» »నవగ్రహాలను కవచంగా ధరించిన శివుడు ఎక్కడున్నాడు... ఈ ఆలయంలో ప్రతి విషయం ప్రత్యేకమే

నవగ్రహాలను కవచంగా ధరించిన శివుడు ఎక్కడున్నాడు... ఈ ఆలయంలో ప్రతి విషయం ప్రత్యేకమే

Written By: Beldaru Sajjendrakishore

ఆంధ్రప్రదేశ్ లో చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం ఉంది. ఈ క్షేత్రం స్వర్ణముఖి నదికి తూర్పున ఉంటుంది. ఇది దక్షిణ భారతదేశంలోనే ప్రాచీనమైన మరియు పంచభూతలింగమల్లో ఒకటైన వాయు లింగము గల గొప్ప శైవ పుణ్యక్షేత్రము. ఇందుకు నిదర్శనంగా లింగానికి ఎదురుగా ఉన్న ఇక్కడ రెండు దీపాలలో ఒకటి ఎప్పుడూ గాలికి కదులుతూ ఉంటుంది, మరొకటి ఎల్లప్పుడు నిశ్చలముగా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ శివలింగం చతురస్త్రాకారంలో ఉంటాడు. ఇక ఎల్లప్పుడు నవగ్రహాలను కవచంగా కలిగి ఉన్నాడు. ఇటువంటి ఏర్పాటు ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇలా శ్రీకాళహస్తిలోని ప్రతి విషయం ప్రత్యేకం, ఆసక్తికరం.

1. కన్నప్ప కొలిచాడు

1. కన్నప్ప కొలిచాడు

Image source

కన్నప్ప అనే వేటగాడు నిత్యం స్వామిని కొలుస్తుండేవాడు . అతని భక్తిని పరీక్షించడానికి స్వామి ఒకరోజు తన కంటినుండి నెత్తురు కార్చేడట. వెంటనే కన్నప్ప తన కన్ను పీకి స్వామి కంటికి అమర్చాడట.

2. కంటి నుంచి రక్తం కారడం

2. కంటి నుంచి రక్తం కారడం

Image source

అప్పుడు స్వామి రెండవకంటి నుండి కూడా నెత్తురు కారటం మొదలయింది. భక్తుడైన కన్నప్ప సందేహించకుండా తన రెండవకన్ను కూడా పీకి స్వామికి అమర్చాడు. స్వామి ప్రత్యక్షమై భక్తుడైన కన్నప్పని కరుణించి ముక్తి ప్రసాదించాడు.

3. ఆ మూడింటి పేరు పై

3. ఆ మూడింటి పేరు పై

Image source

మరో కథనం ప్రకారం శ్రీ (సాలేపురుగు), కాళ (పాము), హస్తి (ఏనుగు) ఇక్కడ లింగాన్ని పూజించి శివుడిలో ఐక్యం చెందారని చెబుతారు. వాటి పేరు మీదుగానే ఈ క్షేత్రానికి శ్రీ కాళహస్తి అనే పేరు వచ్చింది.

4. నవగ్రహ కవచాన్ని కలిగి

4. నవగ్రహ కవచాన్ని కలిగి

Image source

శ్రీకాళహస్తిలో శివుడు చతురస్రాకారంలో ఉండి నవగ్రహ కవచాన్ని కలిగి ఉంటారు. దీంతో శివుడు నవగ్రహాలను తన ఆధీనంలో ఉంచుకున్నాడని స్థల పురాణం చెబుతుంది. అందువల్ల శ్రీకాళహస్తిని దర్శించుకుంటే నవగ్రహ దోషాలన్ని తొలిగిపోతాయని భక్తులు నమ్ముతారు.

5. తల ఒక వైపునకు వాల్చి

5. తల ఒక వైపునకు వాల్చి

Image source

ఇక్కడ కొలువై ఉన్న జ్జాన ప్రసూనాంబ భక్తులను కరుణించడానికి అన్నట్లు తలను ఒక వైపునకు వాల్చి ఉంటుంది. ఇటువంటి విగ్రహం దేశంలో మరెక్కడా లేదు. ఈ విగ్రహం ముందు ఆది శంకరాచార్యులు ప్రతిష్టించిన శ్రీ చక్రం ఉంది.

6. వ్యతిరేక దిశలో

6. వ్యతిరేక దిశలో

Image source

అదే విధంగా శివుడు పశ్చిమ వైపునకు తిరిగి ఉంటే జ్జాన ప్రసూనాంబ వారు తూర్పు దిశలో కొలువై ఉంటారు. ఇలా వ్యతిరేక దిశలో ఉన్న ఒకే ఒక ఆలయం కాళహస్తీశ్వరాలయం. దేశంలో అన్ని దేవాలయాల్లో సవ్యదిశలో తిరిగి మనం దేవుళ్లను అర్చన చేస్తే శ్రీ కాళహస్తిలో మాత్రం అపసవ్య దిశలో తిరిగి దేవుడిని స్మరించుకోవాల్సి ఉంటుంది.

7. నిరంతరం వాయువు వస్తూ ఉంటుంది.

7. నిరంతరం వాయువు వస్తూ ఉంటుంది.

Image source

దక్షిణ భారతదేశంలోనే శ్రీకాళహస్తి ప్రాచీనమైనమైనది. పంచభూతలింగములో ఒకటైన వాయు లింగము ఇక్కడ ఉంటుంది. ఈ లింగం నుంచి వాయువు నిరంతరం వస్తూ ఉంటుందని చెబుతారు.

8.రెపరెపలాడుతూ ఉంటాయి

8.రెపరెపలాడుతూ ఉంటాయి

Image source

అందుకు నిదర్శనంగా లింగానికి కుడి వైపున ఎదురుగా రెండు దీపాలు ఉంచుతారు. ఇవి రెపరెపలాడుతూ ఉంటాయి. అదే గర్భగుడిలో మిగిలిన చోట్ల ఉంచిన దీపాలు ఇలా కదలక పోవడం గమనించాల్సిన విషయం.

9. స్వామి వారిని తాకి అభిషేకం చేయరు

9. స్వామి వారిని తాకి అభిషేకం చేయరు

Image source

ఇక్కడ స్వామి వారిని తాకి అభిషేకం చేయరు. ఒక్క మహారుద్ర నక్షత్రం రోజున మాత్రం దీక్షగురుకుల భరద్వాజ గోత్రికులు స్వామి వారి శక్తిని లింగ రూపంలో పిండితో తయారు చేస్తారు. ఆ తర్వాత స్వామి వారిని తాకి వేడి నీటితో అభిషేకం చేస్తారు. ఈ అభిషేకానికి ఎవ్వరికీ అనుమతి లేదు.

10. పచ్చ కర్పూరంతో అభిషేకం ప్రత్యేకం

10. పచ్చ కర్పూరంతో అభిషేకం ప్రత్యేకం

Image source

అదే విధంగా ప్రతి రోజు అత్యంత వేడి పదార్థమైన పచ్చకర్పూరంతో అభిషేకం చేస్తారు. చాలా ఆలయాల్లో ఈ పచ్చకర్పూరంతో విగ్రహాలను అభిషేకం చేసిన తర్వాత మంచి నీటితో సదరు విగ్రహాలను తిరిగి అభిషేకిస్తారు. ఇక్కడ మాత్రం అలా జరుగదు.

11. ఇలా ఎక్కడా లేదు

11. ఇలా ఎక్కడా లేదు

Image source

ఈ ఆలయంలోపల ఒక చోట మూడు వ`త్తాలు గీయపడి ఉంటాయి. ఇక్కడ నిలబడి పైకి చూస్తే స్వామి వారి గర్భాల గోపురం, అమ్మవారి ఆలయ గోపురం, గిరి పై భక్త కన్నప్ప ఆలయం శిఖరం కనిపిస్తాయి. ఇక ఒక దేవాలయం లోపలి నుంచి వివిధ ఆలయాల శిఖరాల దర్శనం చేసుకోవడం దేశంలో ఎక్కడా లేదు.

12. నాలుగు దిక్కుల దేవుళ్ళు

12. నాలుగు దిక్కుల దేవుళ్ళు

Image source

ముందే చెప్పినట్లు శ్రీకాళహస్తీశ్వర ఆలయం నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వినాయకుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖులై ఉన్నారు. ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్ధ సిద్ధి లభిస్తుందనడానికి ఇది సూచన అని భక్తుల విశ్వాసం.

13. ఈ దిశల్లో ఉంటారు.

13. ఈ దిశల్లో ఉంటారు.

Image source

పాతాళ గణపతి ఉత్తరాభిముఖునిగాను, జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగాను, కాళ హస్తీశ్వరుడు పశ్చిమ ముఖంగాను దక్షిణామూర్తి దక్షిణ ముఖం (మహా ద్వారం ఎదురు) గాను ఉన్నారు. ఇలా ఒక దేవాలయంలో ప్రధాన దేవుళ్లు వేర్వేరు దిశల్లో ఉండటం ఇక్కడ మాత్రమే చూడగలం.

14. మంటపములు

14. మంటపములు

Image source

ఆలయంలో శిల్పకళతో శోభించే స్తంభాలు, మంటపాలు ప్రత్యేకంగా చూపరులను ఆకర్షిస్తాయి. ఇంకా అనేక వర్ణ చిత్రాలు కూడా ఉన్నాయి. నగరేశ్వర మంటపము, గుర్రపుసాని మంటపము, నూరుకాళ్ళ మంటపము (రాయల మంటపము), పదునారు కాళ్ళ మంటపము, కోట మంటపము వాటిలో కొన్ని. నూరుకాళ్ళ మంటపం చక్కని శిల్పాలకు నిలయం. పదహారు కాళ్ళ మంటపంలో 1529లో అచ్యుత దేవరాయలు (కృష్ణదేవరాయలు సోదరుడు) పట్టాభిషేకం జరిగింది.

15.రాహు కేతు క్షేత్రము

15.రాహు కేతు క్షేత్రము

Image source

ఇది రాహు కేతు క్షేత్రమని ప్రసిద్ధి పొందింది. పుత్ర శోకానికి గరైన వశిష్ట మహర్షికి పరమేశ్వరుడు పంచముఖ నాగలింగేశ్వరునిగా దర్శనమిచ్చాడట. ఈ నాగరూపమునే బ్రహ్మదేవుడు కూడా అర్చించాడట. ఈ నాగరూపం కారణంగా ఈ క్షేత్రానికి "రాహు కేతు క్షేత్రము" అని పేరు వచ్చింది.

16. మరే ఇతర దేవుడిని దర్శించుకోకూడదు

16. మరే ఇతర దేవుడిని దర్శించుకోకూడదు

Image source

సర్ప దోషము, రాహు కేతు గ్రహ దోషాలనుండి నివారణ కోసం శ్రీ కాళహస్తి దేవాలయంలో పూజలు నిర్వహించడానికి ఎంతో మంది నిత్యం ఇక్కడకు వస్తుంటారు. ఇక్కడ ఈ పూజలు నిర్వహించి స్వామి వారిని దర్శించుకున్న తర్వాత మరే ఇతర దేవుడిని దర్శించుకోకూడదని చెబుతారు.

17. తీర్ధాలు

17. తీర్ధాలు

Image source

ఆలయం పరిసరాలలో 36 తీర్ధాలున్నాయి. సహస్ర లింగాల తీర్ధము, హరిహర తీర్ధము, భరద్వాజ తీర్ధము, మార్కండేయ తీర్ధము, మూక తీర్ధము, సూర్య చంద్ర పుష్కరిణులు వాటిలో ముఖ్యమైనవి. దేవాలయంలోని "పాతాళ గంగ" లేదా "మూక తీర్థము"లోని తీర్థాన్ని సేవిస్తే నత్తి, మూగ లోపాలు పోయి వాక్చాతుర్యం కలుగుతుందటారు.

18. ప్రత్యేక పూజలు

18. ప్రత్యేక పూజలు

Image source

పండుగల విషయానికొస్తే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వారం రోజులపాటు అంగరంగ వైభోగంగా జరుగుతాయి. ఈ రోజులలో ఆలయం లోపలనే కాకుండా నాలుగు ప్రధాన వీధులైన నెహ్రూ వీధి, కుంకాల వీధి, తేరు వీధి, నగరి వీధులు జనంతో కిటకిటలాడుతుంటాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకల నుంచి కూడా విశేష సంఖ్యలో భక్తులు హాజరవుతారు.

19 ఎక్కడ ఉంది.

19 ఎక్కడ ఉంది.

Image source

ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో చిత్తూర పట్టణానికి 105 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రయాణ సమయం 2 గంటలు. అదే విధంగా హైదరాబాద్ నుంచి ఈ పుణ్యక్షేత్రానికి 549 కిలోమీటర్లు. ఇక బెంగళూరు నుంచి 285 కిలోమీటర్ల దూరం ఉంటుంది. చెన్నై నుంచి కాళహస్తికి దూరం 116 కిలోమీటర్లు.

20 చూడదగిన మరికొన్ని పుణ్యక్షేత్రాలు

20 చూడదగిన మరికొన్ని పుణ్యక్షేత్రాలు

Image source

ఇక్కడికి కొద్ది దూరంలో ఉండే వేయిలింగాల కోన కూడా ఒక ప్రత్యేక ఆకర్షణ. ఒక కొండ ఎక్కి దిగి మరల ఒక కొండ ఎక్కితే కనిపించే ఒక చిన్న ఆలయంలో ఒకే లింగం పై చెక్కిన వేయి శివ లింగాలను (యక్షేశ్వర లింగము) సందర్శించవచ్చు. దీనికి దగ్గర్లోనే ఒక చిన్న జలపాతం కూడా ఉంటుంది.ఇక తొండమనాడు ఆలయం, ద్రౌపదీ సమేత ధర్మరాజులు స్వామి గుడ, సూర్య పుష్కరిణి మరియు చంద్ర పుష్కరిణి
మణికర్ణిక దేవాలయం తదితరాలను చూడవచ్చు.