చౌసత్ కంభా, ఢిల్లీ

ఇది ఢిల్లీ లో గల ఒక సమాధి. దీనిని 1623-24 మధ్య కాలం లో జహంగీరు పరిపాలన లో మీర్జా అజీజ్ కోకా తన సమాధి కోసం నిర్మించాడు. ఈయన అక్బరు ప్రధాన మంత్రి అతాగా ఖాన్ కుమారుడు. రెండు ఉర్దూ పదాలు "చౌసత్" మరియు "కంభా" కలయిక ఈ "చౌసత్ కంభా".. చహుసత్ కంభా అనగా 64 స్తంభములు అని అర్ధం.

హజ్రత్ నిజాముద్దీన్ బస్తీ లో గల ఈ చౌసత్ కంభా తెల్లటి పాల రాయితో 25 యెర్రలని మోసే 64 స్తంభాలు, ఒకొక్క యెర్ర ఒకొక్క కలశానికి ఆధారమిచ్చేటట్లుగా నిర్మించబడ్డ ఒక చతురస్రాకార కట్టడం. ఈ కలశాలు బయట నుండి చూస్తే కనిపించవు.ఈ చౌసత్ కంభా పైకప్పు నలుచదరం గా ఉంటుంది. చారిత్రక కట్టడం గా నిర్ణయించపడ్డ ఈ కట్టడం హజ్రత్ నిజాముద్దెన్ మత కాంప్లెక్సు లో భాగం.

దీనికి దగ్గర లోనే ఇతర చారిత్రక కట్టడాలైన అతగా ఖాన్ సమాధి,ఉర్సు మహం గా పిలవబడే సభా మందిరం,ప్రముఖ ఉర్దూ కవి మీర్జా గాలిబ్ సమాధి ఉన్నయి. గాలిబ్ సమాధికి దగ్గరలో గాలిబ్ చిత్రాలు మరియు ఆయన సేకరించిన పెయింటింగుల సంగ్రహాలయం "గాలిబ్ మ్యూజియం" ఉంది.

Please Wait while comments are loading...