Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» అమ్రిత్ సర్

అమ్రిత్ సర్ పర్యాటకం – ప్రఖ్యాత గోల్డెన్ టెంపుల్

56

భారత దేశపు వాయువ్య ప్రాంతంలో కల పంజాబ్ రాష్ట్రంలోని అతి పెద్ద నగరాలలో అమృత్సర్ నగరం ఒకటి. ఇది సిక్కు జాతీయులకు సాంస్కృతికంగా, మత పరంగా ప్రధాన కేంద్రం. అక్కడ కల అమృత్ సరోవర్ పేరుపై కల ఈ నగరం 16వ శతాబ్దంలో నాల్గవ సిక్కు గురువు గురురామ్ దాస్ జి చే కనుగొనబడినది. ఆయన గురువైన గురు అర్జన్ దేవ్ జి ఈ నగరాన్ని అభివృద్ధి చేసారు. గురు రామ్ దాస్ జి తలపెట్టిన గుడి నిర్మాణాన్ని 1601 లో పూర్తి చేసారు.

1947 లో ఇండియా విభాజించక ముందు అవిభజిత పంజాబ్ లో అమ్రిత్సర్ పట్టణానికి వ్యాపార పరంగా ఎంతో ప్రాధాన్యత వుండేది. విభజన తర్వాత అమ్రిత్సర్ ఇండియా – పాకిస్తాన్ లకు సరిహద్దు టవున్ గా ఏర్పడి పాకిస్తాన్ కు పశ్చిమ సరిహద్దు అయింది. ఇపుడు ఈ పట్టణ వ్యాపారాలు కార్పెట్ లు, దుస్తులు, హేండి క్రాఫ్ట్స్, వ్యవసాయ ఉత్పత్తులు, సేవా వ్యాపారాలు, లైట్ ఇంజనీరింగ్, కు మాత్రమే పరిత మయ్యాయి. అమ్రిత్సర్ లో పర్యటన ఈప్రాంతంలో ఒక వ్యాపారం అయ్యింది.

అమ్రిత్సర్ లోను మరియు చుట్టుపట్ల కల పర్యాటక ఆకర్షణలు

అమ్రిత్సర్ లో అనేక గురుద్వారాలు కలవు. వాటిలో హర మందిర్ సాహిబ్ ప్రధానం. దీనిని సాధారణంగా గోల్డెన్ టెంపుల్ అని అంటారు. పవిత్రమైన ఈ సిక్కుల నగరం ఏటా సుమారు ఒక లక్షకు పైగా సందర్శకులను ప్రపంచం నలుమూలల నుండి ఆకర్షిస్తుంది. గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్ లోనే ఖల్స, శ్రీ అకాల్ తఖ్త్ కలవు. అమ్రిత్సర్ టూరిజం అంటే బిబెక్సర్ సాహిబ్, బాబా అటల్ సాహిబ్, రామ్సార్ సాహిబ్ , సంతోఖ్సర్ సాహ్లిబ్ ల పర్యటన కూడాను.

సిక్కులకు ప్రధాన యాత్రా స్థలం అవటమే కాక, అమ్రిత్సర్ ఇండియా స్వాతంత్ర పోరాటం లో 1919 జిలియన్ వాలా బాగ్ హత్యా కాండ తో కూడా చరిత్రలో చోటు చేసుకుంది. జిలియన్ వాలా బాగ్ లో ఇప్పటికి అక్కడ నిర్మించిన స్మారకాలలో మృత వీరుల దినోత్సవం చేస్తారు. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన మరి కొన్ని ప్రదేశాలు, మహారాజ రంజిత్ సింగ్ మ్యూజియం, ఖైర్ ఉద్ దిన్ మసీద్, బతిండ ఫోర్ట్, సరగార్హి మెమోరియల్ మరియు గోవింద్ ఘర్ కోట మొదలైనవి.

ఇండియా – పాకిస్తాన్ ల మధ్య కల సైనిక ప్రదేశాన్ని వాగా సరిహద్దు అంటారు. ఇక్కడ జరిగే పెరేడ్ చూసేందుకు టూరిస్టులు వస్తారు. అంతేకాక, ఈ నగరంలో అనేక హిందూ దేవాలయాలు దుర్గియానా టెంపుల్, మందిర్ మాతా లాల్ దేవి, ఇస్కాన్ టెంపుల్ , హనుమాన్ మందిర్ మరియు శ్రీ రామ్ తీర్థ్ టెంపుల్ కలవు. కైజర్ బాగ్, రాం బాగ్, ఖల్స కాలేజ్ మరియు గురు నానక్ దేవ్ యూనివర్సిటీ, తార్న్ తారన్ మరియు పుల్ కన్జారి వంటివి మరికొన్ని పర్యాటక ఆకర్షణలు.

అమ్రిత్సర్ ఎలా చేరాలి

పంజాబ్ లో ముఖ్య పట్టణమైన అమ్రిత్సర్ ను ఇండియా లోని ప్రధాన నగరాలనుండి వాయు, రైలు, రోడ్డు మార్గాలలో చేరవచ్చు. శ్రీ గురు రాం దాస్ జీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అమ్రిత్సర్ కు ప్రధాన వాయు మార్గం కాగా అమ్రిత్సర్ రైల్వే స్టేషన్ రైలు మార్గంలో ఇండియా లోని ప్రధాన ప్రదేశాలకు అనుసంధానిస్తుంది. అమ్రిత్సర్, గ్రాండ్ ట్రంక్ రోడ్ పై వుండటం వలన బస్సు, లేదా టాక్సీ లలో రోడ్డు మార్గం లో కూడా తేలికగా చేరవచ్చు.

అమ్రిత్సర్ పర్యటనకు అనుకూల సమయం

అమ్రిత్సర్ లో మూడు ప్రధాన కాలాలు వుంటాయి. అవి వేసవి, వర్షాకాలం శీతాకాలం. సంవత్సరంలో అన్ని కాలాలు అనుకూలమే అయినప్పటికీ, అమ్రిత్సర్ పర్యటన అక్టోబర్ నుండి మార్చ్ చివరి వరకు మరింత అనుకూలంగా వుంటుంది.

అమ్రిత్ సర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

అమ్రిత్ సర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం అమ్రిత్ సర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? అమ్రిత్ సర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం NH-1 అని పిలిచే గ్రాండ్ ట్రంక్ రోడ్ అమృత్సర్ రహదారి ద్వారా భారతదేశంలో అనేక ప్రధాన నగరాల నుండి సులభంగా చేరుకోవచ్చు. ఢిల్లీ,చండీఘర్,జమ్మూ వంటి ఉత్తర ప్రాంతాల నుండి అమృత్సర్ కు ప్రయాణం చేయడానికి బస్సులు మరియు టాక్సీలు అందుబాటులో ఉన్నాయి. GT రోడ్ పాకిస్తాన్ లోని లాహోర్,అమృత్సర్ లను కూడా కలుపుతుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం అమృత్సర్ రైల్వే స్టేషన్ భారతదేశం యొక్క అనేక ప్రాంతాల్లో బాగా అనుసంధానించబడింది. ఢిల్లీ,ముంబై, కోలకతా మరియు జమ్మూ వంటి ప్రధాన నగరాల నుండి రోజువారీ రైళ్లు అమృత్సర్ లో ప్రధాన టెర్మినల్ కు అందుబాటులో ఉన్నాయి. వగహ్-అత్తరి బోర్డర్ ద్వారా పాకిస్థాన్లోని లాహోర్కు కు,సమ్ఝౌత ఎక్స్ప్రెస్ లింకులు అమృత్సర్ కు ప్రత్యేక రైలు ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం అమృత్సర్ శ్రీ గురు రామ్ దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయం పట్టణం నుండి 11 కిమీ దూరంలో ఉన్నది. ఢిల్లీ,ముంబై,కోలకతా,బెంగుళూర్,చెన్నై,హైదరాబాద్,అహ్మదాబాద్ మరియు శ్రీనగర్ వంటి ప్రముఖ నగరాలకు విమానాశ్రయ లింకులు అమృత్సర్ కు ఉన్నాయి. అంతర్జాతీయ విమానాలు ప్రపంచవ్యాప్తంగా ఇతర గమ్యస్థానాలకు విమానాశ్రయం అనుసంధానం కలిగి ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed