భట్కల్ లైట్ హౌస్ ను 1891 లో నిర్మించారు. ఇది భట్కల్ పట్టణ ఆకర్షణలలో ఒకటి. ఇది భట్కల్ నది ప్రవేశంలో దక్షిణ దిశగా ఒక కొండపై భట్కల్ కోట సమీపంలో ఉంది. అది గతంలో తెల్లటి రాతి టవర్ గా ఉండేది. దానినే ఒక లైట్ హౌస్ గా మార్చి సంకేతాలు 1936 లో ఏర్పరచారు. కనుక ఇపుడు అది ఒక లాంతరు దీపంలో రెండు ఒత్తుల దీపంగాను, రాతి కట్టడంగాను కూడా తయారైంది. 1956 - 58 సంవత్సరాల మధ్య ఒక కొత్త లైట్ హౌస్ టవర్ ను కొండపై పెట్టారు. 1998 మార్చి 21వ తేదీన, ఒక మెటల్ ల్యాంప్ గా దీనిని మార్పు చేశారు.