ఢిల్లీ నెహ్రూ ప్లేస్ లో గల కల్కాజి గుడి అత్యంత పూజ్యమైనది. చాలా మంది భక్తులు దర్శించే ఈ దేవాలయం చాలా పురాతనమైనది.ఇక్కడి ముఖ్య దేవత దుర్గా మాత అవతారమైన కాళికా దేవి.ఈ గుడినే "మనోకమ్మ సిద్ధపీఠ్" అని కూడా పిలుస్తారు,అనగా భక్తుల కోరికలు తీరే స్థలం అని.
ఈ గుడి వెనక ఆసక్తికరమైన గాధ దాగి ఉంది.దేవతలని రాక్షసుల బారి నుండి కాపాడటానికి పార్వతీ దేవి పుత్రికగా జన్మించిన కాళికా మాత ఇక్కడ నివసించడంతో ఈ గుడి వెలిసింది అని చెపుతారు.
మొట్ట మొదట ఇటుకలతో నిర్మించబడిన ఈ గుడి కి ఇప్పుడు మార్బల్ తాపడం చేసారు. ఈ గుడీ చుట్టూ పిరమిడ్ టవర్ ఉంది.గర్భాలయం లోకి మార్బుల్ రాయి పరచబడ్డ 12 ప్రవేశద్వారాలున్నాయి.గర్భాలయాన్ని ఆనుకుని ఉన్న మంటపంలో 36 వంపులు గల ద్వారాలున్నాయి. నిత్యం పూజలు జరుతున్నాగానీ నవరాత్రులలో ఈ గుడీ ఒక సరికొత్త శొభ ని సంతరించుకుంటుంది.ఉత్సవాలు జరిగే సమయం లో భక్తులు ఇక్కడ గుమిగూడి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో స్తుతిస్తారు.సంవత్సరానికి రెండుసార్లు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి.ఈ గుడి కి దగ్గరలోనే ఇస్కాన్ గుడీ మరియు లోటస్ టెంపుల్ ఉన్నాయి



Click it and Unblock the Notifications