ఈ శాంక్చురి కేరళ మరియు కర్నాటక సరిహద్దులలో ఉంది. ఈ శాంక్చురీలో బ్రహ్మగిరి ఎత్తైన శిఖరం. శాంక్చురీ 181 కి.మీ.ల విస్తీర్ణం. కూర్గ్ నుండి 60 కి.మీ.లు. దట్టమైన అడవి, పచ్చని చెట్లు కలవు. ట్రెక్కర్లకు ఆసక్తిగా ఉంటుంది. ఈ ప్రదేశానికి కేరళ వైపు నుండి మరియు కర్నాటక వైపునుండి కూడా వెళ్ళవచ్చు. ట్రెక్కింగ్ చేయాలంటే అటవీ శాఖ అనుమతులు కావాలి. ఈ శాంక్చురీలో అటవీ జంతువులు ఏనుగులు, పులులు, అడవి పిల్లి, చిరుత, పులి, అడవి కుక్క, ఎలుగు అడవి పంది, సంబార్, మచ్చల జింక, నీలగిరి లంగూర్, వంటివి ఎన్నో ఉంటాయి. వివిధ రకాల పాము జాతులను కూడా చూడవచ్చు.



Click it and Unblock the Notifications