ఉదయపూర్ లోని బాగోర్ కీ హవేలీ పిచోలా సరస్సు కి దగ్గరలోని బాగోర్ కీ హవేలీ అనే పురాతన భవనాన్ని మేవార్ రాజ్య ముఖ్యమంత్రి అయిన అమీర్ చాంద్ బద్వా నిర్మించారు. క్లిష్టమైన చెక్కడం, అందమైన అద్దాల పని 18 వ శతాబ్ద హవేలీ ప్రధాన ప్రత్యేకతలు. బాగోర్ కి చెందిన మహారాణా శక్తి సింగ్ 1878 వ సంవత్సరంలో ఈ భవన౦లొ పై మూడు అంతస్తులను నిర్మించారు. 1986 లో, ఈ భవనం వెస్ట్ జోన్ కల్చరల్ సెంటర్ (డబ్ల్యు జెడ్ సి సి) కి ఇవ్వబడింది.
ఇక్కడ కుడ్య చిత్రాలు, రాచరిక దుస్తులతో మేవార్ సంస్కృతి, సంప్రదాయాలను ప్రదర్శించే ఒక మ్యూజియం కూడా ఉంది. దీనితోపాటు, పర్యాటకులు ఇక్కడ పాచికల ఆటలు, చేతి ఫాన్లు, ఆభరణాల బాక్సులు, హుక్కాలు, పాన్ బాక్సులను కూడా చూడవచ్చు. రంగుటద్దాలతో తయారు చేసిన అందమైన నెమళ్ళు ఈ మ్యూజియం ప్రధాన ప్రత్యేకతలు. ప్రయాణీకులు రాణీగారి గదిలో కొన్ని వాస్తవ చిత్రాలను కూడా చూడవచ్చు. ఈ భవనం లోపలిభాగాన్ని అందమైన, సున్నితమైన అద్దాలతో తయారుచేసారు.



Click it and Unblock the Notifications