ఆలీఘర్ నగరం దాని లైఫ్ స్టైల్, కల్చర్, అనేక విద్య సంస్థలు, మ్యూజియంలు, అందమైన సహజ ప్రదేశాలకు పేరు గాంచింది. సంవత్సరం పొడవునా పర్యాటకులను ఆకర్షిస్తూనే వుంటుంది. పర్యాటకులు సైట్ సీయింగ్ మాత్రమే కాక, వారు మెచ్చే వస్తువులను కూడా అనేకం ఇక్కడి మార్కెట్ ల లో కొనుగోలు చేయవచ్చు. సెంటర్ పాయింట్ మార్కెట్, రైల్వే రోడ్ మార్కెట్, ఫూల్ ఖొరా, హల్వా ఖాన, జమాల్పూర్ మార్కెట్, శంషాద్ మార్కెట్, మహావీర్ గంజ్ మొదలైనవి ప్రధాన మార్కెట్ లు. అనేక బ్రాండెడ్ వస్తువుల దుకాణాలు, ఇంటర్నేషనల్ స్టైల్ షాపులు సెంటర్ పాయింట్ మార్కెట్ లో చూడవచ్చు. అమీర్ నిషా ఒక మంచి షాపింగ్ ప్రదేశం కాగా విద్యా సంబంధ పుస్తకాల వంటివి , నిత్యావసరాలు, మొదలైనవి శంషాద్ మార్కెట్ లో లభ్యమవుతాయి.



Click it and Unblock the Notifications