8 వ శతాబ్దంలో నిర్మించిన కాళికా మాత దేవాలయం, ఈ ప్రాంతపు పురాతన దేవాలయాలలో ఒకటి.సిసోడియా వంశస్తుడైన బప్పా రావాల్ మహారాజు సూర్య దేవాలయంగా దీనిని నిర్మించాడు. అయితే, 14 వ శతాబ్దంలో మహారాణ హమీర్ సింగ్ ఈ దేవాలయం లో ఒక కాళికా మాత విగ్రహాన్ని ప్రతిష్టించినప్పటి నుండి ఇది కాళికా మాత దేవాలయంగా ప్రసిద్ది చెందింది. శౌర్యానికి, శక్తికి సంకేతమైన కాళికా మాత చిత్తోర్ ఘడ్ ను సంరక్షిస్తున్నదని విశ్వసిస్తారు. అందమైన నిర్మాణ శైలి ఉన్న కాళికా మాత దేవాలయంలో అద్భుతంగా చెక్కిన అనేక చిత్రాలు, శిల్పాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఏటా జరిగే ఉత్సవానికి భక్తులు కాళికా మాత దీవెనల కోసం పెద్ద సంఖ్యలో వస్తారు.