Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బాగా » ఆకర్షణలు » కేప్ టవున్ కేఫ్

కేప్ టవున్ కేఫ్, బాగా

1

టిటో వీధిలో నిజమైన తక్కువ ఖర్చుతో కూడిన నైట్ క్లబ్ ఇది. టిటో కేఫ్ యాజమాన్యమే దీనిని తక్కువ ఖర్చుతో కూడిన బ్రాండ్లతో నడుపుతుంది. బాగాలోని ప్రసిద్ధ టిలో లేన్ లో కల ఈ హోటల్ లో పెద్ద ఎల్ సిడి స్క్రీన్లు, అతి పెద్ద ధ్వని వచ్చే మ్యూజిక్ అన్నిటికి మించి గోవా ఆహారాలు, పర్యాటకుడికి అద్భుత ఆనందం కలిగిస్తాయి. ఇతర నైట్ క్లబ్ ల వలే కాకుండా, ధరలు ఎంతో సమంజసంగా ఉండి జనాలను ఆకర్షిస్తాయి. అయితే, కొంతమంది ఇది ఇంటి పెద్దలతో సందర్శించేందుకు అనువైన ప్రదేశం కాదని భావిస్తారు. కాని. ఒక మధ్య వయసు పర్యాటకుడికి పూర్తి రిలాక్సేషన్ లభించాలంటే ఇది అనువైన ప్రదేశంగా చెప్పవచ్చు. ఈ నైట్ క్లబ్ లోనే ఒక  కర్వు లనే పేరుకల బూటిక్ కేజువల్ డిజైనర్ షాప్ కూడా ఉంది. కనుక మీకవసరమైన టాప్స్, స్విమ్ సూట్స్ ఇతర వస్తువులు కొనుగోలు చేసి ఆనందించండి.   రెస్టరెంటు బయట చెక్క బల్లలు వేయబడి, మీరు మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో ఆనందిస్తూ ఆహారం తీసుకునేలా కూడా ఉంటాయి. ఇక మీరు బీర్ తాగాలంటే ఆ సందు మొత్తంలో అతి తక్కువ ధర 70 రూపాయలకే ఒక బాటిల్ దొరుకుతుంది.. రుచికరమైన తండూరి గొర్రె మాంసం వంటకం ఎంతోమంది ఇష్టపడే ఆహారం. టిటో యాజమాన్యంలో నడిచే ఈ హోటల్ నిర్వహణ సమర్ధవంతంగా , ఏ రకమైన రిస్కు లేకుండా ఉంటుంది.  వారంలో చాలీా భాగం ఈ హోటల్ లో ప్రవేశ రుసుము ఉండదు. వారాంతపు సెలవులలో మాత్రం ఇండియన్ లపై మాత్రమే ప్రవేశ రుసుము వేస్తారు. అయితే, తెల్లగా ఉండే ఇండియన్లు ఈ ప్రవేశ రుసుమునుండి కూడా తప్పించుకుంటారు.. ఈ హోటల్ కు ఎపుడూ వచ్చే వారు సాయంకాలం త్వరగా వచ్చి టేబుల్స్ ఆక్రమించేసి చాలా పొద్దుపోయే వరకు వాటిని వదలరు.

కనుక మీరు అతి త్వరగా వెళ్ళి మీ టేబుల్స్ రిజర్వు చేసుకోవలసి ఉంటుంది. వేలెట్ సౌకర్యం లేదు కనుక మీకై మీరే మంచి పార్కింగ్ ప్రదేశం కూడా మీ వాహనానికి ఏర్పరచుకోవాలి. కొన్ని మార్లు ఈ వీధిలోకి పోలీసులు వాహనాలను అనుమతించరు. అటువంటపుడు బాగా వద్దగల కేఫే కాఫీ డే నుండి మీరు చిన్నపాటి నడక చేయవలసి ఉంటుంది. జనాలు అధికంగా ఉంటారు కనుక హోటల్ లో సర్వీస్ వేగంగా ఉండాలని ఆశించకండి. సహనం వహించి అక్కడి లైవ్ డిజె లు ఆనందించండి. మరి కొద్ది సొమ్ము ఖర్చు చేయగలిగితే, అక్కడే కల విఐపి గదులను బుక్ చేసుకోండి.  

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue