సుండికొప్ప మడికెరి మరియు కుషాల్ నగర్ ల మధ్య చిన్న పట్టణం. మంగుళూరు - మైసూరు హై వే లో కలదు. కాఫీ మరియు మిరియం తోటలకు ప్రసిద్ధి. ఈ ప్రాంతంలో మధురమ్మ ఎస్టేట్ చాలా ప్రసిద్ధి గాంచింది. స్ధానికులకు ఫుట్ బాల్ ప్రధాన క్రీడ. ఇక్కడి క్లబ్ పోటీలు నిర్వహించి బంగారు పతకాలు ఇస్తుంది. ఆదివారం నాడు సంత నిర్వహిస్తారు. కొడగార హళ్ళి, కంబిబనె, హొసకోటె, నాకూర్ గారగందూర్, కెడక్కల్, కడ్లిమనె మొదలైనవి సమీప గ్రామాలు. నగర బిజీ జీవనం నుండి ప్రశాంతత పొందేందుకు ఈ ప్రదేశం అనువైనది.



Click it and Unblock the Notifications