చిక్కమగళూరు సందర్శనలో పట్టణానికి ఉత్తర దిశగా 67 కి.మీ. దూరంలో ఉన్న అమృతేశ్వర దేవాలయం, కూడా దర్శించవచ్చు. ఈ దేవాలయాన్నిక్రీ.శ. 1196 సంవత్సరంలో హొయసల రాజు వీర బల్లాల II నిర్మించారు. ఈ దేవాలయాన్ని దాని శిల్పి అమృతేశ్వర దండనాయక పేరుపై నిర్మించారు.
అమృతేశ్వర దేవాలయం లో ఒక విమానగోపురం ఏకకూట డిజైన్ లో, ఒక పెద్ద మంటపం ఉంటాయి. ఒక మంటపానికి 9 గదులు మరో మంటపానికి 29 గదులు ఉన్నాయి. ఈ దేవాలయం లోని శిల్పాలలో రాక్షస ముఖాలు కనపడుతూంటాయి. అమృతేశ్వర దేవాలయంలోని మంటపాలుకుగల స్తంభాలు నేటికి ఎంతో మెరుపు కలిగి మంటప సీలింగ్ కు ఆధారంగా ఉంటాయి. సీలింగ్ లోపలి భాగంలో పూవుల డిజైన్లు ఉంటాయి. మంటపాలలో హిందూ పురాణాల పాత్రలు దర్శనమిస్తాయి. మహాభారతం, శ్రీ క్రిష్ణుడిజీవిత చరిత్ర వంటివి ఉంటాయి.రామాయణంలోని సంఘటనలు దక్షిణ భాగ గోడలలో చిత్రీకరించారు. ఈదేవాలయసమీపంలో ఉన్న భద్ర రివర్ డ్యామ్ ను కూడా సందర్శకులు చూడవచ్చు.



Click it and Unblock the Notifications