బెంగళూరు నుంచి 28 కిలోమీటర్ల దూరంలో బిడది దగ్గర 82 ఎకరాల విస్తీర్ణంలో వీ-గార్డ్ గ్రూప్ వారు ఏర్పాటు చేసిన అమ్యూస్మేంట్ పార్క్ ఈ వండరెలా. నాలుగు లేన్ల బెంగళూరు – మైసూర్ రోడ్డులో ఇక్కడికి ఒక గంటలో చేరుకోవచ్చు.భూమి పైనా, నీటి లోనా చేసే 53 సవారీలు వండలా లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో సంగీతం పలికే జలధార, లేసర్ షో, వాస్తవిక ప్రదర్శనలు, ఎలెక్ట్రానిక్ గా నియంత్రించిన జల ధారలతో నడిచే నృత్య వేదిక కూడా వున్నాయి. 1000 మందికి సరిపోయే సమావేశ మందిరాలు, 1150 మంది పట్టే అయిదు హోటళ్ళ తో పాటు 2350 లాకర్లున్న లాకర్ గదులు కూడా వున్నాయి.OHSAS 18001:2007 భద్రతా ప్రమాణాలు పాటిస్తున్న రెండు పార్కుల్లో ఇది ఒకటి. ప్రయోగశాలలో పరీక్షించిన రక్షిత మంచి నీరు సరఫరా చేసేందుకు ఇందులో అయిదు నీటి శుద్ది యంత్రాలు ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణ కోసం పచ్చని చెట్లతో నడుం బిగించిన ఈ పార్కులో వాన నీటి సేకరణ చేసి దాన్ని ఉపయోగించేందుకు ప్రత్యెక విధానం వుంది. ఒకవేళ పార్కులో మీ భద్రత గురించి మీకేమైనా సందేహాలున్నా, అవి మీరు అక్కడికి వెళ్ళే వరకే వుంటాయి, ఎందుకంటే వండరేలా మీ నమ్మకాన్ని పూర్తిగా చూరగొంటుంది.



Click it and Unblock the Notifications