Search
  • Follow NativePlanet
Share
» »సెప్టెంబరులో ఇండియాలోని ఈ ప్రాంతాల‌ను సంద‌ర్శించేయండి..

సెప్టెంబరులో ఇండియాలోని ఈ ప్రాంతాల‌ను సంద‌ర్శించేయండి..

సెప్టెంబరులో ఇండియాలోని ఈ ప్రాంతాల‌ను సంద‌ర్శించేయండి..

సెప్టెంబరులో భారతదేశంలోని చాలా ప్రాంతాల వాతావరణం ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ నెలలో వర్షం లేదా విపరీతమైన వేడి లేదా చలి ఉండదు. హాయిగా సందర్శనా స్థలాలను ఆస్వాదించవచ్చు. ఈ సీజన్‌లో అనేక పండుగలు కూడా జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో హర్తాళికా తీజ్, మహారాష్ట్రలో గణేష్ చతుర్థి జరుపుకుంటారు. పర్యాటక దినోత్సవం కూడా సెప్టెంబర్ నెలలోనే ఉంది. అంటే ఒకటి లేదా రెండు మాత్రమే కాదు, ఈ సీజన్‌లో నగరంలోని ఏదైనా ఇతర ప్రాంతాల‌ను చూసేందుకు అనేక కారణాలు ఉన్నాయి.

లోనావాలా, మహారాష్ట్ర

సెప్టెంబర్‌లో మహారాష్ట్రలోని చాలా అందమైన హిల్ స్టేషన్ లోనావాలాను సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు. అయితే, మహారాష్ట్రను సంద‌ర్శించేందుకు ఉత్తమ సీజన్ రుతుపవనాలు. ఆ సమయంలో ఇక్కడి చాలా ప్రదేశాల అందం మ‌రింత రెట్టింప‌వుతుంది. ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చదనం, అందమైన పర్వతాలు పర్యాటకులను ఇట్టే ఆక‌ర్షిస్తాయి. ఇక్కడ ట్రెక్కింగ్, క్యాంపింగ్ వంటి అనేక సాహస కార్యకలాపాలను ఆస్వాదించవచ్చు. ముంబైకు 83 కిలోమీటర్ల దూరంలో లోనావాలా పర్వత ప్రాంతం ఉంది. వీకెండ్ వచ్చిందంటే ముంబై, పూణేల నుంచి ప్రజలు ఇక్కడ రెక్కలు కట్టుకుని వాలిపోతారు. ఒత్తిడికి, ఆందోళనలకు దూరంగా సమయం గడపాలనుకునేవారు త‌ప్ప‌కుండా లోనావాలాను సంద‌ర్శించాల్సిందే..

డ్యూవర్స్, పశ్చిమ బెంగాల్

సాహ‌స‌ప్రియులైతే, పశ్చిమ బెంగాల్‌లోని దువార్‌కు విహారయాత్రను ప్లాన్ చేసుకోవచ్చు. ముఖ్యంగా శాంతియుత వాతావరణం, ప్రకృతిని ఇష్టపడే వారికి ప‌శ్చిమ‌బెంగాల్‌లోని డ్యూవ‌ర్స్ చాలా అందమైన ప్రదేశం. ఈ ప్రదేశం గొప్ప జీవవైవిధ్యం, వన్యప్రాణుల సంపదకు ప్రసిద్ధి చెందింది. గోరుమారా నేషనల్ పార్క్, బక్సా టైగర్ రిజర్వ్, జల్దాపర వన్యప్రాణుల అభయారణ్యం ఇక్కడ చూడదగిన ప్రదేశాలు.

2

లాచెన్, సిక్కిం

సెప్టెంబ‌ర్‌లో విహారాయాత్ర‌కు ప్లాన్ చేస్తుంటే మాత్రం సిక్కిం అనువైన ప్ర‌దేశ‌మ‌నే చెప్పుకోవ‌చ్చు. సాహస ప్రియులకు ఇది గొప్ప ప్రదేశం. మంచుతో చుట్టుముట్టబడిన పర్వతాలు, వాటిలో జ‌రిగే వివిధ సాహ‌స కార్యకలాపాలను చూడటం చాలా భిన్నమైన అనుభవం. సిక్కిం సంద‌ర్శించేట‌ప్పుడు త‌ప్ప‌కుండా తంగు వ్యాలీ, చోప్తా వ్యాలీ, లాచెన్ మొనాస్టరీ, గురుడోంగ్మార్ లేక్, షింగ్బా రోడోడెండ్రాన్ అభయారణ్యం వంటి ప్రదేశాలను మాత్రం మిస్ అవ్వకండి. సిక్కిం రాజధాని నగరం, గ్యాంగ్‌టక్ ఉత్తర సిక్కిం గమ్యస్థాన పర్యటనలలో దేనినైనా ప్రారంభించడానికి బేస్ సిటీ. ఉత్తర సిక్కిం పర్యటనలో లాచెన్, లాచుంగ్, యుమ్‌తంగ్ వ్యాలీ, నాథులా పాస్, సోమ్‌గో సరస్సు, గురుడోంగ్‌మార్ లేక్ వంటి అందమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి.

1

జిరో, అరుణాచల్ ప్రదేశ్

సెప్టెంబర్‌లో అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో జీరో ఫెస్టివల్ నిర్వహిస్తారు. జిరో వ్యాలీ ఇక్కడ చాలా అందమైన ప్రదేశం. ఆహ్లాదకరమైన వాతావరణం, లోయలు, కొండ ప్రాంతాలతో పాటు, ఈ ప్రదేశం జానపద సంస్కృతికి ప్రసిద్ధి చెందింది. జీరో వ్యాలీతో పాటు టాలీ వ్యాలీ వన్యప్రాణుల అభయారణ్యం, మేఘనా గుహ దేవాలయం, శిద్దేశ్వర్ నాథ్ దేవాలయం కూడా చూడదగినవి. అరుణాచల్ ప్రదేశ్‌లోని జిరో వ్యాలీ సముద్ర మట్టానికి 1,500 మీటర్ల ఎత్తులో ఉంది.

ఇటానగర్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇది పైన్, వెదురు చెట్ల దట్టమైన ఆకులతో అలంకరించబడి ఉంటుంది. లోయలోని కొండలు దాదాపు 300 పక్షులు మరియు 170 సీతాకోకచిలుక జాతులతో నిండి ఉన్నాయి. జిరో వ్యాలీ దాని వరి పొలాలు, పైన్ అడవులు, వెదురు తోటలు, అపటాని తెగలు, చేపల పెంపకానికి ప్రసిద్ధి చెందింది. ఈ లోయ Ziro మ్యూజిక్ ఫెస్టివల్‌ని నిర్వహించడానికి ప్రసిద్ధి చెందింది. ఇది 40 కంటే ఎక్కువ బ్యాండ్‌ల ప్రదర్శనను చూసే బహిరంగ సంగీత ఉత్సవం.

More News

    Read more about: lonavala maharashtra
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+