Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఢిల్లీ » ఆకర్షణలు » నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా

నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, ఢిల్లీ

1

ఎన్.ఎస్.డి అనే పొడి అక్షరాలతో ప్రసిద్ధి చెందిన నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (జాతీయ రంగస్థల పాఠశాల) కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కు చెందిన స్వయంప్రతిపత్తి గల సంస్థ. సంగీత నాటక అకాడమీ చే 1959 లో స్థాపించబడిన ఈ రంగస్థల శిక్షణ సంస్థ స్వంత నిర్ణయాధికారం గల విశ్వవిద్యాలయం.

ఈ సంస్థ విద్యార్ధులు కు రంగస్థల సంబంధిత అన్ని విషయాలు తెలిసే విధంగా చక్కటి పాఠ్య ప్రణాళిక సహాయంతో తీవ్ర శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. సంస్థ విద్యార్ధులు తప్పని సరిగా నాటకాలను నిర్మించి ప్రజల ముందు నటించాలనే నిబంధన వల్ల వీరికి రంగస్థలం యొక్క అన్ని అంశాల పైన గట్టి పట్టు దొరుకుతుంది.

ఎన్.ఎస్.డి లో రెండు ప్రదర్శనా విభాగాలు ఉన్నాయి. రెపెర్టోరీ (నాటక) కంపెనీ మరియు సంస్కార్ రంగ్ టొలి (విద్య లో రంగస్థలం) కంపెనీ.1964 లో స్థాపించబడిన రెపెర్టోరీ కంపెనీ నిర్మాణ పనులు, వేడుకల నిర్వహణ, పాత,కొత్త నాటకాల ప్రదర్శన ల మీద దృష్టి పెడుతుంది. 1989 లో స్థాపించబడిన థియేటర్-ఇన్-ఎడ్యుకేషన్ (విద్య లో రంగస్థలం) కంపెనీ లో నటులుగా మారిన అధ్యాపకులు బాలలతో మరియు బాలల కోసం ప్రదర్శిస్తుంటారు. ఈ కంపెనీ ముఖ్యంగా పాఠశాలలలో వివిధ వయసుల బాలల కోసం పాఠ్య ప్రణాళిక ఆధారిత సృజనాత్మక నాటకాల నిర్మాణం కై పని చేస్తుంది. అంతే కాకుండా, జష్న్-ఎ-బచ్పన్ లేక బాల్ సంగం అనే పేరు తో వార్షిక రంగస్థల ఉత్సవాలకి ఆతిథ్యం వహిస్తుంది.

ఎన్.ఎస్.డి కి స్వంత ప్రచురణ విభాగం కూడా ఉంది.ఇక్కడ రంగస్థలం కి సంబంధించిన పుస్తకాల ప్రచురణతో పాటు ఆంగ్లం లోని రంగస్థల సంబంధిత ప్రచురణల హిందీ అనువాదం కూడా జరుగుతుంది. ఎన్. ఎస్. డి కి దేశ వ్యాప్తంగా ప్రాంతీయ వనరుల కేంద్రాలు కూడా ఉన్నాయి. 1994 లో బెంగుళూరు నగరం లో మొదటి కేంద్రం ఏర్పాటు అయింది.

ఆసియా అంతటికీ అతి పెద్దదిగా భావించబడే వార్షిక రంగస్థల వేడుక “భారత్ రంగ్ మహోత్సవ్” కొత్త ఢిల్లీ లో ఎన్. ఎస్. డి చేతే నిర్వహించబడటం దీని గొప్పతనం.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu