Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» బార్మర్

బార్మర్ - కళావృత్తులే ప్రాధాన్యతగా ....!

9

బార్మర్ ఒక పురాతన పట్టణం. ఇది రాజస్ధాన్ లోని బార్మర్ జిల్లాలో కలదు. ఈ పట్టణాన్ని 13వ శతాబ్దంలో బాహడ రావు లేదా బార్ రావు కనుగొన్నారు. కనుక అతని పేరుపై ఈ నగరం ఏర్పడింది. బహదామర్ అంటే బహద పర్వత కోట అని అర్ధం చెపుతారు. కాలక్రమేణా ఈ నగరం పేరు బార్మర్ గా మారిపోయింది. రాజస్ధాన్ లోని ఈ ప్రాంతం హస్త కళలకు , సాంప్రదాయక కళలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడకల అనేక చారిత్రక స్ధలాలు కరూడా దీనిని ఒక పేరొందిన పర్యాటక ప్రదేశంగా మార్చాయి. చరిత్రలోకి చూస్తే....

బార్మర్ జిల్లా పురాతన కాలంలో ఎంతో ప్రాధాన్యత వహించింది. అనేక రాజ వంశాలు ఇక్కడ పుట్టాయి మరియు నశించాయి. పురాతన బార్మర్ నగరం ఖేడ్, కిరదు, పచ్ పద్ర, జసోల్, తిల్ వారా, షెయో, బలోతర మరియు మల్లానిలకు విస్తరించింది. బ్రిటీష్ పాలకులు ఈ జిల్లాకు వచ్చిన తర్వాత 1836 సంవత్సరంలో బార్మర్ నగరం ఒక సూపరింటెండెంట్ పాలనలోకి వచ్చింది. తర్వాతి కాలంలో దీనిని అంటే 1891 సంవత్సరంలో జోధ్ పూర్ రాష్ట్రంలో కలిపారు. 1947 సంవత్సరంలో భారత దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత జోధ్ పూర్ మరియు బార్మర్ లను రెండింటిని ఏకం చేసి రాజస్ధాన్ రాష్ట్రంలో కలిపారు. నేడు బార్మర్ జిల్లా మల్లాని శివ, పచ్ పద్ర, శివన మరియు చోహటాన్ వంటి చారిత్రక ప్రాధాన్యతకల ప్రదేశాలను కలిగి ఉంది. లలిత కళలు, సంగీతాలు, హస్త కళలు అన్నిటికి ప్రసిద్ధి

బార్మర్ నగరం హస్తకళా పనులకు, ఎంబ్రాయిడరీ పని మరియు ఇతర సాంప్రదాయక కళావృత్తులకు బాగా పేరు పడింది. బార్మర్ జానపదుల సంగీతాలు మరియు నాట్యాలకు కూడా ప్రసిద్ధి. బార్మర్ లోని సంగీతకారులు ఒక సంఘంగా ఏర్పడి ఉంటారు. వీరు భోపాస్ మరియు ధోలీస్ వంటి తెగలనుండి ప్రధానంగా వచ్చారు. భోపాలు పాటల పూజారులు. వారి దైవాలపై పాటలు పాడతారు. ధోలీలు ముస్లిం మతస్ధులు వీరు జానపద సంగీతాలు, నాట్యాలు చేసి జీవనం వెళ్ళ బుచ్చుతూంటారు.

బార్మర్ లోచెక్క ఫర్నీచర్ పైనా మరియు బట్టలపైన అద్దకాలు వేస్తారు. ఈ జానపదులు ఎంతో కళాత్మకమైన డిజైన్లు వారి ఇంటి గోడలపై కూడా వేసి ఆనందిస్తారు.

రాజస్ధాన్ సంస్కృతి, వారసత్వాలకు ప్రతీక

బార్మర్ చేరిన పర్యాటకులు అక్కడి రాజస్ధాన్ గ్రామీణ ప్రాంత అందాలను, సంస్కృతిని, వారసత్వ సంపదలను ఎంతో ఆనందిస్తారు. ఇక్కడ అనేక పర్యాటక ఆకర్షణలు కలవు. వాటిలో బార్మర్ కోట, రాణి భటియాని దేవాలయం, విష్ణు దేవాలయం, దేవ్ కా సూర్య దేవాలయం, జునా జైన్ దేవాలయం, సఫేద్ అఖ్రా, మొదలైనవి కలవు.

ఈ ప్రాంతంలో అనేక పండుగలు అట్టహాసంగా జరుపుతారు. తిల్ వారా లో జరిగే మల్లినాధ పశువుల ఉత్సవం ప్రధాన పండుగ. దీనిని ప్రతి ఏటా రావల్ మల్లినాధ్ కొరకు జరుపుతారు. వీరతారా మేళా మరియు బార్మర్ ధార్ పండుగలు మరి కొన్ని సందర్భాలుగా చేసి ఎంతో ఆనందిస్తారు.

బార్మర్ చేరుట

బార్మర్ ఇండియాలోని ఇతర భాగాలకు, రైలు, రోడ్డు మరియు విమాన మార్గాలలో చేరవచ్చు. బార్మర్ రైలు స్టేషన్ మీటర్ గేజ్ తో జోధ్ పూర్ కు కలుపబడి ఉంది. బస్సులు, టాక్సీలు రాజస్ధాన్ లోని అన్ని నగరాలనుండి బార్మర్ తేలికగా చేరుతాయి. జోధ్ పూర్ లోని సివిల్ విమానాశ్రయం దీనికి సమీపం. సుమారు 207 కి.మీ.ల దూరం ఉంటుంది.

బార్మర్ సందర్శనకు అక్టోబర్ నుండి మార్చి వరకు గల ఆనందకర వాతావరణం అనువైనది

బార్మర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

బార్మర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం బార్మర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? బార్మర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం బార్మర్ పట్టణానికి రాజస్ధాన్ లోని ఇతర నగరాలనుండి ప్రతిరోజూ ప్రభుత్వ మరియు ప్రయివేటు బస్సులు, టాక్సీలు నడుస్తాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం బార్మర్ రైలు స్టేషన్ జోధ్ పూర్ రైలు స్టేషన్ కు ఒక మీటర్ గేజ్ లో అనుసంధానించబడి ఉంది. జోధ్ పూర్ నుండి దేశంలోని ప్రధాన పట్టణాలకు వివిధ రైళ్ళు కలవు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    పర్యాటకులు బార్మర్ పట్టణానికి వాయు, రైలు మరియు రోడ్డు మార్గాలలో చేరవచ్చు. విమాన ప్రయాణం జోధ్ పూర్ లోని సివిల్ ఎయిర్ పోర్ట్ బార్మర్ కు 207 కి.మీ.ల దూరంలో కలదు. ఇదే సమీప స్ధానికి విమానాశ్రయం. ఈ విమానాశ్రయంనుండి న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి, ముంబై లోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రతిరోజూ విమానాలు నడుస్తాయి. విమానాశ్రయం నుండి నేరుగా బార్మర్ కు టాక్సీలలో చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed

Near by City