ఐహోళే సందర్శించే యాత్రికులుబడిగెర గుడిని కూడా సందర్శించాలి. ఈ పవిత్ర ప్రదేశాన్ని సూర్య దేవాలయంగా కూడా చెపుతారు. ఇది. క్రీ.శ.9వ శతాబ్దానికి చెందినది. దీనిలో ఒక హాలు, ముఖ మంటపం, ఒక గర్భగుడి ఉంటాయి. దీనికే రేఖానగర టవర్ కూడా ఉంటుంది. నాలుగు మధ్య స్ధంభాలు, 12 చిన్న స్తంభాలు, ముఖ మంటపం వీటిలో ఉంటాయి. హాలు వెనుక భాగంలో గర్భగుడి ఉంటుంది. 11 వ మరియు 12వ శతాబ్దాలలో బడిగెర గుడి కట్టడం ఎన్నో మార్పులకు గురయింది. అసలు దేవాలయ సమీపంలో మరి కొన్ని చిన్న దేవాలయాలు, దేవాలయానికి శిఖరం వంటి మార్పులు చేశారు.



Click it and Unblock the Notifications