1730 వ సంవత్సరంలో సూరజ్ మల్ మహారాజు నిర్మించిన డీగ్ కోట భరత్పూర్ నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కోట డీగ్ పట్టణం లో ఉంది. డీగ్ కోట కు సమీపాన డీగ్ పాలెస్ ఉంది. ఈ పాలెస్ పురానా మహల్, శీష్ మహల్, సూరజ్ భవన్, నంద్ భవన్, కృష్ణ భవన్, కేశవ్ భవన్, గోపాల్ భవన్ తోపాటు అనేక రాజభవనాల కూడలి. జాట్ పాలకుల పూర్వపు రాజధాని ఈ కోట ప్రధాన గోపురం అత్యంత ఎత్తు కలిగి, చుట్టూ వెడల్పైన కాలువ ఉంటుంది. 8 కిలోమీటర్ల పొడవైన గోడ ఈ కోటకి హద్దుగా ఉంది. ఈ కోట లోపల ఉన్న 12 గోపురాలలో లాఖ బుర్జ్ అతిపెద్దది. ఈ లాఖ బుర్జ్, కోటకు వాయువ్య౦లో ఉంది. కోటకి ప్రధాన భాగంగా ఉన్న సూరజ్ మాల్ హవేలీని, బంగల్దార్ నిర్మాణ శైలిలో నిర్మించారు. కోటలోని అందమైన తోటలు పెర్షియన్ శైలి అయిన ‘చార్బాగ్’ శైలిలో నిర్మించారు. కోట లోపలిభాగం ఇపుడు శిధిలావస్థలో ఉంది.



Click it and Unblock the Notifications