ఇది ఒక వ్యవసాయ ప్రాంతం. పడమటి కనుమలలో కలదు. కాఫీ తోటలు అధికం. కాఫీ ఎస్టేట్లు పోలిబెట్ట, అమ్మతి రోడ్డుపై కలవు. ఇది టాటా కాఫీ ఎస్టేట్లకు ప్రధాన కార్యాలయం సుమారు 10,000 ఎకరాల తోటలు ఈ ప్రాంతంలో కలవు. ప్రధానంగా కాఫీ తోటలు అయినప్పటికి, మిరియం, యాలకులు, వనిల్లా వంటి మధ్యంతర పంటలు కూడా వేస్తారు. కాఫీ చెట్ల మధ్య వివిధ పొడవైన చెట్లను నీడకుగాను పెంచుతారు. ఇక్కడ పండే కాఫీ గింజలు అత్యంత శ్రేష్టమైనవి. కాఫీ తో పాటు ఆరెంజ్ లు కూడా పండుతాయి. కాఫీ పెంపకం లేని సమయాలలో వరి పండిస్తారు. టాటా ఎస్టేట్ వారు వచ్చిన పర్యాటక అతిధులకు వారసత్వ బంగళా అయిన ప్లాంటేషన్ ట్రెయిల్స్ ను బసకు ఏర్పాటు చేస్తారు. ఒక్కడే ఒక పురాతన కోట మరియు బౌధ్ధారామం కూడా కలవు. పట్టణమంతా సుందరంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications