తంగల్ పేరా వాగమోన్ లో పేరొందిన ఆకర్షణ. ఇస్లాం మతాన్ని నమ్మేవారు ఇక్కడకు వస్తారు. షేక్ ఫరియుద్దీన్ సమాధి అవశేషాలు కల ఒక పెద్ద రాయి ఇక్కడ కలదు. ప్రతి సంవత్సరం వేలాది భక్తులు ఉరుసు పండుగ సందర్భంలో దీనిని దర్శించుకుంటారు.
స్ధానికుల నమ్మకాల మేరకు, ఆఫ్ఘన్ కు చెందిన సూఫి సెయింట్ ఒకరు కొన్ని వందల సంవత్సరాల క్రిందట ఉండేవారని తెలుస్తోంది. సమీపంలో, చాలా పురాతన గుహ ఒకటి కలదు. మన పూర్వీకులు ఈ గుహలో ఉండేవారట. తంగల్ పేరా చూసి ఈ గుహలకు వెళితే చాలు మీరు మరొక లోకంలోకి అడుగెపెట్టినట్లు భావిస్తారు. అవి అంత అందంగా ఉంటాయి.



Click it and Unblock the Notifications