ముల్లక్కల్ రాజేశ్వరి టెంపుల్ అలెప్పి నగరానికి నడిబోడ్డులో ఉంది. దుర్గా దేవి రూపం అయిన రాజేశ్వరి అమ్మ వారు ఈ గుడిలో కొలువై ఉన్నారు. కనులకి ప్రశాంతత ని కలిగించడమే కాకుండా, భక్తి మార్గం వైపు పయనానికి ఈ గుడి తోడ్పడుతుంది. దుర్గా దేవి వివిధ రూపాలను ఈ గుడిలో గమనించవచ్చు. చెంబగసేరి ని పాలించిన దేవనారాయణ చేత నిర్మించబడిన ఈ గుడి ప్రత్యేకమైన కేరళ నిర్మాణ శైలిని తలపిస్తుంది.
యుద్దాల సమయంలో కొన్ని విగ్రహాలు కనిపించకపోవడం వల్ల మిగిలిన విగ్రహాల చుట్టూ గుడిని నిర్మించి తన భక్తిని రాజు తెలుపుకున్నారు. రాజేశ్వరి అమ్మ వారి విగ్రహానికి పై కప్పు లేకపోవడం వల్ల నిర్మలమైన ఆకాశం కనిపిస్తూ సందర్శకులకి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. ఈ గుడిలో ఆనందోత్సాహాలతో ఎన్నో పండుగలు జరుపుకుంటారు. నవరాత్రి, మహానవమి, విజయదశమి, థాయ్పూయకావడి వంటివి కొన్ని ముఖ్యమైన పండుగలు.



Click it and Unblock the Notifications