పట్టుపురక్కాల్ దేవి దేవాలయం అదూర్ లో మరో ప్రసిద్ధి గాంచిన దేవాలయం. ఈ దేవాలయం పండాలి వలియకోయిక్కల్ దేవాలయం పరిసర ప్రదేశాలలో ఉంటుంది. దీనిలో మత భధ్రకాళి ప్రధాన దైవం. పార్వతి అవతారంగా చెపుతారు. ఈ దేవాలయం గర్భగుడి, మాత మధ్రకాళి విగ్రహం మరియు కన్నికా మండపం కలిగి ఉంటుంది.
ఈ దేవాలయం సంవత్సరం పొడవునా భక్తులను వందల సంఖ్యలో ఆకర్షిస్తూంది. దేవాలయంలోని కన్నికా బండపం 250 మీటర్ల ఎత్తున ఉండి మాత భద్రకాళి విగ్రహం కలిగి ఉంటుంది. ఈ పురాతన దేవాలయం పాండ్య రాజుల కాలం నాటిది. ఇతర దేవాలయాల వలెనే పట్టుపురక్కాల దేవి దేవాలయం కూడా అదూర్ మతపర చరిత్రకు విశిష్టంగా నిలుస్తుంది. దేవాలయ పరిసరాలు చేరితే చాలు భక్తి భావనలు ఉబికి పొంగుతాయి.