త్రిపుర లో ని ప్రసిద్ది చెందిన ఆలయాలలో త్రిపురా సుందరి ఆలయం ఒకటి. ఈ త్రిపుర సుందరి ఆలయం హిందూ పురాణాల ప్రకారం కాళీ అమ్మవారికి చెందిన 51 శక్తి పీఠాలలో ఒకటి. ఈ ఆలయం లో ని అమ్మవారి రూపం గా భావించే 'సోరోషి' ని పూజిస్తారు. ఈ ఆలయం ఆకృతి కుర్మాకారం లో ఉండడం వల్ల 'కుర్మ పీఠం' గా ప్రసిద్ది.
సతీ దేవి యొక్క కుడి పాదం ఇక్కడే పడిపోయిందని అంటారు. హిందూ పురాణాల ప్రకారం సతీ దేవి యొక్క మరణ వార్త తో క్రుంగి పోయిన పరమశివుడు ఆమె మృత దేహాన్ని భుజాలపై తీసుకుని ఇతర దేవతలు భయపడిపోయే విధంగా తాండవాన్ని చేశాడు. మహా శివుడిని శాంతింప చెయ్యడానికి మహా విష్ణువు సతీ దేవి శరీరాన్ని ముక్కలుగా కోస్తే అవి భారత దేశం, పాకిస్తాన్, బర్మా మరియు నేపాల్ ల లో పడతాయి.
కుడి పాదం పడిపోయిన ప్రదేశాన్ని పీతస్తాన్ గా కొలుస్తారు. ఈ ఆలయం నిర్మాణశైలి కుటీరం లాంటి ఆకృతి శంఖమును పోలిన పైకప్పుల ఆకృతితో బెంగాల్ నిర్మాణ శైలి ని పోలి ఉంటుంది. త్రిపుర సుందరి ఆలయానికి తూర్పున కళ్యాణ్ సాగర్ సరస్సు ఉంటుంది.



Click it and Unblock the Notifications