Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఢిల్లీ » ఆకర్షణలు » ఎయిర్ ఫోర్స్ మ్యూజియం

ఎయిర్ ఫోర్స్ మ్యూజియం, ఢిల్లీ

2

పాలెం ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో గల ఎయిర్ ఫోర్స్ మ్యూజియం ఒక గొప్ప దర్శనీయస్థలం..భారత రక్షక దళానికి చెందిన అనేక ఘన గుర్తులు ఇక్కడ భద్రపరచబడి ఉండటంతో ఈ మ్యూజియం కి సాటి మరొకటి లేదు.భారత రక్షక దళ గొప్ప చారిత్రక నేపధ్యం,దేశ మాత కోసం పోరాటం లో ప్రాణాలర్పించిన అనేకమంది వీరుల వివరాలు అక్కడ పొందుపరచపడి ఉన్నాయి.

ఈ మ్యూజియాన్ని ఇండోర్, అవుట్ డోర్ గ్యాలరీలుగా విభజించారు.మొదట మనము ఇండొర్ గ్యాలరీ ని చూద్దాము.

ఇండొర్ మ్యూజియం లో రక్షక దళ వ్యక్తిగత ఆయుధాలు,యూనిఫారాలు,ఫొటోలు ఇతరత్రా అనేక వస్తువులు భారత వైమానిక దళం 1932 లో మొదలయినప్పటినుండీ సేకరించినవి ఉండటం తో ఇది చాలా ఆసక్తి గొల్పుతుంది.

ఇక్కడ కొలువు తీరిన చిత్రాలలో 1971 భారత-పాక్ యుద్ధ సమయం లో పాక్ ఓడిపోయి లొంగుబాటు పత్రం మీద పాకిస్తాన్ లెఫ్టినెంట్ నాజీ సంతకం చేస్తున్న చిత్రం, వైమానిక దాడూల ద్వార శత్రు విమానాలని పడగొట్టే చిత్రాలు,శత్రు స్థావరాలని ధ్వంసం చేసే చిత్రాలు ఆసక్తిరేకిత్తిస్తాయి.

ఈ గేలరీ నుండే కాస్త ముందు కెళితే 15 రకాల యుద్ధ విమానాలు నిలిపి ఉంచిన స్థలం,మన వైమానిక దళ పరిశోధన శాఖ తయారు చేసిన వాహనాలు,ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ కూడా చూడవచ్చు.అవుట్డోర్ డిస్ప్లే గ్యాలరీ: ఇక్కడ అస్సక్తిగొలిపే రాడార్ సామాగ్రీ,యుద్ధం లో పట్టుబడ్డ శత్రు వాహనాలు, యుద్ధ విజయ చిహ్నాలవంటివి ఎన్నో చూడవచ్చు.

ఇవే కాకుండా సందర్శకులు శ్రీ నిర్మల్ జీత్ సింగ్ శెఖన్ గారి విగ్రహాన్ని కూడా చూడవచ్చు. ఈయన ఒక వైమానిక అధికారి. యుద్ధ సమయాలలో తన అసమాన్య వైమానిక ప్రదర్శనతో పరమ వీర చక్ర అందుకున్న ఏకైక వైమానిక దళ పైలట్.ఇద్దరు శత్రు సైనికులని మట్టుపెట్టడం లో ఈయన చూపిన తెగువ ఈయనని హీరో ని చేసింది.

ఇంకా ఇక్కడే రక్షక దళ యూనీఫారం,వైమానిక దళ అధికారుల కత్తులు మరియు ఇతర ఆయుధ సంపత్తి,రక రకాల యుద్ధ ట్యాంకులు,గన్నులు, పిస్తోళ్ళు, రైఫిల్స్,రివాల్వర్స్ సందర్శనార్ధం ఉన్నాయి.

సందర్శన వేళలు:బుధ-ఆది-ఉ.10గం.-సా.5 గం.సోమ, మంగళ మరియు ఇతర శలవు దినాలలో మ్యూజియం మూసివేయబడును.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
04 Apr,Sat
Return On
05 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
04 Apr,Sat
Check Out
05 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
04 Apr,Sat
Return On
05 Apr,Sun