ఉదయపూర్ లోని సజ్జన్ఘర్‘మాన్సూన్ పేలస్’ గా పిలువబడే సజ్జన్ఘర్ ఉదయపూర్ లోని అత్యంత విలాసవంతమైన భవంతి. సముద్ర మట్టానికి 944 అడుగుల ఎత్తున ఆరావళి పర్వత శ్రేణులలోని బంశదార శిఖరం పై ఇది నిర్మించారు. వర్షాకాలం లో మబ్బులను చూడడానికి 1884లో మేవార్ వంశానికి చెందిన మహారాణ సజ్జన్ సింగ్ నిర్మించాడు.ఈ అందమైన భవంతిని తెల్లటి పాలరాతితో నిర్మించారు.
పిచోలా సరస్సు, పరిసర గ్రామాల అందాలు కూడా యాత్రికులు చూడవచ్చు. ఈ భవంతికి ఆధారంగా వున్న స్తంభాలను సూక్ష్మమైన పూలు, ఆకుల చిహ్నాలతో అలంకరించారు. తొమ్మిది అంతస్తుల ఈ భవంతి నుంచి రాజుగారు వర్షాకాలం మబ్బులను పరిశీలించేవారు. ఐతే, ఆయన అకాల మరణం వల్ల ఈ భవన నిర్మాణం ఆగిపోయింది.తర్వాత అతని వారసుడు మహారాణా ఫతే సింగ్ ఈ నిర్మాణాన్ని పూర్తీ చేసాడు.



Click it and Unblock the Notifications