియు గుర్రాలతో కూడుకొని ఉన్న రథం ఆకారంలో ఉంటుంది. ఈ దేవాలయం మంటపాలు అత్యంత శోభాయమానంగా అలంకరింపబడి ఉంటాయి.

 10 సప్త స్వరాలు వినిపిస్తాయి

10 సప్త స్వరాలు వినిపిస్తాయి

10 సప్త స్వరాలు వినిపిస్తాయి

Image Source:

అన్ని శిల్పాలు నిర్మాణం యొక్క సొగసును ద్విగుణీకృతం చేస్తున్నాయి. అంతర్భాగంలో తూర్పు వైపు చెక్కబడిన నిర్మాణాల సముదాయం కలిగి ఉంది. వాటిలో "బలిపీఠం" ఉంది. దాని పీఠములో చిన్న గణేషుని విగ్రహం కలిగి ఉంది. ఈ బలిపీఠం యొక్క పీఠములో దక్షిణ భాగంలో మూడు అందముగా చెక్కబదిన మెట్లు ఉన్నాయి. ఈ మెట్లను తాకినపుడు సంగీతంలోని సప్తస్వరాల శబ్డం వినబడుతుంది.

11. యముడి విగ్రహం కూడా

11. యముడి విగ్రహం కూడా

11. యముడి విగ్రహం కూడా

Image Source:

నైరుతి మూలలో గల మంటపంలో నాలుగు విగ్రహాలున్నాయి. ఇందులో ఒకటి యముడి విగ్రహం. ఈ విగ్రహంతోపాటు అతి పెద్ద రాళ్లపై "సప్తమాతలు" యొక్క శిల్పాలు చెక్కబడినవి. విడిగా నిర్మించబడిన దేవీ యొక్క దేవాలయం ప్రధాన దేవాలయం కంటే తరువాత నిర్మించబడింది. హిందూ దేవాలయ సంస్కృతిలో అమ్మవారి విగ్రహం ఉండటం అత్యవసరమైనదైనందున దీనిని నిర్మించినట్లు తెలుస్తుంది.

12. వివిధ శాసనాలు ఉన్నాయి.

12. వివిధ శాసనాలు ఉన్నాయి.

12. వివిధ శాసనాలు ఉన్నాయి.

Image Source:


ఈ దేవాలయంలో వివిధ శాసనాలున్నాయి. ఇందులో "కుళుత్తుంగ చోళుడు (రెండవ)" దేవాలయాన్ని పురరుద్దరించినట్లు తెలుస్తోంది. వరండా యొక్క ఉత్తర గోడకు 108 విభాగాల శాసనాలున్నాయి. ఇందులో 63 శైవాచార్యుల యొక్క చిత్రం మరియు వివరాలు ఉన్నాయి. వారి జీవితంలో ప్రధాన ఘట్టాలు అన్నీ ఇందులో పొందు పరచబడ్డాయి.

13. నదులకు సంబంధించిన విషయాలు

13. నదులకు సంబంధించిన విషయాలు

13. నదులకు సంబంధించిన విషయాలు

Image Source:

హిందూ మతంలో శైవం యొక్క మూలాలను ఇవి ప్రతిబింబిస్తున్నాయి. ఈ దేవాలయంలో రాజరాజ II కాలంలో దేవాలయంలో గానం చేసిన 108 మంది దేవర ఓతువర్స్ యొక్క ముఖ్యమైన శాసనాలున్నవి. కావేరి, గంగ, యమున, గోదావరి మరియు నర్మద వంటి నదీమ తల్లుల గూర్చి శాసనాలు కూడా ఇక్కడ ఉన్నాయి.

14. చోళుల ఔదార్యం

14. చోళుల ఔదార్యం

14. చోళుల ఔదార్యం

Image Source:

ఈ దేవాలయం చోళుల యొక్క ప్రసిద్ధ దేవాలయాల జాబితాలో స్థానాన్ని 2004 లో సంపాదించింది. చోళుల విశిష్ట దేవాలయాలలో తంజావూరు బృహదీశ్వరాలయం, గంగైకొండ చోళపురం లోని చండైకొండ చోళీశ్వరాలయం మరియు దారసురంలోని ఐరావతేశ్వరాలయాలు ప్రసిద్ధమైనవి. ఈ దేవాలయానన్నీ 10వ మరియు 12 వ శతాబ్దముల మధ్య చోళుల కాలంనాటివి. ఈ మూడింటికి అనేక పోలికలు ఉన్నాయి.

15 కుంభకోణం

15 కుంభకోణం

Image Source:

దక్షిణభారత దేశంలో అత్యంత ప్రాచీనమైన పుణ్యక్షేత్రాలలో కుంభకోణం ఒకటి. ఇది మరియొక ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చిదంబరంకు నైఋతి దిశలో 70 కిలోమీటర్లు (43 మైళ్ళు) దూరంలో ఉంటుంది. పట్టణానికి కావేరి నది ఒకవైపు, అరసలార్ నది ఒకవైపు ప్రవహిస్తూ ఉంటాయి. ఈ కుంభ కోణం చరిత్ర పురాణాల కంటే ప్రాచీణమైనదని చెబుతారు. అందువల్లే ఇక్కడకు భక్తులు ఎక్కువ మంది వస్తుంటారు.

16. అమృతభాండము ఇక్కడే ఆగింది

16. అమృతభాండము ఇక్కడే ఆగింది

16. అమృతభాండము ఇక్కడే ఆగింది

Image Source:


సృష్టి కారకుడైన బ్రహ్మచే సృష్టించబడిన అమృతభాండము ప్రళయంలో కొట్టుకుపోతూ ఆ పరమ శివుడి ఆజ్ఞతో ఇక్కడ వెలిసిందనీ దానివల్లనే ఈ పట్టణానికి కుంభకోణం అని పేరు వచ్చిందనీ స్థానికుల విశ్వాసం. ఈ పట్టణంలో ప్రాచీన దేవాలయాలు చాలా ఉన్నాయి. ఈ విషయాలన్నీ అతి ప్రాచీన శివపురాణంలో స్పష్టంగా పేర్కొనబడ్డాయి.

17. బ్రహ్మ దేవాలయం కూడా

17. బ్రహ్మ దేవాలయం కూడా

17. బ్రహ్మ దేవాలయం కూడా

Image Source:

పన్నెండు శైవ ఆలయాలు, నాలుగు వైష్ణవాలయాలు మరియు అత్యంత అరుదుగా కనిపించే బ్రహ్మ దేవాలయం కూడా ఉంది. వీటిలో సారంగపాణి (విష్ణువు) దేవాలయం చాలా ప్రాశస్త్యమైనది. దీని మధ్యలో ఉండే గోపురం దేవాలయ సముదాయంలో కెల్లా అతి ప్రాచీనమైనది, ఎందుకంటే పన్నెండు మంది వైష్ణవాళ్వార్లలో ఎనిమిది మంది దీని ప్రాశస్త్యాన్ని కీర్తించడం జరిగింది. క్రీ.శ 1300-1700 మధ్యలో నాయక్ రాజులు ఈ ఆలయాన్ని పలుదశల్లో విస్తరించడం జరిగింది.

18. ఎతైన గోపురం

18. ఎతైన గోపురం

18. ఎతైన గోపురం

Image Source:

దీని గోపురం 44 మీటర్ల (146 అడుగులు) ఎత్తు, 12 అంతస్థులు కలిగిఉంటుంది. ఈ గుడికి రెండు ప్రధాన ద్వారాలుంటాయి. దక్షిణ ద్వారాన్ని దక్షిణాయన కాలంలోనూ, ఉత్తర ద్వారాన్ని ఉత్తరాయణ కాలంలోనూ ఉపయోగిస్తారు. ఇలా వేర్వేరు సమయంలో వేర్వేరుగా ప్రధాన ద్వారాలను వినియోగించే దేవాలయం దేశంలో మరెక్కడా లేదని స్థానిక పూజారులు చెబుతుంటారు.

19. కోమల వల్లి అమ్మవారి గోపురం

19. కోమల వల్లి అమ్మవారి గోపురం

19. కోమల వల్లి అమ్మవారి గోపురం

Image Source:


ఆలయానికి ఉత్తర భాగంలో కోమలవల్లి అమ్మవారి గోపురం ఉంటుంది. ఆలయ ఆవరణలో భక్తులు ప్రవేశించే ముందే స్నానం చేయడం కోసం ఒక పుష్కరిణి కూడా ఇక్కడ ఉంది. ప్రతీ సంవత్సరం ఈ పుష్కరిణిలోనే వైభవంగా తెప్పోత్సవం నిర్వహించబడుతుంది. ఇక్కడి పూజలు ఇతర కార్యక్రమాలు పంచరత్ర ఆగమాలను అనుసరించి జరుపబడతాయి.

20 రెండు రథాలు

20 రెండు రథాలు

20 రెండు రథాలు

Image Source:

దేవాలయానికి అత్యంత రమణీయంగా చెక్కబడిన రెండు రథాలు కూడా ఉన్నాయి. కొన్ని ప్రత్యేక సంధర్భాల్లో వాడేందుకు ఒక వెండి రథం కూడా ఉంది. ఈ రథాల పై ఉన్న శిల్పాలను చూస్తూ చూపు పక్కకు తిప్పుకోవడం సాధ్యం కాదు. అంతే కాకుండా ఒకే చిత్రంలో ఆవు, ఏనుగు, వంటి శిల్పాలను మనం చూడవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X