నేటి రోజులలో పేరు గాంచిన డిస్క్ జాకీ పియరీ ఇపుడు క్లబ్ ఐవి లో ఇన్ హౌస్ డిజె గా ఉంటున్నాడు. క్లబ్ ఐవీ అంటే పూర్తిగా వీనుల విందైన సంగీతంగా ఉంటుంది. టిటో లేన్ లో ఇది చాలా మంచి నైట్ క్లబ్ గా చెపుతారు. పెద్దగా వినపడే మ్యూజిక్ మరియు ప్రవేశంలోనే నిలబడి ప్రవేశం ఉచితం అనే బ్రోకర్లు మిమ్మల్ని బాగా ఆకర్షిస్తారు.
వారంలోని అన్ని రోజులలోను ఈ క్లబ్ మాత్రమే బాగాలో మీకు ఉచిత ప్రవేశం కల్పిస్తుంది. క్లబ్ ఐవీ రాత్రి 8 గంటలకు తెరుస్తారు. బయట ఉండే కాక్ టెయిల్ బార్ లో ఒకటి రెండు డ్రింకులు వేయవచ్చు. డిజె పియరీ మీకు వివిధ రకాల పాటలను అందిస్తాడు. అక్కడే కల పెద్ద స్క్రీనుపై మ్యాచ్ లు సైతం ప్రదర్శిస్తారు. ఐవి క్లబ్ టిటో లేన్ లో ముందు భాగంలోనే ఉంటుంది కనుక పార్కింగ్ సమస్య పెద్దగా ఉండదు. నడక చాలా కొద్దిపాటి మాత్రమే. గోవాలోని ఇతర భాగాలలో నుండా క్లబ్ ఐవీ చేరాలంటే, బాగాలోని టిటో లేన్ ఎక్కడ అనేది విచారించండి. మీకు సూచన....మీకు ఆకలి వేస్తూంటే, అక్కడ అద్భుతంగా తయారు చేసే తండూరి ఆహారం ఆర్డర్ చేసి ఆనందించండి. బాగాలోని కేఫే కాఫీ డే పక్కనే కల క్లబ్ ఐవీ నుండి ఈ తండూరి హోటల్ చాలా తక్కువ దూరంలోనే ఉంటుంది.