చిత్తోర్ ఘడ్ లోని పురావస్తు ప్రదర్శనశాల బాన్ బీర్ – కి – దీవార్ కు తూర్పు కోన వద్ద ఉంది. ఇది ఒక ముఖ్య పర్యటక ఆకర్షణ. చరిత్ర లో ప్రత్యెక ఆసక్తి ఉన్న వారు ఈ ప్రాంతాన్ని ప్రేమిస్తారు.ఈ మ్యూజియంలో రాజపుత్రుల పాలనలో తయారైనవి లేదా రాజపుత్ర రాజుల శూరత్వాన్ని అమరం చేయాలనే ఉద్దేశ్యంతో తర్వాత నిర్మించిన చారిత్రిక కళాకృతులు, చిత్రాలు, శిల్పాలు ఉన్నాయి. ఈ మ్యూజియం లో మౌర్యుల, గుప్తుల కాలానికి చెందిన కొన్ని వస్తువులు ఉన్నాయి. ఈ కళాకృతులు విభిన్న బౌద్ధ, హిందూ సంస్కృతులను వర్ణిస్తాయి. ఈ పురాతన ప్రదేశాన్ని తవ్వినప్పుడు దొరికిన కొన్ని కళాకృతులు కూడా ఈ మ్యూజియం లో ఉన్నాయి.



Click it and Unblock the Notifications