Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఢిల్లీ » ఆకర్షణలు » గౌరీ శంకర్ ఆలయం

గౌరీ శంకర్ ఆలయం, ఢిల్లీ

3

800 సంవత్సరాల కిందటి గౌరీ శంకర్ ఆలయం డిల్లీ లోని చాందిని చౌక్ వద్ద దిగంబర్ జైన్ లాల్ ఆలయానికి సమీపంలో ఉంది. ఈ ఆలయం భారతదేశంలోని అత్యంత ప్రధాన శైవ ఆలయాలలో ఒకటి.

ఈ ఆలయంలోని లింగం వెండితో చేయబడిన పాముతో చుట్టబడి ఉంటుంది. ఇది ‘విశ్వ స్ధూపం’ లేదా విశ్వ కేంద్రంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయాన్ని శివునికి గొప్ప భక్తుడైన మరాఠా సైనికుడు అపా గంగాధర్ నిర్మించాడు.  ఆతను యుద్ధంలో బాగా గాయపడినపుడు శివుడిని ప్రార్ధించి, అతని తీవ్రమైన దెబ్బలు తగ్గి బ్రతికితే ఈ ఆలయాన్ని నిర్మిస్తానని వాగ్ధానం చేసినట్లు ఒక కధ చెప్తారు. అసాధారణంగా, ఆతను పరిస్థితులను అన్నిటినీ ఎదుర్కొని ఈ ఆలయాన్ని చాందిని చౌక్ లో నిర్మించాడు. ఈ ఆలయం  1761 లో నిర్మించబడింది.

అపా గంగా ధర్ పేరు ఆలయ పిరమిడ్ ఆకారపు పైకప్పు దిగువ భాగం పైన చెక్కబడింది. అయితే, 1959 లో ఈ ఆలయాన్ని పునరుద్ధరించిన సేథ్ జైపురా పేరు కూడా ఈ ఆలయ కిటికీలపై చెక్కబడింది. ఈ ఆలయ లోపలి భాగంలో శివుడు, అతని భార్య పార్వతి, కుమారులు వినాయకుడు, కుమారస్వామి విగ్రహాలు ఉన్నాయి. ఈ లింగం ముందు శివుడు, పార్వతుల జాతి రాళ్ళతో అలంకరించిన విగ్రహాలు ఉన్నాయి. ఈ లింగంపై నిరంతరం నీరు బైటికి పోవడానికి వీలుగా ఒక వెండి కుండ ఉంటుంది.

ఎర్ర కోట, జామా మసీదు, గౌరీ శంకర్ ఆలయానికి సమీపంలోని ఆకర్షణలు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Mar,Tue
Check Out
01 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed