• Follow NativePlanet
Share
» »ఈ పంచ లింగాల దర్శనంతో పాపాలన్నీ పటాపంచలు

ఈ పంచ లింగాల దర్శనంతో పాపాలన్నీ పటాపంచలు

Written By: Beldaru Sajjendrakishore

పంచభూతములు ముఖపంచకమై .. ఆరు రుతువులు ఆహార్యములై ఈ పాట గుర్తుందా ? సాగరసంగమం సినిమాలోది! కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కమలహాసన్, జయప్రద అద్భుతంగా నటించారు. పాట బాగానే విన్నారు మరి ఆ పంచభూతాలు ఏమిటి ? భూమి, ఆకాశం, గాలి, నిప్పు, నీరు - వీటిని పంచభూతాలు అంటారు. ఇవి సమస్త ప్రాణకొటి కి ఆధారమైనది. ఈ ఐదింటిని సూచిస్తూ ప్రాతినిధ్యం వహిస్తున్నవే పంచభూత స్థలాలు. ఈ పంచ భూత స్థలాలు 5 శివలింగాలను సూచిస్తాయి.

3500 ఏళ్ల మామిడి చెట్టు ఉన్న పుణ్యక్షేత్రం ఇదే

నవగ్రహాలను కవచంగా ధరించిన శివుడు ఎక్కడున్నాడు...

పంచ భూత స్థలాలన్నీ దక్షిణ భారతదేశంలోనే ఉన్నాయి. అందులో నాలుగు తమిళనాడు రాష్ట్రంలో మరియు ఒక్కటి మాత్రం మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కలదు. హిందూ పురాణాల ప్రకారం ఈ ఐదు దేవాలయాల్లోని పంచ లింగాలను ఒకే సారి దర్శించుకుంటే అన్ని పాపాలు తొలిగి కైలాసం చేరుకుంటామని తెలుస్తోంది. మరి ఆ ఐదు లింగాలు ఏవేవి ? ఎక్కడున్నాయి ? ఎలా వెళ్ళాలి ? తెలుసుకుందామా !

1. భూమి

1. భూమి

Image source:
ఏకాంబరేశ్వర ఆలయం ఎక్కడ ఉంది ? తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం

దేనిని సూచిస్తుంది ? పృధ్వీ లేదా భూమి లేదా నేల

ఏకాంబరేశ్వర ఆలయం ఏకాంబరేశ్వర దేవాలయం శివునికి అంకితం చేయబడినది. ఇందులో 1,008 శివలింగాలు ఉన్నాయి. ఆలయ గోపురం ఎత్తు 57 మీటర్లు. స్థానిక ఇతిహాసకథ ప్రకరం, పార్వతి దేవి ఇక్కడున్న మామిడి చెట్టు కింద తపస్సు చేసెను. అది ఇప్పటికీ ఆలయం లోపలే ఉంది. సంతానం లేనివారు వారు చెట్టు కింద పడే మామిడి ని తింటే సంతానం కలుగుతుందని నమ్మకం.

2.ఏకాంబరేశ్వర ఆలయం ఎలా వెళ్ళాలి ?

2.ఏకాంబరేశ్వర ఆలయం ఎలా వెళ్ళాలి ?

Image source:


చెన్నై నుండి 62 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాంచీపురం ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేటు బస్సులు నిత్యం అందుబాటులో ఉంటాయి. చెన్నై నుంచి రైళ్లో ప్రయాణించి కూడా కంచిపురం చేరుకోవచ్చు. చెన్నై లో మిమానాశ్రయం ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు విమానయాన సర్వీసులు ఉన్నాయి. కంచీపురంలో రాత్రి బస చేయడానికి అనుకూలంగా ఉంటుంది. తమిళనాడు వంటకాలన్నీ ఇక్కడ దొరుకుతాయి.

3.నీరు

3.నీరు

Image source:


జమ్బులింగేశ్వర ఆలయం ఎక్కడ ఉంది ? తమిళనాడు రాష్ట్రంలోని తిరువానై కావాల్ లో

దేనిని సూచిస్తుంది ? జలము లేదా నీరు


పంచభూత క్షేత్రాలలొ రెండవది జంబుకేశ్వరం. జంబుకేశ్వరం తమిళనాడు రాష్ర్టంలోని తిరుచ్చి 11 కి.మి దూరములో ఉంది. జంబుకేశ్వరానికి తిమేవకాయ్ మరియు తిరువనైకావల్ అనే పేర్లు కూడా ఉన్నాయి. వీటి అర్థం ప్రకారం ఇక్కడ ఏనుగుల చేత పూజలందుకొన్న క్షేత్రము అని అర్థం. పూర్వం ఇక్కడ అధికంగా జంబు వృక్షాలు ఉండడం వల్ల దీనికి జంబుకేశ్వరం అని పేరు వచ్చింది. జంబు వృక్షాలంటే తెల్లనేరేడు వృక్షాలు.

4. జంబుకేశ్వరం ఆలయం ఎలా చేరుకోవాలి ?

4. జంబుకేశ్వరం ఆలయం ఎలా చేరుకోవాలి ?

Image source:


లింగం పానవట్టం నుండి ఎల్లకాలము నీరు ఊరుతూ ఉంటుంది. ఈ విషయం భక్తులకు చూపించేందుకు లింగం పానపట్టం పై ఒక వస్త్రం కప్పుతారు. కొంతసేపటికి దానిని తీసివేసి ఆ వస్త్రాన్ని పిండుతారు. ఆ పిండిన వస్త్రం నుండి నీరు వస్తుంది. తిరుచ్చుకి నిత్యం రైలు సౌకర్యం నిత్యం ఉంది. తిరుచ్చ నుంచి ప్రభుత్వ, ప్రైవేటు బస్సుల్లో ప్రయాణించి 5-10 కిలోమీటర్ల దూరంలో ఉన్న జమ్బులింగేశ్వర దేవాలయానికి చేరుకోవచ్చు.

5. వాయువు లేదా గాలి

5. వాయువు లేదా గాలి

Image source:


కాళహస్తి ఆలయం ఎక్కడ ఉంది ? ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో, తిరుపతి కి 40 కిలోమీటర్ల దూరంలో

దేనిని సూచిస్తుంది ? వాయువు లేదా గాలి

కాళహస్తి ఆలయం గుడి లోని శివలింగాన్ని కాళహస్తీశ్వరుని గా కొలుస్తారు. సువర్ణముఖీ నదీ తీరమున వెలసిన ఈ స్వామి శ్రీకాళహస్తీశ్వరుడు. స్వయంభువు లింగము, లింగమునకెదురుగా వున్న దీపము లింగము నుండి వచ్చు గాలికి రెపరెపలాడును. శ్రీకాళహస్తిని 'దక్షిణ కాశీ ' అని అంటారు. గర్భగుడిలో శివలింగం రాహు, కేతు, సర్ప దోష నివారణ పూజలకు రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినది. కాళహస్తి ని 'దక్షిణకాశీ' అని కూడా పిలుస్తారు.

6. కాళహస్తి ఆలయం ఎలా చేరుకోవాలి ?

6. కాళహస్తి ఆలయం ఎలా చేరుకోవాలి ?

Image source:


ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో చిత్తూరు పట్టణానికి 105 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రయాణ సమయం 2 గంటలు. అదే విధంగా హైదరాబాద్ నుంచి ఈ పుణ్యక్షేత్రానికి 549 కిలోమీటర్లు. ఇక బెంగళూరు నుంచి 285 కిలోమీటర్ల దూరం ఉంటుంది. చెన్నై నుంచి కాళహస్తికి దూరం 116 కిలోమీటర్లు. తిరుపతి నుంచి నేరుగా కాళహస్తికి ప్రభుత్వ, ప్రైవేటు బస్సు సర్వీసులు ఉన్నాయి. క్యాబ్ సౌకర్యం కూడా ఇటీవల అందుబాటులోకి వచ్చింది.

7. ఆకాశం లేదా నింగి

7. ఆకాశం లేదా నింగి

Image source:


నటరాజ స్వామి దేవాలయం ఎక్కడ ఉంది ? తమిళనాడు రాష్ట్రంలోని చిదంబరంలో

దేనిని సూచిస్తుంది ? ఆకాశం లేదా నింగి

నటరాజ స్వామి దేవాలయం శివుడు ఆనందతాండం చేసిన ప్రదేశం కనుకనే ఇక్కడ శివుడు నటరాజ రూపంలో కొలువై ఉన్నాడు. ఈ ఆలయాల సముదాయం నగరం నడిబొడ్డున వ్యాపించి ఉన్నది. ఇది 40 ఎకరాల విస్తీర్ణం కలిగి యుంది. శైవుల మరియు వైష్ణవుల యొక్క దేవతలు కొలువున్న అతికొద్ది దేవాలయాల్లో ఈ ఆలయం ఒకటి. ఇక్కడి విశేషం, భక్తులకు ఏ విధమైన లింగాకారం కనిపించదు. నిరాకారమైన అంతరాలమే కనిపిస్తుంది. అదే చిదంబర రహస్యం. ఇది రూప రహిత లింగం అదే ఆకాశ లింగం గా ప్రసిద్ధి చెందింది.

8. నటరాజ స్వామి దేవాలయం ఎలా వెళ్ళాలి ?

8. నటరాజ స్వామి దేవాలయం ఎలా వెళ్ళాలి ?

Image source:


చెన్నై నుండి 250 కిలోమీటర్ల దూరంలో చెన్నై - తిరుచ్చి మార్గంలో ఉన్న చిదంబరం కలదు. చెన్నైకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విమానయాన సర్వీసులు ఉన్నాయి. చెన్నై నుండి బస్సులు చిదంబరం పట్టణానికి ప్రతిరోజూ నడుస్తుంటాయి. ప్రైవేటు ట్యాక్సీల ద్వారా కూడా నటరాజ స్వామి దేవాలయాన్ని చేరుకోవచ్చు. అదే విధంగా రైళ్ల సర్వీసులు కూడా కలవు. ప్రతి రోజు చెన్నై నంచి చిదంబరానికి రైళ్లు వెలుతుంటాయి.

9. అరుణాచలేశ్వర ఆలయం

9. అరుణాచలేశ్వర ఆలయం

Image source:


ఎక్కడ ఉన్నది ? తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నమలై దేనిని సూచిస్తుంది ? అగ్ని

అరుణాచలేశ్వర ఆలయం అరుణాచలేశ్వర ఆలయం ప్రఖ్యాత హిందువులు పుణ్య క్షేత్రం. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞచేత విశ్వకర్మచే నిర్మింపబడిందనీ, దాని చుట్టూ అరుణమనే పురము నిర్మింపబడినదనీ పురాణములు తెలుపుతున్నాయి. దేవాలయం 4 ముఖ ద్వారపు గోపురాలతో, 10 అంతస్తులు కలిగి, 10 హెక్టార్లలో విస్తరించి ఉన్నది. ఇక్కడ శివలింగం ను అగ్ని లింగ రూపంలో కొలుస్తారు.

10. ఎలా వెళ్ళాలి ?

10. ఎలా వెళ్ళాలి ?

Image source:


చెన్నై నుండి 182 కిలోమీటర్ల దూరంలోతిరువణ్ణామలై లేదా అరుణాచలం కలదు. ఇక్కడికి రైల్లో, బస్సులో ప్రయాణించి చేరుకోవచ్చు. కాగా, ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లంగ స్వరూపం కావటంవలన దీనిని చుట్టూ ప్రదక్షిణం చేయటం సాక్ష్తాత్తు శివునికి ప్రదక్షిణము అని భక్తుల విశ్వాసం. గిరిప్రదక్షణం చాలా వరకు తారు రోడ్డు పైనే జరుగుతుంది. ఈ మధ్య కాలంలో గిరిప్రదక్షణం చేయడానికి వీలుగా రోడ్డు పక్కన కాలిబాట కూడా వేసారు. ఎక్కువ మంది ఉదయం సూర్యతాపాన్ని తట్టుకోవడం కష్టం కనుక రాత్రి పూట లేదా తెల్లవారుజామున చేస్తారు.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి