Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» మున్నార్

మున్నార్ -  ప్రకృతి యొక్క స్వర్గం

31

కేరళ లోని ఇడుక్కి జిల్లాలో కల మున్నార్ హిల్ స్టేషన్ ఒక అద్బుత పర్యాటక ప్రదేశం. పడమటి కనుమలలోని ఈ ప్రాంతం పూర్తిగా కొండలచే చుట్టుముట్టబడి ఉంటుంది. మున్నార్ అంటే మూడు నదులు అని అర్ధం చెపుతారు. ఈ ప్రదేశం మూడు నదులు కలిసే ప్రదేశంలో కలదు. అవి మధురపుజ్జ, నల్లతాన్ని మరియు కుండలే నదులు.

ఈ ప్రాంతం తమిళనాడు సరిహద్దులలో ఉండటంచేత, ఆ రాష్ట్రానికి చెందిన అనేక సాంస్కృతిక అంశాలు ఇక్కడ చోటుచేసుకునాయి. ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం కావటం చేత ఈ హిల్ స్టేషన్ కేరళ రాష్ట్రానికి ప్రపంచం వ్యాప్తంగా పేరు తెచ్చిపెటింది. దేశ విదేశాలనుండి లక్షలాది పర్యాటకులు మరియు పిక్నిక్ లు కోరేవారు అద్భుతమైన ఈ ప్రాంతానికి వచ్చి తనివితీరా విశ్రాంతి పొందుతారు, ఆనందిస్తారు.

అద్భుతమైన ప్రకృతి దృశ్యాలతో సంతోషానందాలను కలిగించే ప్రదేశం

మున్నార్ చరిత్ర పరిశీలిస్తే దానిలో బ్రిటిష్ వారి నాటి ప్రాచీన మరియు నేటి ఆధునిక కాలాల నాగరికతలు కనపడతాయి. ఇండియాకు వచ్చిన బ్రిటిష్ వారు ఈ ప్రదేశాన్ని చూసి దాని ఆహ్లాద వాతవరణానికి మరియు అందమైన ప్రదేశాలకు తక్షణమే ఇష్ట పడ్డారు. ఆ రకంగా ఈ ప్రదేశం దక్షిణ ఇండియాలో బ్రిటిష్ వారికి అప్పటిలోనే ఒక వేసవి విడిదిగా ఖ్యాతి పొందింది. నేటికి ఈ ప్రదేశం దాని అసమాన సౌందర్యంతో, అద్భుత పరిసరాలతో, చల్లని వాతావరణంతో ఒక ఆదర్శవంతమైన వేసవి విడిదిగా ఉపయోగ పడుతోంది.

మున్నార్ లో ఒక ఔత్సాహిక పర్యాటకుడు కోరే అంశాలు అన్ని లభిస్తాయి. విహారానికి సరైన ప్రదేశం, విస్త్రుతమైన తేయాకు తోటలు, అందమైన లోయలు మెలికలు తిరిగే పర్వత ప్రాంతాలు, పచ్చటి భూములు, అరుదైన మొక్క మరియు జంతు జాలాలు, దట్టమైన అడవులు, వన్య సంరక్షణాలయాలు, తాజా గాలి, స్వాగతించే వాతావరణం మరియు ఇంకా ఎన్నో, ఎన్నో అంశాలు లభిస్తాయి.

ఉత్తమమైన సైట్ సీయింగ్  ప్రదేశం

విశ్రాంతి సెలవులు కోరేవారికి మున్నార్ ప్రదేశం అనేక ఎంపికలు చూపుతుంది. సైట్ సీయింగ్ ఇక్కడ ఎంతో ఆనందకరంగా ఉంటుంది. ప్రత్యేకించి వాతావరణం ఎంతో బాగుంటుంది. ఇక్కడ అనేక ట్రెక్కింగ్ ప్రదేశాలతో ఈ ప్రదేశం బైకర్లకు మరియు ట్రెక్కర్లకు స్వర్గంలా వుంటుంది. పర్యాటకులు పొడవైన మార్గాలలో తోటల మధ్య, పచ్చటి ప్రదేశాలలో ట్రెక్కింగ్ లే కాదు సాధారణ షికార్లు కూడా చేయవచ్చు. వివిధ రకాల అరుదైన పక్షులు ఇక్కడ తిరగటం చేత బర్డ్ వాచింగ్ ఇక్కడ ఆసక్తి కరంగా ఉంటుంది.

ఎన్నో రకాల వినోదాలతో మున్నార్ అన్ని రకాల పర్యాటకులను అంటే తమ ఎంపిక మేరకు హాలిడే ప్రదేశం కోరే కుటుంబాలను, పిల్లలను, హనీమూన్ జంటలను, యువకులను, సాహస బైకర్లను, బాక్ పాకర్లను వివిధ రకాలుగా ఆకర్షిస్తుంది. ఇటీవలి కాలం లో మున్నార్ ప్రదేశం లో అవార్డులు పొందిన 'లైఫ్ అఫ్ ఫై' వంటి ఉత్తమ చిత్రాలను కూడా తీసారు.

ట్రెక్కర్లకు బైకర్లకు పిక్నికర్లకు అందరకు అనువైన ప్రదేశం ఎరావికులం నేషనల్ పార్క్. ఇది మున్నారులో ప్రధాన ఆకర్షణలలోఒకటి.

కనుమరుగవుతున్న నీలగిరి టార్ అనే ఒక రకమైన దుప్పికి నివాసం. అనముడి శిఖరం దక్షిణ ఇండియాలోని ఎతైన శిఖరం ఈ నేషనల్ పార్క్ లో కలదు.పర్యాటకులు సుమారు 2700 మీటర్ల ఎత్తున్న ఈ శిఖరాన్ని అధిరోహించడానికి ముందుగా అటవీ శాఖ అనుమతులు తప్పక తీసుకోవాలి.

మట్టుపెట్టి మున్నార్ కు 13 కి.మీ.ల దూరంలో ఉంటుంది. ఇక్కడి డామ్, సరస్సు మరియు ఇండో స్విస్ ప్రాజెక్టుగా నడుపుతున్నపశువుల పాల కేంద్రాలు చాలా ప్రసిద్ధి చెందాయి.

మున్నార్ చుట్టుపట్ల కల జలపాతాలు చాలా అందమైనవి, వాటికి చుట్టుపక్కలకల మరింత అందమైన పరిసరాలు పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తాయి. పల్లివాసల్ మరియు చిన్నకనాల్ (దీనినే పవర్ హౌస్ వాటర్ ఫాల్స్ అంటారు) అనే ఈ రెండు జలపాతాలు మున్నార్ పర్యటనలో తప్పక చూడదగినవి.

అనయిరంకాల్ రిజర్వాయర్ మున్నార్ లో చూడదగిన మరో ప్రదేశం. ఈ కొండ ప్రాంతాలలో అనాదిగా వస్తున్న తేయాకు తోటల పెంపక అంశాల ప్రదర్శన టాటా టీ కంపెనీ వారు నిర్వహిస్తున్న ఒక మ్యూజియం లో చూచి తప్పక ఆనందించాలి.

మున్నార్ లో మరిన్ని ప్రధాన ఆకర్షణలు అంటే పోతనమేడు, అట్టుకాల్, రాజామల, ఎకో పాయింట్, మీనెలి మరియు నడుకాని. టాప్ స్టేషన్ మున్నార్ - కొడైకెనాల్ రోడ్ లో బహు సుందరంగా కనపడే ప్రదేశం. ఇక్కడ 12 సంవత్సరాలకొకసారి పూచే నీలక్కురింజి పూవులు పూస్తాయి. తప్పక చూడండి.

మున్నార్ పర్వత శ్రేణుల వాతావరణం ఆహ్లాదకరంగా ఉండి పర్యాటకులు సంవత్సరం పొడవునా సందర్శించేలా చేస్తాయి. మున్నార్ చేరాలంటే, కేరళ మరియు తమిళనాడు, రెండు రాష్ట్రాలనుండి చేరవచ్చు. ఈ ప్రదేశానికి సౌత్ ఇండియాలోని అన్ని ప్రాంతాలనుండి టూర్ ప్యాకేజీలు కూడా కలవు. పర్యాటకులు ఈ ప్రాంతంలో కల అనేక హోటళ్ళు, రిసార్టులు, హోమ్ స్టేలు మరియు రెస్ట్ హౌస్ లలో తమ వసతిని తమ తమ బడ్జెట్ల మేరకు ఎంపిక చేసుకోవచ్చు.

 

మున్నార్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

మున్నార్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం మున్నార్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? మున్నార్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం మున్నార్ కు రోడ్డు మార్గం కేరళ మరియు తమిళనాడులనుండి కూడా కలదు. ఇతర నగరాలనుండి మున్నార్ కు ప్రభుత్వ బస్ లు నడుస్తాయి. అయితే, సర్వీసులు తరచుగా ఉండవు. మున్నార్ ఒక ప్రధాన పర్యాటక ప్రదేశం కావటం వలన, ప్రయివేట్ బస్సుల వారు ప్యాకేజీ టూర్లు నిర్వహిస్తారు. టూర్ ప్యాకేజీలు సుమారు ఒక్కరికి రూ.1000 నుండి మొదలవుతాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం అంగామలీ మరియు అలూవా రైలు స్టేషన్లు మున్నార్ కు సమీప రైలు స్టేషన్లు. ఈ రెండు స్టేషన్లు మున్నార్ నుండి సుమారు 120 కి.మీ. ల దూరంలో ఉంటాయి. అంగామలీ స్టేషన్ నుండి దేశంలోని వివిధ ప్రాంతాలకు రైళ్ళు కలవు. అంగామలి నుండి మున్నార్ కు సుమారు రూ. 2,500 టాక్సీ చార్జీలు ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం మున్నార్ కు, కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపం సుమారు 105 కి.మీ. ల దూరంలో కలదు. కొచ్చి విమానాశ్రయం నుండి దేశంలోని వివిధ నగరాలకు విమానాలు నడుస్తాయి. విమానాశ్రయం నుండి మున్నార్ కు టాక్సీలలో చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Mar,Tue
Check Out
20 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed