Search
  • Follow NativePlanet
Share
» »చనిపోయిన తర్వాత ఆత్మ మొదట వెళ్లేది ఇక్కడికే...యమాలయం దేశంలో ఇదొక్కటే

చనిపోయిన తర్వాత ఆత్మ మొదట వెళ్లేది ఇక్కడికే...యమాలయం దేశంలో ఇదొక్కటే

దేశంలో ఏకైక యమధర్మరాజ దేవాలయానికి సంబంధించిన కథనం

By Beldaru Sajjendrakishore

చనిపోయిన తర్వాత అప్పటి వరకూ ఉన్న శరీరాన్ని వదిలి ఆత్మ మరో శరీరంలోకి ప్రవేశిస్తుందని భారతీయుల నమ్మకం. ఈ మధ్య కాలంలో చేసిన పాప పుణ్యాలను అనుసరించి సదరు జీవి పర లోకంలో శిక్షను అనుభవిస్తాడని చెబుతారు. తరతమ భేదం లేకుండా యమధర్మరాజు ఈ శిక్షలను విధిస్తాడంటారు. ఇలా యమధర్మరాజు శిక్షలు విధించే చోటు భారత దేశంలోని హిమాచల్ ప్రదేశ్ లోని బర్మోరలో ఉంది. జీవి చనిపోయిన తర్వాత ఆత్మ మొదట ఇక్కడకు వెళ్లి తన శిక్ష ఏమిటన్నది తెలుసుకుని తర్వాత పరలోకానికి వెలుతుందని చెబుతారు. ఈ విషయమై నేటివ్ ప్లానెట్ పాఠకుల కోసం కథనం

1.చౌరాసి దేవాలయం సముదాయంలో

1.చౌరాసి దేవాలయం సముదాయంలో


P.c Jaryal007

హిమాచల్ ప్రదేశ్ లోని బర్మోర్ పట్టణంలో చౌరాసి దేవాలయాల సముదాయం ఉంది. ఇక్కడ మొత్తం 84 దేవాలయాలు ఉండటం వల్ల ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. ఇందులోని ఒక దేవాలయమే ధర్మేశ్వర్ మహాదేవ దేవాలయం.
2. మొదట ఇక్కడికే

2. మొదట ఇక్కడికే

P.C Unkown

ప్రతి జీవి ప్రాణం పోయిన తర్వాత ఆత్మ మొదట ఈ దేవాలయానికి తప్పక వస్తుందని ఇక్కడి నమ్మకం. ఈ విషయం గరుడ పురాణంతో పాటు మరికొన్ని పురాణాల్లో ప్రస్తావించారు.
3. చూడటానికి ఒక ఇల్లు

3. చూడటానికి ఒక ఇల్లు

P.C Varun Shiv Kapur

ఈ దేవాలయం చూడటానికి ఒక ఇల్లు వలే ఉంటుంది. ఈ ఇంట్లోనే యమధర్మరాజు, చిత్రగుప్తుడు ఉంటూ పాప పుణ్యాల భేరీజు వేసి శిక్ష ఖరారు చేస్తారని స్థానికులు చెబుతారు.

4.రెండు ఖాళీ గదులు

4.రెండు ఖాళీ గదులు


P.C Chore Bagan Art Studio

ఈ ఇల్లు లాంటి దేవాలయంలో రెండు ఖాళీ గదులు ఉంటాయి. మొదటి గదిలో చిత్రగుప్తుడు ఉంటారని చెబతారు. ఆత్మను యమభటులు ఇక్కడికి తీసుకువచ్చిన తర్వాత సదరు జీవి చేసిన పాపపుణ్యాలను విడమరిచి చెబుతాడు

5.శిక్ష ఖరారు ఇక్కడే

5.శిక్ష ఖరారు ఇక్కడే


Image source

అటు పై ఆత్మ రెండో గదిలోకి వెలుతుంది. అక్కడ సదరు పాపపుణ్యాలను అనుసరించి అక్కడ శిక్ష ఖరారు అవుతుంది. శిక్ష ఖారారైన తర్వాత యమలోకానికి వెళ్లి అక్కడ సదరు శిక్ష అనుభవిస్తుంది.

6. కంటికి కనిపించని ద్వారాలు

6. కంటికి కనిపించని ద్వారాలు


P.C Indian Drawings from the Paul F. Walter Collection

ఈ ఆలయంలో మరో నాలుగు కంటికి కనిపించని ద్వారాలు కూడా ఉన్నాయని చెబుతారు. అవి వరుసగా బంగారు, వెండి, కంచు, రాగితో తయారు చేయబడినవని చెబుతారు. పాపపుణ్యాలను అనుసరించి ఆత్మ వీటి ద్వారా బయటికి వస్తుందని స్థానికుల నమ్మకం.

7. దేశంలో ఇదొక్కటే

7. దేశంలో ఇదొక్కటే


Image source

సాధారణంగా యముడుని చావుకి ప్రతిరూపంగా భావిస్తారు. అందువల్లే యమధర్మరాజుకు చాలా దూరంగా ఉండాలని ప్రతి ఒక్కటూ కోరుకుంటారు. బహుషా ఇందుకేనేమో దేశంలో బర్మోర్ తప్ప మరెక్కడా యమధర్మరాజు దేవాలయం ఉండదు.

8. అత్యంత పురాతన దేవాలయాలు

8. అత్యంత పురాతన దేవాలయాలు


P.C Unknown

క్రీస్తు పూర్వం నిర్మించినట్లు చెప్పబడే మహిషాసుర మర్థిని రూపంలో ఉన్న దుర్గాదేవి ఆలయం, మణిమహేష్ దేవాలయం, నరసింహ దేవాలయం తదితర దేవాలయాలు ఈ చౌరాసి దేవాలయ సముదాయంలో ఉన్నాయి.

9. ఎక్కడ ఉంది

9. ఎక్కడ ఉంది


P.C Jaryal007

హిమాచల్ ప్రదేశ్ లోని చాంబా జిల్లాలో బర్మోర్ దేవాలయం ఉంది. ఈ పట్టణం ధర్మశాలకు 145 కిలోమీటర్ల దూరం, సిమ్లాకు 350 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

10. ఎలా చేరుకోవాలి

10. ఎలా చేరుకోవాలి


Image source

బర్మోర్ కు దగ్గరగా అంటే దాదాపు 199 కిలోమీటర్ల దూరంలో ధర్మశాల విమానాశ్రయం ఉంది. అక్కడి నుంచి ప్రభుత్వ, ప్రైవేటు బస్సు సదుపాయాలు ఉన్నాయి. ట్యక్సీలు కూడా తిరుగుతున్నాయి.

11. రైలు సదుపాయం

11. రైలు సదుపాయం


Image source

బర్మోర్ కు దగ్గరగా పఠాన్ కోట్ రైల్వే స్టేషన్ ఉంది. రెండు నగరాల మధ్య దూరం 190 కిలోమీటర్లు. రైల్వే స్టేషన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా బర్మోరకు చేరుకోవచ్చు.
12. రోడ్డు ప్రయాణం

12. రోడ్డు ప్రయాణం


Image source

హిమాచల్ ప్రదేశ్ లోని పలు నగరాల నుంచి బర్మోరకు బస్సు సదుపాయాలు ఉన్నాయి. చాంబ నుంచి 60 కిలోమీటర్లు, ధర్మశాల నుంచి 145 కిలోమీటర్ల దూరం ఉంటుంది.

13. చూడదగిన మరికొన్ని ముఖ్యమైన ప్రాంతాలు

13. చూడదగిన మరికొన్ని ముఖ్యమైన ప్రాంతాలు


Image source

సముద్ర మట్టానికి 2195 మీటర్ల ఎత్తులో ఉన్న బర్మోర చుట్టూ మంచుతో కప్పబడిన పర్వతాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ధర్మశాల, సింమ్లా వంటి ప్రాంతాలకు వేసవి కాలంలో ఇక్కడకు ఎక్కువ మంది వస్తుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X