బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం, బెంగళూరు

హోమ్ » ప్రదేశములు » బెంగళూరు » ఆకర్షణలు » బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం

నగరం నడిబొడ్డు నుంచి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం సుమారు 40 కిలోమీటర్ల దూరంలో వుంది. ప్రయాణీకుల రద్దీ రీత్యా దేశంలోని నాలుగవ అతి పెద్ద విమానాశ్రయం ఇది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కు ఇది ప్రధాన కేంద్రం.ఈ విమానాశ్రయం 10 దేశీయ, 21 అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుపుతుంది. దీంతో బెంగళూరు భారతదేశం లోని ఇతర నగరాలకు, ప్రపంచం లోని ప్రధాన నగరాలకు బాగా అనుసంధానం చేయబడి వుంది. జర్మన్ కంపెనీ సీమెన్స్ కి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జాయింట్ వెంచర్ గా 2008 లో ప్రారంభమైన ఈ విమానాశ్రయం సాలీనా కోటి ఇరవై లక్షల మంది ప్రయాణీకులను గమ్యం చేరుస్తుంది. బస్టాండ్ కి రైల్వే స్టేషన్ కి దగ్గరలోనే వున్నా, స్టేషన్ నుంచి విమానాశ్రయానికి నేరుగా రైలు మార్గం ఏర్పాటు చేసే ప్రతిపాదనలు వున్నాయి – కాగా ఇప్పటికే రోడ్డు రహదారి ని ఆరు లేన్ల రహదారిగా విస్తరించారు.71,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు అంతస్తుల ఎయిర్ కండిషన్డ్ హాళ్ళలో వుండే ఈ విమానాశ్రయం దేశీయ అంతర్జాతీయ ప్రయాణికులకు వసతి కల్పిస్తుంది. హజ్ యాత్రికుల కోసం ప్రత్యెక టెర్మినల్ వుండడం ఇక్కడి ప్రత్యేకత – 1500 చదరపు మీటర్ల వైశాల్యం వున్నఇక్కడి నుంచి ఒకే సారి 600  మంది ప్రయాణీకులు వెళ్ళ వచ్చు. నగరం లోపలి బయటకు వెళ్ళడానికి విర్విగా టాక్సీ సర్వీసులు దొరుకుతాయి.

Please Wait while comments are loading...