భట్కల్ సందర్శనలో సమయం ఉంటే, పర్యాటకులు కేతపయ్య నారాయణ దేవాలయాన్ని తప్పక చూడాలి. ఈ దేవాలయంలో విజయనగర సామ్రాజ్య శిల్ప సంపద కనపడుతుంది. విజయనగర రాజ్య శిల్పాలు అనేకం చెక్కారు. నవరంగ గా చెప్పబడే ఒక నాలుగు స్తంభాల పెద్ద హాలు నిర్మించారు. దీని చుట్టూ అష్ట దిక్పాలక విగ్రహాలను ఎనిమిది దిక్కులలో నిర్మించారు. ఈ దేవాలయంలో పురాణ ఇతి హాసాల బొమ్మలు అంటే రాముడి వనవాసం, రామాయణం, రామ పట్టాభిషేకం, పుత్ర కామేష్టి వంటివి కూడా గోడలపై చెక్కబడ్డాయి. దేవాలయ ప్రవేశంలో ఒక స్తంభం దానిపై జెండా కలిగి ధ్వజస్తంభంగా చెప్పబడుతుంది. ఇది దేవాలయానికి ఎంతో శోభ నిస్తుంది. ఈ దేవాలయాన్ని నిర్మించిన ఖేత పాయ్ విగ్రహం కూడా పెట్టపడింది. .