దిగంబర జైన్ ఆలయం, ఢిల్లీ

హోమ్ » ప్రదేశములు » ఢిల్లీ » ఆకర్షణలు » దిగంబర జైన్ ఆలయం

ఢిల్లీ లో ఎర్ర కోటకు దగ్గరలో దిగంబర జైన్ ఆలయం అనే పురాతన జైన దేవాలయం ఉన్నది.దీనిని శ్రీ దిగంబర జైన్ లాల్ మందిర్ అని కూడా పిలుస్తారు.దీనిని ప్రస్తుతం ఢిల్లీలోని ప్రముఖ చాందిని చౌక్ ప్రాంతంలోచూడవచ్చు.

అందమైన ఎరుపు ఇసుకరాయితో ఈ ప్రసిద్ధ జైన గుడిని నిర్మించారు.చాందిని చౌక్ మరియు నేతాజీ సుభాష్ మార్గం కలిసే చోట ఈ ఆలయం ను చూడవచ్చు.దీనిని 1656 వ సంవత్సరంలోనిర్మించారు.ఢిల్లీ లో ఉన్న జైన ఆలయాలలో ఇది బాగా పురాతనమైనదిగా చెప్పవచ్చు.ఈ ప్రసిద్ధ ఆలయంను రెడ్ ఆలయం లేదా లాల్ మందిర్ వంటి పేర్లతో పిలుస్తారు,మరియు ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు అనేక మార్పులు వచ్చాయి.

జైనమతం యొక్క 24 వ తీర్థంకరుడైన -లార్డ్ మహావీర దైవ విగ్రహం లాల్ మందిరంలో ఉంటుంది.ఈ ఆలయంలో లార్డ్ ఆదినాధ్ విగ్రహాలు కూడా ఉన్నాయి.మొదటి జైనమతం యొక్క తీర్థంకరుడైన లార్డ్ పార్శ్వనాథ్ విగ్రహం కూడా ఉంటుంది.అలాగే, సుమారు ఎనిమిది శతాబ్దాల తర్వాత అంటే ఒక భారీ విరామం తరువాత, ఒక దిగంబర జైన్ సన్యాసి 1931 వ సంవత్సరంలో ఢిల్లీ సందర్శించారు. ఈ చారిత్రిక సంఘటన సందర్భంగా ఒక స్మారక చిహ్నం ఈ జైన దేవాలయం లో స్థాపించబడింది.

అత్యంత ప్రశాంతమైన పవిత్ర స్థలం,మరియు అనేక మంది భక్తులను ఆకర్షిస్తుంది.దాని ప్రధాన భక్తి ప్రాంతం మొదటి అంతస్తులో ఉంది. జైనమతం గురించి మరింత తెలుసుకోవడానికి ఆసక్తి ఉన్నవారు, జైన సాహిత్యం సంబంధించిన పుస్తకాలను విక్రయించే పుస్తకాల దుకాణము ఉంది. అలాగే, ఆలయ ప్రాంగణంలో విక్రయించిన పుస్తకాలు జైనమతంనకు సంబంధించిన జ్ఞాపకాలుగాను మరియు అసాధారణమైనవిగాను ఉంటాయి.

ఈ ఆలయం శిల్పాలతో మరియు అందమైన చిత్రాలతో అలంకరించబడి ఉంటుంది.దీనిని స్థాపించిన అప్పటి నుంచి అనేక మార్పులు వచ్చాయి.ఈ భారీ నిర్మాణం 19 వ శతాబ్దం సమయంలో మాత్రమే విస్తరించబడింది.

Please Wait while comments are loading...