» »3500 ఏళ్ల మామిడి చెట్టు ఉన్న పుణ్యక్షేత్రం ఇదే

3500 ఏళ్ల మామిడి చెట్టు ఉన్న పుణ్యక్షేత్రం ఇదే

Written By: Beldaru Sajjendrakishore

ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి అస్తమించారు. ఈ కామకోటి మఠంను తమిళనాడులోని కంచి నగరంలో ఆది శంకర స్థాపించారు. ఇది ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా శైవ, వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటి పంచభూత క్షేత్రాల్లో ఒకటైన పృథ్వీ లింగము ఇక్కడే ఉంది. ఇక దేశంలోని 108 వైష్ణవ క్షేత్రాల్లో ఒకటైన వరదరాజస్వామి దేవాలయం ఇక్కడే ఉంది. ఇక చారిత్రాత్మకంగా కూడా ఈ కంచి ఎంతో ప్రముఖ్యం కలిగినది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కంచి పట్టుచీరలు ఇక్కడే ఉత్పత్తి అవుతాయి. ఇన్ని విశిష్టతలు కలిగిన కంచి వేసవి పర్యాటక కేంద్రంలో ఒకటిగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కంచికి సంబంధించిన సంబంధించిన వివరాలు నేటివ్ ప్లానెట్ పాఠకుల కోసం

1. కాంచిపురమే కంచి...

1. కాంచిపురమే కంచి...

Image source

తమిళనాడు రాష్ట్రంలో బంగాళాఖాతం తీరంలో ఉన్న చెన్నై నగరానికి 70 కి.మీ దూరంలో కంచి ఉంది. దీనిని కాంచీపురం, లేదా కాంజీపురం అని కూడా అంటారు.

2. పంచభూత క్షేత్రాల్లో ఒకటి

2. పంచభూత క్షేత్రాల్లో ఒకటి

Image source

పంచభూత క్షేత్రాల్లో కంచి ఒకటి. పంచ భూత స్థలాలు అయిదు ప్రముఖ శివాలయాలను సూచించును. ఈ అయిదింటిలోఒకొక్కటీ ఒక్కొక్క మూలకమునకు ప్రాతినిధ్యము వహియించును. అందులో భూమికి ప్రాతినిధ్యము వహించే పృథ్వీ లింగము ఏకాంబరేశ్వర ఆలయంలో ఉంది.

3. పంచభూత క్షేత్రాల వివరాలు ఇలా...

3. పంచభూత క్షేత్రాల వివరాలు ఇలా...

Image source

మూలకము లింగము దేవాలయం ప్రాంతము
నింగి ఆకాశ లింగము నటరాజ స్వామిదేవాలయం చిదంబరము (తమిళనాడు)
నేల పృథ్వీ లింగము ఏకాంబరేశ్వరాలయము కంచి (తమిళనాడు)
గాలి వాయులింగము శీకాళహస్తీశ్వరాలయము శ్రీకాళహస్తి (ఆంధ్రప్రదేశ్)
నీరు జలలింగము జంబుకేశ్వర దేవాలయం తిరువానైక్కావల్ (తమిళనాడు)
నిప్పు అగ్నిలింగము అరుణాచలేశ్వరాలయము తిరువణ్ణామలై (తమిళనాడు)

 4. మామిడి చెట్టు కింద వెలిసిన దేవుడు

4. మామిడి చెట్టు కింద వెలిసిన దేవుడు

Image source

కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర దేవాలయం పంచభూత క్షేత్రాలలో ఒకటి. ఈ దేవాలయంలోని ప్రధాన దైవం శివుడు. ఇక ఏకామ్రేశ్వరస్వామి ఆంటే ఒక్క మామిడి చెట్టు కైంద వెలసిన స్వామి అని అర్థం. ఏకాంబరేశ్వరుడు భూమిని సూచిస్తాడు. ఈ క్షేత్రం యొక్క పురాణగాథను ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఎడమ వైపున చిత్రాలలో తిలకించవచ్చు.

5. నాలుగు గాలి గోపురాలు

5. నాలుగు గాలి గోపురాలు

Image source

ఆలయంలో నాలుగు వైపులా నాలుగు గాలి గోపురాలు ఉన్నాయి. ఒక్కొక్క గాలి గోపురం ఎత్తు 57 మీటర్లు. దేవాలయం లోపలి మండపంలో వెయ్యి స్తంభాలు ఉన్నాయి. ఆలయంలో 1,008 శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి.

6.3500 ఏళ్ల మామిడి చెట్టు

6.3500 ఏళ్ల మామిడి చెట్టు

Image source

ఈ దేవాలయంలో ఉన్న 3,500 సంవత్సరాల వయస్సు కల మామిడి వృక్షంలోని నాలుగు కొమ్మలు నాలుగు రకాల రుచిగల పళ్ళు కాస్తాయి. సంతానంలేని దంపతులు ఈ చెట్టు క్రిందపడే పండు పట్టుకొని ఆ పండుని సేవిస్తే సంతానం కలుగుతుందని ఇక్కడి ప్రజల నమ్మకం.

7. అద్దాల పెట్టేలో

7. అద్దాల పెట్టేలో

Image source

అయితే ఇంతటి ప్రాశస్త్యం కలిగిన ఈ మామిడి వృక్షం యొక్క కాండాన్ని మాత్రమే ప్రస్తుతం మనం చూడగలం. ఈ మామిడి వృక్షం యొక్క కాండాన్ని అద్దాల పెట్టెలో ఉంచి దేవాలయంలో భద్రపరిచారు.

8. కొత్త చెట్టు నాటారు..

8. కొత్త చెట్టు నాటారు..

Image source

ఇప్పుడు పురాతన మామిడి వృక్షం స్థానంలో, దేవస్థానం వారు కొత్తగా మరో మామిడి వృక్షం నాటారు. మరో ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే, ఈ మామిడి వృక్షం క్రింద పార్వతీపరమేశ్వరులు, పార్వతీదేవి కుమారస్వామిని ఒడిలో కూర్చోపెట్టుకొని వధూవరులుగా దర్శనమిస్తారు.

9.పర్వతి దేవి కామాక్షి అమ్మవారుగా

9.పర్వతి దేవి కామాక్షి అమ్మవారుగా

Image source

పార్వతిదేవి కంచి పట్టణంలో కామాక్షిగా పూజలు అందుకొంటున్నారు. మధుర మీనాక్షి, తిరువనైకవల్లో ఉన్న అఖిలాండేశ్వరి, కాశీలో ఉన్న విశాలాక్షి దేవాలయాలవలే ఈ కామాక్షి దేవాలయం చాలా ప్రసిద్ధి పొందింది.

10. యోగ ముద్రలో

10. యోగ ముద్రలో

Image source

కామాక్షి అమ్మవారు విగ్రహం యోగముద్రలో పద్మాసనముపై ఆసీనురాలై శాంతిని, సౌభ్రాతృత్వాన్ని వెల్లివిరిస్తూ ఉంటుంది. కంచి పట్టణంలో కామాక్షి అమ్మవారి దేవాలయం కాకుండా వేరే అమ్మవారి దేవాలయాలు లేవు.

11. ఈశ్వరుడి పాణిగ్రహణం ఇక్కడే

11. ఈశ్వరుడి పాణిగ్రహణం ఇక్కడే

Image source

కామాక్షి అమ్మవారు మామిడి చెట్టు క్రింద మట్టితో శివలింగంన్ని ప్రతిష్ఠచేసి ఈశ్వరుని పాణి గ్రహణం చేసిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారు చాల ఉగ్రతతో ఉండి బలులు తీసుకొంటూ ఉంటే ఆదిశంకరాచార్యులు అమ్మవారి ఉగ్రత తగ్గించడానికి వీలుగా శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని స్థల పురాణం. ప్రస్తుతం ఈ శ్రీచక్రానికే పూజలు జరుగుతాయి.

12. వరదరాజస్వామి దేవాలయం

12. వరదరాజస్వామి దేవాలయం

Image source

108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో వరదరాజస్వామి దేవాలయం ఒకటి. చోళులు ఈ ఆలయ నిర్మాణం జరిపారని తెలుస్తోంది. ఈ దేవాలయం ఉన్న ప్రదేశాన్ని విష్ణుకంచి అని పిలుస్తారు. ఇక్కడ ఈ దేవాలయంలోనే రామానుజాచార్యులు నివసించారని చెబుతారు.

13. బంగారు వెండి బల్లుల విగ్రహాలు ఇక్కడ

13. బంగారు వెండి బల్లుల విగ్రహాలు ఇక్కడ

Image source

ఈ దేవాలయం 23 ఎకరాల సముదాయంలో ఉంది. ఈ దేవాలయంలో మరో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ బంగారు బల్లి మరియు వెండి బల్లులు ఉన్నాయి. ఈ బల్లులను తాకితే మనిషి ఒంటిమీద బల్లి పడితే కలిగే దోషం పోతుందని నమ్మకం. దేవాలయ ప్రాకారం ఉండే అన్ని పైకప్పుల మీద బల్లులు చెక్కబడి ఉంటాయి.

14. జలాంతర్భాగంలో

14. జలాంతర్భాగంలో

Image source

ఈ దేవాలయ ప్రాంగణంలో ఆసందసరోవరం మరియు బంగారు తామర తటాకం ఉన్నాయి. ఆనంద సరోవరం మధ్యలో ఉన్న మండపంలో జలాంతర్భగాన అత్తి చెక్కతో చేయబడిన అత్తి శ్రీవరదరాజ పెరుమాళు విగ్రహాలు ఉంటాయి. ప్రతి 40 సంవత్సరాలకొకసారి కోనేరులో నుంచి ఈ విగ్రహాలను తీసి 40 రోజుల పటు ప్రజల దర్శనానికి అనుమతిస్తారు.

15. గతంలో అంటే 1979 లో

15. గతంలో అంటే 1979 లో

Image source

గతంలో అంటే 1979వ సంవత్సరంలో అత్తి శ్రీవరదరాజ పెరుమాళును కోనేరు నుంచి బయటకి తీసి దర్శనానికి అనుమతించారు. నలభై ఏళ్ల తర్వాత అంటే మళ్ళీ 2019వ సంవత్సరం జూన్ నేలలో అత్తి శ్రీవరదరాజ పెరుమాళును దర్శించగలం.

16. పట్టు చీరలకు

16. పట్టు చీరలకు

PC

కంచి జిల్లా దేవాలయాలకే కాకుండా చేనేత పట్టు వస్త్రాలకు జగత్ప్రసిద్ధి పొందింది. కంచి పట్టణంలో 400 సంవత్సరాల నుండి సుమారు 5,000 కుటుంబీకులు చేనేత వృత్తిని జీవనాధారంగా చేసుకొని జీవిస్తున్నారు. ఈ చేనేత వృత్తికారులు నేసిన పట్టు వస్త్రాలు, మల్బరీ పట్టు నుండి తయారు చేయబడిన పట్టు చీరలు, వివిధ రంగుల జరీలు, ఇక్కడి నేత కార్మికుల పనితనానికి మచ్చుతునక.

17. ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి

17. ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి

PC

కంచి చెన్నై పట్టణానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 2 గంటల ప్రయాణం. చెన్నైకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విమానయాన సేవలు ఉన్నాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా వెళ్లవచ్చు.

18. చుట్టు పక్కల ఉన్న పర్యటక ప్రాంతాలు

18. చుట్టు పక్కల ఉన్న పర్యటక ప్రాంతాలు

PC

కంచికి దగ్గర్లో మహాబలిపురం అనే ప్రఖ్యాత పర్యాటక కేంద్రం ఉంది. ఇది తీరపట్టణం. ఈ పట్టణతీరంలో దేవాలయం, ఏకశిలపై చెక్కబడిన శిల్పాలు, పాండవులు మరియు ద్రౌపది పేర్లమీద చెక్కబడిన ఏకశిలా రథాలు ఎంతో మనోహరంగా కనిపిస్తాయి. సముద్ర తీరంలో ఉన్న దేవాలయం యునెస్కో వారిచే పరిరక్షింపబడుతున్న ప్రపంచ చారిత్రాత్మక హెరిటేజ్ ప్రదేశాలలో ఒకటి.