హొన్నమన కెరె కూర్గ్ లో పెద్ద సరస్సు. చారిత్రాత్మక మరియు ఆధ్యాత్మక ప్రాముఖ్యత కలదు. సోమవార్ పేటనుండి 6 కి.మీ. దూరం మాత్రమే. దేవత హొన్నమన తన జీవితాన్ని ప్రజల కొరకు త్యాగం చేసిందని ఆ దేవి గుర్తుగా సరస్సు పక్కన ఒక దేవాలయం నిర్మించబడిందని చెపుతారు. ప్రతి సంవత్సరం గౌరి పండగలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సరస్సు చుట్టూ రెండు కొండలు గావి బెట్ట మరియు మోరి బెట్ట అని ఉంటాయి. చూట్టూ కాఫీ తోటలే. ఈ కొండలలో మనుష్య నిర్మిత గుహలు కలవు. వీటిని పాండవులు నిర్మించారని చెపుతారు. ఇక్కడ బోటింగ్ మరియు ఫిష్షింగ్ కూడా చేయవచ్చు. కొత్త జంటలు తమ మొక్కు బడుల చెల్లింపులకై ఇక్కడకు వస్తారు.