త్రిపుర సుందరి ఆలయానికి పక్కనే కళ్యాణ్ సాగర్ సరస్సు ఉంది. ఈ సరస్సు అయిదు ఎకరాల మేరకు విస్తరించబడి ఉన్నది. దీని పొడవు 224 యర్డ్స్ కాగా వెడల్పు 160 యార్ద్స్. ఈ సరస్సు ని 124 ఏళ్ళ క్రితం త్రిపురా సుందరి ఆలయం నిర్మితమయిన తరువాత తవ్వారు. 1501 కి చెందిన మహారాజా కలియన్ మాణిక్య రాజుల కాలానికి చెందినది ఈ సరస్సు.
వివిధ రకాల చేపలు అలాగే నీటి జంతువుల జాతులు ఈ సరస్సులో ఉంటాయి. కొన్ని రకాల చేపలతో పాటు కొన్ని రకాల అరుదైన తాబేళ్ళకి ఈ సరస్సు స్థావరం. ఈ సరస్సులో ఫిషింగ్ ని నిషేదించారు. ఇక్కడి దేవాలయాన్ని సందర్శించే భక్తులు ఈ సరస్సులోని చేపల కోసం బిస్కట్స్ తో పాటు అటుకులను అందిస్తారు.
ఈ సరస్సు ఈ ఆలయం యొక్క అందాన్ని రెట్టింపు చెయ్యడం తో పాటు భక్తులకు పవిత్రమైన ప్రాంతం గా పూజింపబడుతోంది. ఉదయపూర్ ని సరస్సు నగరం గా మార్చిన అనేకమైన సరస్సులలో కళ్యాణ్ సాగర్ సరస్సు కూడా ఒకటి.



Click it and Unblock the Notifications