త్రిపునితుర హిల్ ప్యాలెస్ 1865 సంవత్సరంలో కొచ్చి మహారాజు నిర్మించారు. ఇక్కడ కల ఆర్కియాలాజికల్ మ్యూజియం సుమారు 54 ఎకరాలలో విస్తరించి ఉంటుంది. దీనిలో సాంప్రదాయక శిల్ప శైలిలో నిర్మించిన సుమారు 49 భవనాలుంటాయి. ప్యాలెస్ లో ఆర్కియోలాజికల్ మ్యూజియం, హెరిటేజ్ మ్యూజియం, డీర్ పార్క్, ప్రి హిస్తారిక్ పార్క్, పిల్లల పార్క్ లు కలవు. ప్రస్తుతం ఈ ప్రదేశం కేరళ రాష్ట్ర ఆర్కియాలజీ శాఖ వారి పాలనా నిర్వహణలో కలదు. సోమవారాలు తప్ప అన్ని రోజులు ప్రజలకు తెరచి ఉంటుంది. మ్యూజియంలో రాజ వంశానికి చెందిన పెయింటింగ్ లు, రాతి శిల్పాలు, ఆయుధాలు, నాణేలు హుందా అయిన పడకలు వంటివి అనేక వస్తువులుంచారు.



Click it and Unblock the Notifications