బ్రైట్ ఎండ్ కార్నర్ ప్రదేశం అల్మోర కు 2 కి.మీ.ల దూరంలో కలదు. ఇక్కడ నుండి మంచు శిఖరాల మధ్య జరిగే సూర్యోదయ సూర్యాస్తమయాలు ఆనందించవచ్చు. చంద్రోదయం కూడా ఆనందించవచ్చు. ఈ అనుభూతులు మరువలేనివిగా వుంటాయి. ఈ ప్రదేశానికి లార్డ్ బ్రిటన్ పేరు పెట్టారు. ఇక్కడ మాల్ రోడ్ మొదలవుతుంది. ఇక్కడే శ్రీ రామకృష్ణ కుటీర్ ఆశ్రమం కలదు. ఇక్కడకు ధ్యానం కొరకు ఏప్రిల్ నుండి జూన్ మరియు సెప్టెంబర్ నుండి నవంబర్ వరకూ రావచ్చు. ఇక్కడ వివేకానంద లైబ్రరీ మరియు ఒక మెమోరియల్ కూడా కలవు. తన హిమాలయ పర్యటనలో స్వామి వివేకానంద ఈ ప్రదేశంలో కొద్దిసేపు విశ్రాంతి పొందారు.



Click it and Unblock the Notifications