ఇక్కడగల భైరవేశ్వర దేవాలయాన్ని తప్పక చూడాలి. దీనినే గుహ దేవాలయం అని కూడా అంటారు. భైరవేశ్వరుడు అంటే శివభగవానుడి అవతారంగా చెపుతారు. ఇది భైరవేశ్వర శిఖరం క్రింద ఉంటుంది. ఇక్కడ స్వయంభూ లింగం మరియు ఒక కాంస్య చంద్రిక అంటే మాత దుర్గా దేవి అవతారం, విగ్రహం ఉంటాయి. ఇక్కడ ఉండే లింగాన్ని ‘గంగోద్భవం’ అంటే గంగ నుండి పుట్టినది అని అంటారు.
రధోత్సవం మరియు మహా శివరాత్రి సందర్భాలలో దేశ వ్యాప్తంగా భక్తులు ఇక్కడకు వస్తారు. మహా శివరాత్రి 10 దినాలు జరుగుతుంది. షుమారు పది వేల మంది యాత్రికులు దర్శిస్తారు. వీరంతా పవిత్రమైన ఈ ప్రదేశాన్ని చెప్పులు లేకుండా కాలినడకన భైరవేశ్వర శిఖరాన్ని చేరుతారు. దేవాలయం బయటకు రాగానే వీరికి మోహిని శిఖరం చేరేటందుకు మెట్లు కనపడతాయి.



Click it and Unblock the Notifications