Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఢిల్లీ » ఆకర్షణలు » జాతీయ మ్యూజియం

జాతీయ మ్యూజియం, ఢిల్లీ

4

న్యూ ఢిల్లీ లోని జాతీయ మ్యూజియం, దేశంలోని అతి పెద్ద నిక్షేపా స్థానాలలో ఒకటి. దీనిని 1949వ సంవత్సరంలో న్యూ ఢిల్లీ లో ఏర్పాటు చేశారు, ఇది విస్తృత శ్రేణిలో ఆసక్తికర కళాఖండాలను ప్రదర్శిస్తుంది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ క్రింద పనిచేసే, మౌలానా ఆజాద్ రోడ్, జనపథ్ ల మూలన కనబడే దీనిలో పురాతన చారిత్రికకాలం నుండి ఆధునిక కాలం వరకు అన్ని రకాల కళల కళాకృతులు ఉన్నాయి.

చిటికెడు చరిత్ర . . . లండన్ లో 1947-48 వ సంవత్సర కాలంలో జరిగిన భారత దేశ కళాకృతుల ప్రదర్శనతో అంతా మొదలైంది. లండన్ రాయల్ అకాడమిలో ఈ ప్రదర్శన నిర్వహించిన సంరక్షకులు ఈ ప్రత్యేక సేకరణలను వాటి వాటి మ్యూజియాలకు తిరిగి తరలించే ముందు అన్ని౦టిని భారతదేశంలో ఒక సారి ప్రదర్శించాలని నిర్ణయించుకొన్నారు.

ఫలితంగా, ఇవే సేకరణలను ఢిల్లీ రాష్ట్రపతి భవనంలో ప్రదర్శించారు. ఈ ప్రదర్శన అనేక మంది చరిత్ర ప్రియులను ఆకర్షించింది, ఢిల్లీ లోనే ఒక జాతీయ కళల మ్యూజియాన్ని నెలకొల్పడానికి నిర్ణయించారు. అలా ఉనికి లోనికి వచ్చిన జాతీయ మ్యూజియాన్ని అదే సంవత్సరంలో అప్పటి భారతదేశ గవర్నర్ చక్రవర్తి రాజగోపాలాచారి ప్రారంభించారు. అయితే, ప్రస్తుతం మ్యూజియం ఉన్న భవనం మాత్రం 1960 వ సంవత్సరంలో ప్రజల కోసం తెరిచారు.

సేకరణలు . . . ఈ మ్యూజియంలో అద్భుతమైన 200,000 భారతదేశ, విదేశీ కళాఖండాలు ఉన్నాయి. క్రీ.పూ 2700 కాలం నాటి టెర్రకోట, కాంస్యపు ప్రదర్శనలు, మౌర్యుల వంశం నాటి చెక్క శిల్పాలు, దక్షిణ భారతదేశ విజయనగరానికి చెందిన కళాకృతులు, గుప్తుల కాలాన్ని తెలియ చేసే కళాఖండాలు, సింధు నాగరికత, మొఘల్ కాలం, గాంధర్వ కాలాల నాటికి చెందినవి ఇంకా అనేక౦ దీనిలో ఉన్నాయి.  

ఉత్తర ప్రదేశ్ లోని బస్తి జిల్లాలో కనుగొని, తవ్విన బుద్ధుని వివిధ పురాతన వస్తువులు ఉన్న ఒక ప్రత్యేక బౌద్ధ కళా విభాగం కూడా ఈ మ్యూజియంలో  ఉంది.

మొహంజొదారో నృత్య౦ చేసే శిల్పం, గిరిజన కళలు, ఆభరణాలు, సూక్ష్మ కళాఖండాలు, కుడ్య చిత్రాలు, దుస్తులు, సంగీత వాయిద్యాలు, ఆయుధాలు, ఎంతో ఆకట్టుకొనే ప్రసిద్ధ మొఘల్ చక్రవర్తి జహంగీర్ సంతకం చేసిన కొన్ని స్మారకాలు ఉన్నాయి.

సాధారణంగా ఈ సేకరణలలో చిత్రాలు, ఆభరణాలు, పురావస్తు, చేతివ్రాతలు, ఆయుధాలు, కవచాలు ఇంకా అనేకం ఉంటాయి. మూడు విశాలమైన అంతస్తులలో విస్తరించి ఉండటం వలన ఈ అందమైన మ్యూజియంలో ఉన్న సేకరణలను చూసి ఆనందించడానికి ఒక్కరోజు బహుశా సరిపోదు.

మ్యూజియం ప్రజల సందర్శన కోసం ప్రతి రోజు ఉదయం10 నుండి సాయంత్రం 5 వరకు తెరిచి ఉంటుంది, ప్రతి సోమవారం మూసి ఉంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Aug,Tue
Return On
19 Aug,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Aug,Tue
Check Out
19 Aug,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Aug,Tue
Return On
19 Aug,Wed