• Follow NativePlanet
Share
» »వినాయకుడు పుట్టిన ప్రదేశం...సందర్శిస్తే సంతానభాగ్యం, అపారతెలివితేటలు సొంతం

వినాయకుడు పుట్టిన ప్రదేశం...సందర్శిస్తే సంతానభాగ్యం, అపారతెలివితేటలు సొంతం

Written By: Beldaru Sajjendrakishore

భారత పురాణా, ఇతిహాసాల్లో ఆది దేవుడిగా పూజలందుకునే వినాయకుడి ప్రస్తావన లేకుండా ఏ ఘట్టం కూడా మొదలు కాదంటే అతిశయోక్తి కాదేమో. అయితే ఆది దంపతుల పుత్రుడైన ఆ పార్వతి తనయుడైన వినాయకుడి జన్మ వత్తాంతం గురించి చాలా మందికి తెలుసు. అయితే ఘటం జరిగిన ప్రాంతం మన దేశంలోని హిమాలయాల పర్వత ప్రాంతాల్లోనే ఉందనేది చాలా మందికి తెలియని విషయం.

వినాయకుడు మొట్టికాయలు తిన్నది ఇక్కడే...

ఇప్పుడిప్పుడే వినాయకుడు పుట్టిన ప్రాంతం పర్యాటక కేంద్రంగా, ప్రముఖ ట్రెక్కింగ్ స్పాట్ గా గుర్తింపు పొందుతున్న ఆ ప్రాంతానికి చేరుకోవాలంటే కొంత దూరం నడక తప్పదు. సముద్ర మాట్టానికి వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం అటు పుణ్యక్షేత్రంగానే కాకుండా ఆహ్లాదకరమైన వాతావరణానికి నిలయంగా ఉంది. ఇక వినాయకుడు పుట్టిన ప్రదేశం చుట్టూ అనేక దేవాలయాలు ఉన్నాయి. ఈ కథనంలో సదరు దేవాలయాల విశేషాలతో పాటు చుట్టు పక్కల ఉన్న ట్రెక్కింగ్ ప్రాంతాల గురించి తెలుసుకుందాం.

1. ఉత్తర కాశిలో...

1. ఉత్తర కాశిలో...

Image source:


వినయకుడు పుట్టిన ప్రదేశం ఉత్తరకాశిలో ఉంది. ఉత్తరకాశి సముద్ర మట్టానికి 1158 మీటర్ల ఎత్తులోఉన్న ఒక అందమైన జిల్లా. తూర్పున చమోలి జిల్లా, ఉత్తరన హిమాచల్ ప్రదేశ్ మరియు టిబెట్ ఉంటాయి. ఈ ప్రదేశం హిందువులకు ఎంతో మతసంబంధ ప్రాముఖ్యత కలిగి ఉంది, మరియు 'నార్త్ కాశీ' అదే విధంగా 'టెంపుల్స్ టౌన్' అని పిలువబడుతుంది.

అందుకే ఇక్కడకు శివభక్తులతో పాటు అఘోరాలు ఎక్కవ సంఖ్యలో వస్తుంటారు. ఇక ఉత్తర కాశిలో ఆ దేవుడు జన్మించిన స్థలం గురించి తెలుసుకునే ముందు చుట్టు పక్కల ఉన్న ఆలయాలు, పర్యాటక ప్రాంతాలను గురించి తెలుసుకుందా.

2. గంగానది ఒడ్డున

2. గంగానది ఒడ్డున

Image source:


ఈ పరమ పవిత్ర నగర గంగానది ఒడ్డున ఉంటుంది. ఋషికేష్‌కు 172 కి.మీ. దూరంలో ఉంది. ఈ ప్రదేశం ప్రసిద్ధి మత సంబంధమైన ప్రాంతాలకు, గంగోత్రి మరియు యమునోత్రికి చేరువలో ఉంది. ఈ ప్రాంతంలో ప్రధానంగా ఉత్తర కురుస్, ఖసస్, కిరతాస్, కునిన్దాస్, తంగనస్ మరియు ప్రతంగనస్ వంటి తెగలకు చెందినవారు నివశిస్తుంటారు. దీంతో ఇక్కడ గిరిజన సంప్రదాయాలను మనం చూడవచ్చు.

3. విశ్వనాథ ఆలయం

3. విశ్వనాథ ఆలయం

Image source:


విశ్వనాథ ఆలయం, ఉత్తరకాశి ఉత్తరకాశి లో ఉన్న ఆలయాల్లో ప్రముఖ ఆలయం విశ్వనాథ ఆలయం. ఈ ఆలయం శివునికి అంకితమివ్వబడింది. ఈ సన్నిధిలో భక్తులు నిత్యం మంత్రాలు పఠిస్తుంటారు. ఇక్కడ ప్రధాన ఆకర్షణ శివుని ఆయుధం త్రిశూలం. ఇది 26 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. ఈ ఆలయం పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మికత తాండవిస్తుంటుంది. ఈ ప్రసిద్ధ ఆలయం ఉత్తరకాశికి 300 మీ. దూరంలో స్థానిక బస్సు స్టాండ్ సమీపంలో ఉంది.

4. రెండు ఘాట్ లు...

4. రెండు ఘాట్ లు...

Image source:


మణికర్ణిక ఘాట్, ఉత్తరకాశి మణికర్ణిక ఘాట్ , ఉత్తరకాశి లో ముఖ్యమైన మత సంబంధ కేంద్రం. పురాణం ప్రకారం, ఉత్తరకాశి పట్టణం గొప్ప ఋషి జడా భారతమాత పశ్చాత్తప్తుడు అయిన ప్రదేశం. ఈ ప్రదేశం గురించి హిందూ మత పుస్తకం స్కంధ పురాణంలో కేదార్ ఖండ్ లో వివరించబడింది. అందువల్లే ఈ చోటును పరమ పవిత్రమైన స్థలంగా హిందువులు భావించి ఎక్కువ సంఖ్యలో ఇక్కడకు వస్తుంటారు.

5. గంగోత్రి ఇక్కడే

5. గంగోత్రి ఇక్కడే

Image source:


గంగోత్రి త్తరకాశి లో ఉన్న ప్రముఖ పుణ్య క్షేత్రం. ఇది సముద్ర మట్టానికి 3750 మీటర్ల ఎత్తున హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్నది. ఈ ప్రాంతం మంచు పర్వతాలు, హిమానీనదాలు, పొడవైన గట్లు, లోతైన సన్నని త్రోవలు, ఊర్ధ్వ శిఖరాలు మరియు సన్నని లోయలు కలిగి ఉంది. అదే విధంగా ఇక్కడ భగీరథి శిల, గంగోత్రి, ఉత్తరకాశి భగీరథి శిల అనేది గంగోత్రి యొక్క ప్రముఖ పర్యాటక ఆకర్షణ. ఈ రాతిశిల మీదే భగీరథ మహారాజు గంగా మాత గురించి తపస్సు చేశాడని పురాణాలు చెపుతున్నాయి.

6. సముద్ర మట్టానికి 3048 మీటర్ల ఎత్తులో...

6. సముద్ర మట్టానికి 3048 మీటర్ల ఎత్తులో...

Image source:


ఉత్తరకాశి దయార బుగ్యల్ అనే ప్రదేశం ఉత్తరకాశి లో సముద్రమట్టానికి 3048 మీటర్ల ఎత్తున ఉన్నది. భట్వారీ గా పిలువబడే ఈ ప్రాంతం ఉత్తరకాశి - గంగోత్రి రోడ్డు మీద ఉన్నది. ఇది ఒక గడ్డి మైదానం. ఇక్కడికి వాహనాల్లో చేరుకోవచ్చు లేకుంటే బసరు గ్రామం నుండి 8 కి. మీ. ట్రెక్కింగ్ చేసుకుంటూ కూడా చేరుకోవచ్చు. ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చే యాత్రికులు మార్గ మధ్యలో శేశనాగ్ ఆలయాన్ని చూడవచ్చు.

7. రుద్రాభిషేకం...

7. రుద్రాభిషేకం...

Image source:


ఏకాదశ రుద్ర ఆలయం, గంగోత్రి, ఉత్తర కాశి ఏకాదశ రుద్ర ఆలయం గంగోత్రి లోని భగీరథి నది ఒడ్డున ఉన్నది. ఇక్కడ జరిగే పూజ ఎంతో ప్రశస్తిగాంచినది. శివుని 11 రుద్రాలకు జరిగే పూజ ఏకాదశ రుద్రాభిషేకం పూజ గా ఖ్యాతికెక్కింది. ఈ సమయంలో ఆ ప్రాంతం మొత్తం శివ శివ శంకర, భం..భం భోళేనాథ్ నాథ్, హరహర మహాదేవ నామ స్మరణలతో మర్మోగుతంది. అఘోరాలు ఈ రుద్రాభిషేకం జరపడానికే సుదూర ప్రాంతాలనుంచి ఇక్కడికి వస్తారు.

8. గంగోత్రి ఆలయం

8. గంగోత్రి ఆలయం

Image source:


గంగోత్రి, ఉత్తరకాశి గంగోత్రి టెంపుల్ భగీరథి నది ఒడ్డున ఉన్నది. ఈ ఆలయం సముద్ర మట్టానికి 3200 మీ. ల ఎత్తున కలదు. ఈ టెంపుల్ లో గంగా మాత విగ్రహం వుంటుంది. చలికాలంలో ఈ టెంపుల్ అధిక మంచు కారణంగా మూసివేస్తారు. ఆలయానికి సమీపం లో అనేక ఆశ్రమాలు కలవు. వీటిలో యాత్రికులు బస చేయవచ్చు. ఇక్కడికి దగ్గర్లోనే గ్యానేశ్వర దేవాలయం కూడా భగీరథి నది ఒడ్డున ఉన్నది. ఈ దేవాలయం లో చాలా మంది భక్తులు తమ వారి క్షేమం కోసం వచ్చి పూజలు, యగ్ఞాలు, వ్రతాలు చేస్తుంటారు.

9. నీటిలో మునిగి ఉన్న శివలింగం,

9. నీటిలో మునిగి ఉన్న శివలింగం,

Image source:


గంగోత్రి, ఉత్తరకాశి నీటిలో మునిగి ఉన్న శివలింగం, గంగోత్రి యొక్క పవిత్ర పర్యాటక ఆకర్షణ. ఈ సహజ శివలింగాన్ని, శీతాకాలంలో నీటి మట్టం తగ్గటంవలన, ఆ కాలంలో మాత్రమే చూడగలం. దీనిని జలమగ్న శివలింగం అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం, శివుడు ఈ ప్రదేశంలోనే గంగను తన శిఖలో బంధించాడని చెపుతారు. అందువల్ల ఇక్కడ ఆ పరమశివుడిని భక్తి శ్రద్ధలతో కొలిస్తే వ్యవసాయ రంగంలోని వారికి మేలు జరుగుతుందని చెబుతారు.

10. పాండవ గుఫా,

10. పాండవ గుఫా,

Image source:


గంగోత్రి, ఉత్తరకాశి పాండవ గుఫా మహాభారత కాలం నాటిది. గొప్ప శివ భక్తులైన పాండవులు ఈ గుహలోనే ధ్యానం చేసేవారని పురాణాలలో పేర్కొన్నారు. గంగోత్రి నుండి యాత్రికులు ఇక్కడికి ట్రెక్కింగ్ ద్వారా మాత్రమే చేరుకుంటారు. ట్రెక్కింగ్ మార్గం ఒకటిన్నారా కిలోమీటరు ఉంటుంది. చుట్టూ ఉన్న తెల్లని మంచుకొండలను చూస్తూ అలా నడుచుకుంటూ వెళ్లడం మరిచిపోలేని అనుభూతిని ఇస్తుంది.

11. సూర్య కుండ్ మరియు గౌరీ కుండ్

11. సూర్య కుండ్ మరియు గౌరీ కుండ్

Image source:


గంగోత్రి, ఉత్తరకాశి సూర్య కుండ్ మరియు గౌరీ కుండ్ అనేవి గంగోత్రి లో ఉన్న రెండు చెరువుల పేర్లు. ఇవి ప్రధాన గంగోత్రి ఆలయానికి చేరువలో ఉన్నాయి. యాత్రికులు ఈ చెరువుల్లో ప్రవహిస్తున్న నీటి సవ్వడులను వింటూ ఆనందాన్ని ఆస్వాదించవచ్చు. ఇక్కడి జలాన్ని తల పై వేసుకుంటే సర్వ పాపాలు పోతాయని చెబుతారు. ఇక్కడకు కూడా ట్రెక్కింగ్ ద్వారా చేరుకోవలసి ఉంటుంది.

12. గంజ్ఞాని

12. గంజ్ఞాని

Image source:


గంజ్ఞాని, గంగోత్రి లో ధ్యానం కు అనువైన ఆధ్యాత్మిక స్థలం. అందమైన పర్వతాలు, ఆహ్లాదకర వాతావరణం ఇక్కడి ప్రదేశ అందాల్ని మరింతగా పెంచాయి. సాధారణంగా ఇక్కడి రిషికుండ్ అనే నీటి కొలనులో స్నానాలు చేసిన తర్వాత గంగోత్రి ఆలయాన్ని సందర్శిస్తుంటారు భక్తులు. ఇక ఈ ఆధ్యాత్మిక స్థలంలో అఘోరాలు కొన్ని రోజుల పాటు ధ్యానంలో మునిగిపోతారు. కేవలం అఘోరాలే కాకుండా సాధారణ భక్తులు కూడా ఇక్కడ ధ్యానం చేస్తుంటారు.

13. యమునోత్రి... గంగోత్రి

13. యమునోత్రి... గంగోత్రి

Image source:


ఇవి రెండూ కూడా ఒకదానికొకటి 50 కి. మీ. దూరంలో ఉంటాయి. ఈ ప్రదేశంలోనే పవిత్ర యమునా నది పుట్టింది. సముద్రమట్టానికి 3293 మీటర్ల ఎత్తులో ఈ ప్రదేశం ఉన్నది. సాదారణంగా యమునోత్రి చేరుకోవాలంటే భక్తులు కాస్త అవస్థలు పడక తప్పదు. మార్గం అంతా కూడా అడవులతో నిండి ఉండి, ఎత్తుపల్లాలుగా ఉంటుంది. ట్రెక్కింగ్ చేయాలంటే ఒకరోజు పడుతుంది. గాడిదలు, గుర్రాలు వంటి వాటి మీద ప్రయాణించి భక్తులు యమునోత్రిని సందర్శిస్తుంటారు.

14. యమునోత్రి ఆలయం

14. యమునోత్రి ఆలయం

Image source:


యమునోత్రి, ఉత్తరకాశి యమునోత్రి టెంపుల్ సముద్రమట్టానికి 3235 మీ.ల ఎత్తున కలదు. ఇక్కడ యమునా దేవి విగ్రహం వుంటుంది. దీనితో పాటు హిందూ దేముడు యమ ధర్మరాజు విగ్రహం కూడా వుంటుంది. ఇది చార్ ధామ్ గా చెప్పబడే నాలుగు టెంపుల్స్ లో ఒకటి. ఈ టెంపుల్ ద్వారాలు 'అక్షయ తృతీయ' నాడు మాత్రమే తెరుస్తారు. దీంతో అక్షయ తృతీయ నాటికి యాత్రికులు ఇక్కడకు వచ్చేలా తమ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు.

15. సూర్యకుండ్

15. సూర్యకుండ్

Image source:
యమునోత్రి సమీపంలోని ఒక వేడి నీటి బుగ్గ. ఈ స్ప్రింగ్ యొక్క వేడి నీరు ఆలయ ప్రసాదం తయారు చేసేందుకు అవసరమైన రైస్ మరియు ఆలు(ఉర్లగడ్డ)లు ఉడికించేందుకు ఉపయోగిస్తారు. మాత యమునోత్రి కి ప్రసాదం నైవేద్యం పెట్టిన తర్వాత దానిని భక్తులకు ప్రసాదం గా పంపిణీ చేస్తారు. చుట్టూ మంచు పర్వతాల నడుమ వేడి నీటి బుగ్గ ఉండటం ఆ దేవి కటాక్షం వల్లే సాధ్యమయ్యిందని భక్తులు విశ్వసిస్తుంటారు.

16. బర్కోట్

16. బర్కోట్

Image source:


సముద్రమట్టానికి సుమారు 1220 మీ. ల ఎత్తులో, యమునోత్రి కి 4 కి.మీ.ల దూరంలో కలదు. పర్యాటకులు ఇక్కడ నుండి బందర్ పూంచ్ పర్వతశిఖరాలతో పాటు యమునా నది, పచ్చటి ప్రదేశాలు, ఆపిల్ తోటలు చూడవచ్చు. యమునోత్రి వెళ్ళే వారికి ఇది ఒక పర్యాటక మజిలీగా వుంటుంది. ఇక యమునోత్రి ఆలయానికి సమీపంలో ఉన్న దివ్యశిల అనేది ఒక రాతిస్తంభం. ఈ దివ్య శిల ను భగవంతుని వెలుగు గా చెబుతారు. యమునోత్రి ఆలయానికి వెళ్ళేవారు ముందుగా ఈ దివ్య శిల ను పూజించి లోనికి వెళతారు.

17. ఖర్సాలి

17. ఖర్సాలి

Image source:


యమునోత్రి కి కిలోమీటరు దూరంలో ఉన్న గ్రామం. ఇక్కడి ప్రక`తి రమణీయతను చూసి తీరాల్సిందే కాని మాటలతో చెప్పడానికి వీలు కాదు. ముఖ్యంగా ఇక్కడ అనేక జలపాతాలు, వేడి నీటి బుగ్గలు, పచ్చటి మైదానాలు కలవు. వీటిని చూస్తూ సమయాన్ని మరిచిపోతామంటే అతిశయోక్తి కాదేమో. కేవలం ప్రక`తి రమణీయతే కాకుండా ఇది అధ్యాత్మికత ప్రాంతం కూడా. ఇక్కడ కల మూడు అంతస్తుల్లో ఉన్న శివాలయాన్ని కూడా భక్తులు సందర్శించుకోవచ్చు.

18. హనుమాన్ చట్టి

18. హనుమాన్ చట్టి

Image source:


ఇది సముద్ర మట్టానికి 2400 మీ. ల ఎత్తున ఉన్నది. ఇది సరిగ్గా గంగ మరియు యమునా నది కలిసే ప్రాంతం లో కలదు. గతంలో ఇది ట్రెక్కింగ్ పాయింట్ గా వుండేది. యమునోత్రి కి ఇది 13 కి.మీ.ల దూరంలో ఉంది. గతం తో పోలిస్తే ఇప్పుడు సౌకర్యాలు బాగానే ఉన్నాయి. దీంతో దీనిని భక్తులే కాకుండా ఇటీవల కాలంలో ట్రెక్కింగ్ ప్రియులు ఎక్కువగా సందర్శిస్తుంటారు. ఇక్కడకు వెళ్లే వారు గైడ్ ను తీసుకుని వెళ్లడం మంచిది.

19. గోముఖ్

19. గోముఖ్

Image source:


గంగోత్రి హీమానీనదం యొక్క చివరి భాగం. ఈ ప్రదేశంలోనే భగీరథి నది ఉద్భవించినది. ఈ స్థలంలో కష్టసాధ్యమైన ట్రెక్కింగ్ ప్రదేశం శివలింగ శిఖరం ఉన్నది. మంచుచే కప్పబడ్డ శిఖరాలు సందర్శకులను మంత్ర ముగ్ధులను చేస్తాయి. హీమానీనదం యొక్క చివరి భాగం ఆవు నోరు ని పోలి ఉంటుంది కనుకనే ఈ స్థలానికి గోముఖ్ అని పేరు. ఈ స్థలాన్ని హిందువులు పరమ పవిత్రమైన ప్రాంతంగా భావించి పూజలు చేస్తారు

20. భగీరథి నది...

20. భగీరథి నది...

Image source:


గంగా నది యొక్క ముఖ్య ఉపనది అయిన భగీరథి నది, గోముఖ్ వద్ద పుట్టినది. ఇది హిందువులు పవిత్రంగా భావించే నదుల్లో ఒకటి. పురాణాల ప్రకారం, ఈ రాజు కపిల మహర్షి శాపం నుండి తన 60,000 పినతండ్రులను విడుదల చేసేందుకు స్వర్గం నుండి గంగా నదిని తీసుకువచ్చాడు. నది యొక్క మూలం సముద్రమట్టానికి 3,892 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడి ద`ష్యాలు మనకు కనువిందును చేస్తాయనడంలో అతిషయోక్తి కాదేమో..

21. నందనవనం మరియు తపోవనం

21. నందనవనం మరియు తపోవనం

Image source:


గంగోత్రి హిమానీనదానికి మరియు గంగోత్రికి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది బండరాళ్ళ మధ్య దూకడం, హిమానీనదాల యాత్ర మరియు రాతి అధిరోహణ వంటి సాహస చర్యలతో కూడిన ప్రసిద్ధ పర్వతారోహణ స్థలం .యాత్రికులు నందనవనం నుండి ట్రెక్కింగ్ చేసుకుంటూ రాతి భూభాగం గుండా వెళ్లి చివరికి తపోవనం యొక్క పచ్చికబయల్లో తేలుతారు. అడ్వెంచర్ టూరిజం ఇష్టపడే వారికి ఈ ప్రయాణం బాగా నచ్చుతుంది.

22. హర్ కి డూన్

22. హర్ కి డూన్

Image source:


సముద్ర మట్టానికి 3556 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక సుందరమైన లోయ. ఇది హిమాలయాల్లో పర్వతారోహణలలో ఒకటిగా చెప్పబడుతుంది మరియు పర్వతం చుట్టూ అందమైన పైన్ అడవులు కలవు. ఈ ప్రదేశం ప్రకృతి ప్రేమికులకు మరియు పక్షులను గమనించే వారికీ ఒక ఆకర్షణీయ ప్రదేశంగా ఉంది. అదే విధంగా మనేరి. ఉత్తరకాశి నుండి 2 కి. మీ. ప్రయాణం దూరంలో ఉన్న ఒక గ్రామం. ఇక్కడ భగీరథి నది పై నిర్మించిన ఆనకట్ట ప్రముఖ ఆకర్షణగా ఉన్నది.

23. భైరవుని ఆలయం

23. భైరవుని ఆలయం

Image source:


ఉత్తరకాశి భైరవుని ఆలయం, ఉత్తరకాశి యొక్క చౌక్ ప్రాంతంలో ఉంది. హుయాన్ త్సాంగ్ అనే చైనీస్ యాత్రికుడు క్రి.శ.629 లో భారతదేశం లో పర్యటించి ఈ స్థలానికి బ్రహ్మపుర అనే పేరు పెట్టాడు. హిందూ మత పుస్తకమైన స్కంధ పురాణంలో ఈ ప్రదేశం గురించి పేర్కొనటం జరిగింది. అదే విధంగా కర్ణ దేవత ఆలయం. ఉత్తరకాశిలో సర్నుల్ విలేజ్ లో ఉంది. యాత్రికులు ఈ గ్రామం చేరుకోవడానికి నెట్వర్ నుండి 1.5 మైళ్ళ దూరం వెళ్ళాలి. ఇక్కడికి భక్తులు తరచూ వస్తుంటారు.

24. కపిల్ ముని ఆశ్రమం,

24. కపిల్ ముని ఆశ్రమం,

Image source:


ఉత్తరకాశి కపిల్ ముని ఆశ్రమం సముద్ర మట్టానికి 4500 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ స్థలాన్ని ధ్యాన యోగి కపిల్ మునికి అంకితం చేసారు. తన ప్రార్థనలుకు తృప్తిచెంది, శివుడు మహర్షికి ఆశీర్వాదం ఇచ్చారు. ఇక్కడ శివలింగాన్ని సైతం ప్రతిష్టించారు. అంతే కాకుండా, ప్రయాణికులు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామ ఆలయంను ను కూడా పనిలోపనిగా సందర్శించవచ్చు. ట్రెక్కింగ్ కు చాలా అనుకూలమైన ప్రాంతం.

25. ఫోకు దేవత ఆలయం

25. ఫోకు దేవత ఆలయం

Image source:


ఉత్తరకాశిలో ఫోకు దేవతా ఆలయం యమునా నదికి ఉపనదైన టన్నుల నది పక్కన ఉంది. ఈ ప్రాంతంలో కర్ణ మందిర్ మరియు దుర్యోధన మందిర్ అనే రెండు ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి. మొత్తం గ్రామం చుట్టూ అందమైన దేవదారు, చీర్ చెట్లు ఉన్నాయి. లోయ నుండి ఒక సన్నని మార్గం గుండా ఇనుప వంతెన ద్వారా ఫోకు దేవతా ఆలయం ను చేరుకోవచ్చు. ఇనుప వంతెన పై నడుచుకుంటూ వెళ్లడం మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది.

26. నచికేత తాల్

26. నచికేత తాల్

Image source:


ఉత్తరకాశి నచికేత తాల్, ఉత్తరకాశి నుండి 32 కి.మీ. దూరంలో ఉన్న ఒక అందమైన సరస్సు. ఈ సరస్సు చుట్టూ ఓక్, పైన్, మరియు రోడోడెండ్రాన్ చెట్లు ఉంటాయి. యాత్రికులు చౌరంగి ఖల్ నుండి 3 కి.మీ. ట్రెక్కింగ్ మార్గం ద్వారా నచికేత తాల్ ను చేరుకోవచ్చు. అదే విధంగా శనిదేవాలయం ఉత్తరకాశి శని దేవాలయం ఉత్తరకాశి లోని ఖర్సలి గ్రామంలో ఉంది. పురాణాల ప్రకారం, ఈ ఆలయం హిందూ మత దేవత అయిన యమునా సోదరుడు శనికి అంకితం ఇవ్వబడింది. ఈ ఆలయం సముద్ర మట్టానికి 7000 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఐదు అంతస్తుల ఆలయం రాయి మరియు కలప ను ఉపయోగించి కట్టించినారు.

27. శక్తి ఆలయం

27. శక్తి ఆలయం

Image source:


ఉత్తరకాశి శక్తి ఆలయం, విశ్వనాథ్ ఆలయానికి సమీపంలో ఉంది. ఈ ఆలయం లో 6 మీ.ల త్రిశూలము ప్రసిద్ధి చెందింది. దీనిని ఇనుము మరియు రాగి తో తయారు చేసారని నమ్ముతారు. పౌరాణిక కథలు ప్రకారం, ఈ త్రిశూల్ రాక్షసులను చంపడానికి హిందూ మత దేవతైన దుర్గాదేవిచే ఉపయోగించబడింది. అదే విధంగా ధూర్యోధన మందిర్, ఉత్తరకాశి దుర్యోధన మందిర్ ఉత్తరకాశి లో ఉన్న సార్ గ్రామంలో నెలకొని ఉన్న ఒక అందమైన దేవాలయం. ఈ ఆలయాన్ని భక్తులు తరచూ వచ్చి సందర్శిస్తుంటారు.

28. ఇక్కడే వినాయకుడు జన్మించింది.

28. ఇక్కడే వినాయకుడు జన్మించింది.

Image source:


ఉత్తరకాశిలో దోదితాల్ అనే ప్రాంతం సముద్ర మట్టానికి 3024 మీటర్ల ఎత్తున ఉన్నది. ఇది ఒక మంచినీటి సరస్సు. అందమైన ఈ సరస్సు చుట్టూ ఎంతో పచ్చదనం కనపడుతుంది. ఈ ప్రదేశానికి చేరుకోవాలంటే గొప్ప సాహసం చేయక తప్పదు. ఇక్కడే పార్వతి దేవి స్నానం చేసే సమయంలో సున్ని పిండితో వినాయకుడి బొమ్మను తయారు చేసి ప్రాణం పోసిందని స్థానిక భక్తుల విశ్వాసం. ఈ ప్రాంతాన్ని సందర్శిస్తే సంతానం లేని వారికి సంతాన భాగ్యం తప్పక లభిస్తుందని చెబుతారు. అంతేకాకుండా సూక్ష్మబుద్ధి, అపార తెలివితేటలు సొంతమవుతాయనేది భక్తుల విశ్వాసం.

29. చాలా అహ్లాదకరంగా

29. చాలా అహ్లాదకరంగా

Image source:

ఈ ప్రదేశం చూడటానికి చాలా కోమలంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడే ఒక విఘ్నేశ్వర ఆలయం కూడా ఉంది. దోదితాల్ సరస్సు చుట్టూ మంచు పర్వతాలతో కప్పబడి ఉంటుంది. ఈ ప్రదేశానికి వెళ్ళేటప్పుడు స్వెటర్లు, తలకి టోపీలు, చేతికి గ్లౌజ్ లు తొడుక్కోవాలి. సహాయకునిగా ఒక గైడ్ ను కూడా తీసుకోవచ్చు. కానీ ఆయాసం, ఆస్తమా ఉన్న వ్యక్తులైతే ఈ ట్రెక్కింగ్ చేయకపోవడం మంచిది. ఒకవేళ వెళితే మందులు, ఆహారం తీసుకొని ప్రయాణించాలి.

30. ఉత్తరకాశి ఎలా చేరుకోవాలి ?

30. ఉత్తరకాశి ఎలా చేరుకోవాలి ?

Image source:


విమాన మార్గం ఉత్తరకాశి కి, 183 కి.మీ. దూరంలో ఉన్న డెహ్రాడూన్ జాలీ గ్రాంట్ విమానాశ్రయం సమీపంలోని విమానాశ్రయం. ఈ విమానాశ్రయం నుండి సాధారణ విమానాలు ద్వారా న్యూఢిల్లీ ఇందిరా మహాత్మా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అనుసంధానించబడింది. యాత్రికుల ఉత్తరకాశి చేరుకోవడానికి జాలీ గ్రాంట్ విమానాశ్రయం నుండి టాక్సీలు అద్దెకు తీసుకోవచ్చు. దాదాపు ఐదు రోజుల పాటు ఈ పర్యటన సాగుతుంది.

31.మన దగ్గర నుంచి కూడా

31.మన దగ్గర నుంచి కూడా

Image source:


మన హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాల నుండి ఢిల్లీ చేరుకొని, అక్కడి నుండి ఉత్తర కాశి చేరుకోవచ్చు. రైలు మార్గం రుషికేష్, హరిద్వార్ రైల్వే స్టేషన్లు ఉత్తరకాశి కి దగ్గరగా ఉంటాయి . ఈ రెండు రైల్వే స్టేషన్లు ముంబై, ఢిల్లీ, హౌరా, లక్నో వంటి ప్రధాన నగరాలతో అనుసంధానం చేయబడింది. మన రాష్ట్రంలోని ముఖ్య పట్టణాల నుండి కూడా రైళ్లు ఇక్కడికి వెళుతుంటాయి.

32. రోడ్డు మార్గం ద్వారా

32. రోడ్డు మార్గం ద్వారా

Image source:


రోడ్డు మార్గం ఉత్తరకాశికి డెహ్రాడూన్, రుషికేష్, హరిద్వార్ మరియు ముస్సోరీ వంటి నగరాల నుండి ప్రభుత్వ బస్సులు నడుస్తుంటాయి. దేశ రాజధాని ఢిల్లీ మరియు డెహ్రాడూన్ వంటి పెద్ద నగరాల నుండి ఉత్తరకాశి కి ప్రైవేట్ బస్సులు, వాహనాలు సైతం అందుబాటులో ఉంటాయి. ట్రెక్కింగ్ చేయాలనుకొనే వారు ముందుగానే గైడ్ ను మాట్లాడుకుంటే మంచిది. దీని వల్ల సమయం, శ్రమ రెండు ఆదా అవుతాయి.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి