• Follow NativePlanet
Share
» »ఇక్కడికి వెళ్లితే...పెళ్లి ఆ పై శోభనం కూడా

ఇక్కడికి వెళ్లితే...పెళ్లి ఆ పై శోభనం కూడా

Written By: Beldaru Sajjendrakishore

పెళ్లి కావడం లేదు అని మదనపడే వారి సంఖ్య ఎక్కువవుతోంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయనుకోండి. అదే ఆడపిల్ల సంగతైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె, ఆమె కుటుంబం ఎంత బాధలో ఉంటుందో ఆ పైవాడికెరుక. ఎన్ని చోట్ల ఎన్ని పూజలు చేసినా, వ్రతాలు చేసినా ఆ వచ్చే శుభవార్తకై కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు ఆ తల్లితండ్రులు. మరి కొందరికి వివాహం అయినా కూడా కొన్ని కారణాల వల్ల శోభనం జరగక వాయిదా పడుతూ ఉంటుది. ఇందుకు శారీరక మానసిక బాధలు కారణం.

మరి వారికోసం నేటివ్ ప్లానెట్ చూస్తూ ఊరుకుంటుందా ? మీరేచెప్పండి. ప్రత్యేకంగా శోధించి త్వరగా వివాహం అయ్యేలా దీవించే పుణ్య క్షేత్రాలను మీ ముందుకు తీసుకువచ్చింది. మీకు అక్కడికి వెళ్లి దేవుణ్ణి దర్శిస్తే సరిపోతుంది. ఆలయాల రాష్ట్రం గా ప్రసిద్ధి చెందిన తమిళనాడులో " త్వరగా పెళ్లి జరిగేటట్టు దీవించే క్షేత్రాలు 11 ఉన్నాయి. ఇక్కడి స్థల మహత్యం, మూలవిరాట్టు, అక్కడ చేసే పూజా కార్యక్రమాలు కారణమేదైనా ఇట్టే వివాహం జరిగిపోతుంది. అంతేకాకుండా కన్నెపిల్లలు ఎంతగానో ఎదురుచూసే శోభనం కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా ఇట్టే జరిగిపోతాయని స్థానికులు చెబుతున్నారు.

1. ముదిచూర్ ఆలయము

1. ముదిచూర్ ఆలయము

ఇక్కడికి వెళ్లిన వెంటనే...పెళ్లి ఆ పై శోభనం కూడా

Image source:


హరిహరులు కొలువై ఉన్న ఈ ఆలయములో ప్రధాన దైవం విధ్యంబిగై అమ్మవారు. ఇది చెన్నైలో ఉంది. వివాహం కాని వారు ఇక్కడకు వచ్చి దేవాలయం గోడల పై పసుపు కొమ్మలను కట్టి దేవుడికి తమకు త్వరగా పెళ్లి కావాలని వేడుకుంటారు. అమ్మాయిలకు వేరే తరహా పసుపు కొమ్ములు, అబ్బాయిలకు వేరే తరహా పసుపు కొమ్ములు ఉంటాయి. ఆ పసుపు కొమ్ములను అక్కడి దేవాస్థానం వారే అందజేస్తారు. ఇక్కడ పూజలు చేసి వెళ్లిన వెంటనే వివాహ మవుతుందనేది దాదాపు 1,300 ఏళ్లుగా భక్తులు చెబుతున్న విషయం.

2. తిరువిడనత్తై ఆలయము

2. తిరువిడనత్తై ఆలయము

ఇక్కడికి వెళ్లిన వెంటనే...పెళ్లి ఆ పై శోభనం కూడా

Image source:


మహాబలిపురం దగ్గర లో తిరువిడనత్తై వద్ద ఉన్న శ్రీ లక్ష్మి వరాహస్వామి ఆలయము ఉంది . ఈ ఆలయము లో లక్ష్మి దేవిని కోమలవల్లీ తాయారు గా మరియు విష్ణువును వరాహ అవతారంలో పూజిస్తారు. విష్ణువు సన్యాసికి పుట్టిన 360 మంది సంతానాన్ని పెళ్లిచేసుకున్నాడు కనుక, ఈ స్వామీని భక్తులు 'నిత్య కళ్యాణ పెరుమాళ్' గా వ్యవహరిస్తారు. ఇక్కడి దైవాన్ని పూజిస్తే వివాహం జరుగుతుందనేది భక్తుల నమ్మకం. అందువల్ల దేశంలోని చాలా ప్రాంతాల నుంచి ఇక్కడకు భక్తులు వస్తుంటారు.

3. తిరుమణంచేరి ఆలయము

3. తిరుమణంచేరి ఆలయము

ఇక్కడికి వెళ్లిన వెంటనే...పెళ్లి ఆ పై శోభనం కూడా

Image source:


తిరుమనం అంటే వివాహం, చేరి అంటే గ్రామం అని అర్ధం. ఈ తిరుమణం చేరి ఆలయం తమిళనాడులోని నాగపట్టణం అనే తీర ప్రాంత జిల్లాల్లోని ఒక చిన్న గ్రామం. పురాణం ప్రకారం శివుడు పార్వతి దేవిని పరిణయం ఆడినది ఇక్కడే. తిరుమనంచేరిని సందర్శించటం ద్వారా వివాహానికి ఉన్న అవరోధాలు తొలగిపోతాయని చెప్తారు. ముఖ్యంగా ఇక్కడ స్వామివారిని కళ్యాణ సుందరేశ్వర స్వామిగా ప్రసిద్ధి. కార్తిక మాసంలో ఈ స్వామివారిని దర్శించుకుంటే ఉపయోగమని చెబుతారు.

4. ఇలా చేరుకోవచ్చు

4. ఇలా చేరుకోవచ్చు

ఇక్కడికి వెళ్లిన వెంటనే...పెళ్లి ఆ పై శోభనం కూడా

Image source:


ఈ ఆలయం కుంభకోణం, మలియాదుత్తురై కు చాలా దగ్గరగా ఉంటుంది. ఈ రెండు పట్ణణాలకు రైలు సౌకర్యం ఉంది. ఇక చెన్నై నుంచి పాండిచ్చేరి నుంచి కూడా నేరుగా బస్సులు ఉన్నాయి. ఇక్కడ ప్రతి రోజూ పూజలు ఉదయం 7.30 గంటలకు మొదలయ్యి మధ్యాహ్నం 1.30 గంటలకు కొనసాగుతాయి. అటు పై సాయంత్రం 3.30 గంటలకు మొదలయ్యి రాత్రి 8.30 గంటలక వరకూ జరుగుతాయి. ఈ ప్రత్యేక పూజలు చేయించుకోవడానికి దేశం నలుమూలల నుంచి ఇక్కడకు ప్రజలు వస్తుంటారు.

5. ఉప్పలి అప్పన్ ఆలయము

5. ఉప్పలి అప్పన్ ఆలయము

ఇక్కడికి వెళ్లిన వెంటనే...పెళ్లి ఆ పై శోభనం కూడా

Image source:


కుంభకోణం నుండి 7 కి.మీ ల దూరంలో ఉప్పిలి అప్పన్ ఆలయం కలదు. ఉప్పిలి అప్పన్ అంటే ఉపమానాలకు అందనివాడు అనుపమానుడు అని అర్ధం . ఈ దేవాలయాన్ని తిరువిణ్ణగర్ దేవాలయం అని కూడా అంటారు. ఇక్కడ మార్కండేయ ఋషికి భూదేవి చిన్న బాలిక రూపం లో లభించింది. ఆమె " కోకిలాంబాళ్ " పేరుతో పెంచి పెద్దచేసి, శ్రీ మహావిష్ణువు కిచ్చి వివాహము జరిపించాడని ప్రతితీ. ఆలయంలో ఉప్పులేకుండా నైవేద్యం పెడతారు.

6. నాచ్చియార్ ఆలయము

6. నాచ్చియార్ ఆలయము

ఇక్కడికి వెళ్లిన వెంటనే...పెళ్లి ఆ పై శోభనం కూడా

Image source:


ఈ ఆలయము లో విష్ణు మూర్తి యొక్క 108 దివ్య క్షేత్రాల ఆలయాలలో ఒకటి. ఈ ఆలయంలో విష్ణువు నరైయూరు నంభిగా, అమ్మవారు నాచ్చియార్ గా పూజించబడతారు. ఈ దేవాలయం కుంభకోణానికి అతి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ వివాహం కాని వారు తల్లిదండ్రల సమేతులై వచ్చి ప్రత్యేక పూజలు చేస్తే వెంటనే వివాహమవుతుందని ప్రతీతి. అంతేకాకుండా సంతానం లేనివారికి కూడా ఇక్కడ పూజలు చేస్తే ఫలితం ఉంటుందని చెబుతారు.

7. తిరుకరుకావూర్ ఆలయము

7. తిరుకరుకావూర్ ఆలయము

ఇక్కడికి వెళ్లిన వెంటనే...పెళ్లి ఆ పై శోభనం కూడా

Image source:


తిరుకరుకావూర్ ఆలయము తిరుకరుకావూర్ అనే గ్రమాంలో ఉంది. ఇది తంజావూర్ కు మరియు కుంభకోణం పట్టణాలకు 20 km ల దూరంలో కలదు. ఇది ఒక ప్రసిద్ద శివాలయ క్షేత్రము . ఇక్కడ అమ్మవారు గర్భరక్షాంబిగై . ఈ అమ్మవారిని పెళ్లికాని వారు, సంతానము లేని దంపతులు .. భక్తీ శ్రద్దలతో పూజించి దర్శనము చేసుకుంటారు. ఈ ఆలయానికి దగ్గరగా అంటే 3 కిలోమీటర్ల దూరంలో పాపనాశనం రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడి నుంచి ఆటోల ద్వారా భక్తులు ఆలయాలను చేరుకోవచ్చు.

8. తిరుచ్చేరై ఆలయము

8. తిరుచ్చేరై ఆలయము

ఇక్కడికి వెళ్లిన వెంటనే...పెళ్లి ఆ పై శోభనం కూడా

Image source:


ఈ క్షేత్రము కూడా 108 దివ్య వైష్ణవ ఆలయములలొ ఒకటి . శ్రీ దేవి భూదేవి సమేత స్రీ మహా విష్ణువు " సారనాథుడుగా " కొలువై ఉన్నాడు. ఇక్కడి అమ్మవారికి 'సారనాయకి' అనే పేరు ఉంది. కావేరి దేవిని శ్రీహరి వివాహము ఆడింది ఇక్కడేనని స్థలపురాణంలో పేర్కొన్నారు. ఈ క్షేత్రం తంజావూరు జిల్లాలోని కుంభకోణం తాలూకాలో ఉంది. కుంభకోణం నుంచి ఈ క్షేత్రానికి 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడకు రైల్వే, బస్సు సర్వీసులు చాలా ఉన్నాయి.

9. మదురై ఆలయము

9. మదురై ఆలయము

ఇక్కడికి వెళ్లిన వెంటనే...పెళ్లి ఆ పై శోభనం కూడా

Image source:


ఈ ఆలయము దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన గొప్ప పుణ్య క్షేత్రము . పాండ్యరాజు తన కుమార్తె అయిన మీనాక్షి దేవిని చొక్కనాథుడు అయిన పరమేశ్వరునికి ఇచ్చి వివాహము చేసిన స్థలము గా ప్రసిద్ది చెందినది . పెళ్ళికాని వారు మధుర మీనాక్షిదేవిని దర్శించుకోవడము అనాదిగా వస్తున్న ఆచారము. మీనాక్షి అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు ఇట్టే తీరిపోతాయని చెబుతారు. ముఖ్యంగా వివాహం, సంతానం కోసం పరితపించే వారు ఇక్కడకు ఎక్కువగా వస్తుంటారు. ఇది వైగై నదీ తీరాన ఉంది. మదురై ప్రపంచంలోని పురాతనకాల నివాస నగరాలలో ఒకటి.

10. తిరునల్లూరు ఆలయము

10. తిరునల్లూరు ఆలయము

ఇక్కడికి వెళ్లిన వెంటనే...పెళ్లి ఆ పై శోభనం కూడా

Image source:


భగవంతుడు శివుడిని ఇక్కడ వర్ణేశ్వర గా భక్తులు కొలుస్తారు. శివుడు మరియు గౌరీ ల వివాహాన్ని అగస్త్య ముని ఇక్కడి నుండే చూశాడని పురాణ కథనం. ఈ ఆలయం పాండిచ్చేరిలోని కరైకాల్ అనే చిన్నపట్టణంలో ఉంది. ఈ ఆలయంలోనే శనేశ్వరుడు కొలువై ఉన్నాడు. వివాహం కాలేదని బాధపడే వారు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చి అటు శివుడితో పాటు శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు.

11. తిరువేడగం ఆలయము

11. తిరువేడగం ఆలయము

ఇక్కడికి వెళ్లిన వెంటనే...పెళ్లి ఆ పై శోభనం కూడా

Image source:


శివునికి అంకితం చేయబడిన తిరువేడగం ఆలయం వైగై అండీ తీరమున కలదు. ఇక్కడ స్వామీ వారిని ఏడగనాథర్ అనే పేరుతో మరియు అమ్మవారిని ఇలావార్ కులాలి అమ్మై అనే పేరు తో పిలుస్తారు. వివాహం కానివారు ఇక్కడకు వెళ్లి పూజలు చేస్తే మూడు నెలల్లోపు మంచి ఫలితం ఉంటుందని చెబుతారు. అందువల్లే దేశంలోని నలుమూలల నుంచి ఇక్కడకు ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు. కేవలం హిందువులే కాకుండా ఇతర మతస్తులు కూడా ఇక్కడకు ఎక్కువ మంది వస్తుంటారు.

12. తిరువవీళిమిళలై ఆలయము

12. తిరువవీళిమిళలై ఆలయము

ఇక్కడికి వెళ్లిన వెంటనే...పెళ్లి ఆ పై శోభనం కూడా

Image source:


ఇక్కడ పరమేశ్వరుడు కాత్యాయనీ అమ్మవారిని వివాహం చేసుకున్నట్లు ప్రతీతి. ఇక్కడ స్వామిని విళానాథుడుగా భక్తులు పూజిస్తున్నారు. ఇక్కడ పెళ్లి కావాలనుకునే వారు, ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక సంతానలేమితో బాధపడే వారు కూడా ఇక్కడకు భారత దేశం నలుమూలల నుంచి వస్తుంటారు. ఇక్కడ పూజలు చేసిన తర్వాత మంచి ఫలితాలు ఉంటాయని స్థానికులు చెబుతుంటారు. ఇక్కడ వసతి సౌకర్యం బాగానే ఉంటుంది.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి