బిర్లామందిర్, ఢిల్లీ

ఢిల్లీ లో దీనిని లక్ష్మీ నారాయణ మందిరమని కూడా పిలుస్తారు. దీనిని 1939 లో పారిశ్రామికవేత్త శ్రీ,జీ .డీ బిర్లా గారు కట్టించగా మహాత్మా గాంధి ఆవిష్కరించారు

ఢిల్లీ లో గల అతి సుందర ఆలయాలలో ఒకటైనా ఈ లక్ష్మీ నారాయణ మందిరం లో ముఖ్య దేవతలు లక్ష్మీ మరియు నారాయణుడు. చుట్టూ క్రిష్ణ,శివ, వినాయక,హనుమ బుద్ధాలయాలు ఉన్నాయి. శక్తి స్వరూపిణి దుర్గా మాత కి కూడా ఒక ఆలయం ఉంది.పండిత విశ్వనాధ శాస్త్రి గారి ఆధ్వర్యం లో "నగర" శైలి లో నిర్మింపడింది ఈ ఆలయం. కట్టడం పూర్తి అయిన తరువాత అన్ని కులాల మతాల వారిని దీనిలోకి అనుమతించినట్లయితేనే తాను ప్రారంభోత్సవం చేస్తానని షరతు విధించారు గాంధీజీ.7.5 ఎకరాలలో విస్తరించిన ఈ ఆలయం చుట్టూ ఉన్నసుందర ఉద్యాన వనాలు, ఫౌంటెన్స్ ప్రతీ సంవత్సరం వేల కొద్దీ యాత్రికులని ఇక్కడకి ఆకర్షిస్తూ ఉంటాయి. హిందూ పండగలైన దీపావళీ, క్రిష్నాష్టమి సమయాలలో ఈ గుడి కిక్కిరిసిపోతుంది.

కానాట్ ప్లేస్ కి దగ్గర లో మందిర్ మార్గ్ లో ఉంది ఈ ఆలయం. దీనిని బస్సు మరియు ఏ ఇతర రవాణ మార్గాల ద్వారా అయినా సులభం గా చేరుకోవచ్చు. వారం లో ఏడు రోజులూ ఉదయం 6 నుండి రాత్రి 10 గంటల వరకు తెరచి ఉంచుతారు.

Please Wait while comments are loading...