అసావలి డ్యామ్ నిర్మాణం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఈ డ్యామ్ బోర్డి గ్రామంలో కలదు. దీని నిర్మాణ శైలి గ్రేట్ పిరమిడ్స్ ఆఫ్ ఈజిప్ట్ ఆకారంలో ఉంటుంది. డ్యాము కొలతలు 1160 అడుగుల పొడవు మరియు 78 అడుగుల ఎత్తుతో ఆశ్చర్యం కలిగిస్తాయి. దీనిని అనుకొని సరస్సులు, అనేక చెట్లు మరియు పర్వతాలు ఒక వైపున ఉంటాయి. మరో వైపు పూర్తిగా పొలాలు, చిన్న గ్రామం కలవు. అసావలి డ్యామ్ మంచి పిక్ నిక్ ప్రదేశం. ఇక్కడినుండి చూస్తే, అద్భుత దృశ్యాలు కనపడుతాయి. బహరోట్ గుహల పర్వతాల వంటివి ఇక్కడినుండి చూడవచ్చు. ఈ ప్రదేశం చూడాలంటే వర్షాకాలం బాగుంటుంది. సరస్సులు, డ్యామ్ అన్ని పూర్తిగా నిండి వుంటాయి. పరిసరాల పచ్చదనం అధికంగా కనపడుతుంది. ప్రశాంతత కోరుకునేవారికి ఈ ప్రదేశం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ ప్రాంతంలోనే అనేక ఇతర రిజర్వాయర్లు మరియు డ్యామ్ లు కూడా కలవు.



Click it and Unblock the Notifications