గాయిబ్ సాగర్ సరస్సు 1428 లో గోపీనాథ్ మహారాజు (గైపా రావాల్ అనికూడా పిలుస్తారు) నిర్మించిన కృత్రిమ నీటివనరు. ఈ సరస్సుకి సంబంధించి అనేక పురాణాలు, కధలు ఉన్నాయి. దీని ప్రస్తావన అనేక సాహిత్య రచనలు, చారిత్రక పత్రాలలో వుంది. గాయిబ్ సాగర్ సరస్సుని స్థానికులు పవిత్ర స్థలంగా భావిస్తున్నారు, వారు ఇక్కడి వివిధ సంప్రదాయాలను నిర్వహిస్తున్నారు. దుంగార్పూర్ లోని వివిధ పాలకులచే ఈ సరస్సు మరమ్మత్తులు చేయబడింది. ఈ సరస్సు ఒడ్డున అందమైన రాజభవనాలు, దేవాలయాలు ఉన్నాయి. గాయిబ్ సాగర్ సరస్సు తోపాటు ఇక్కడ శ్రీనాథ్ జీ మందిరం కూడా ఉంది. ఇక్కడ ప్రధాన ఆలయం తోపాటు అనేక ఆలయాల సముదాయం ఉంది. వీనిలో ‘విజయ రాజరాజేశ్వరాలయం’ లో శివుని విగ్రహం ఉంది, ఇది దుంగార్పూర్ శిల్పులు, వారి అద్భుతమైన నిర్మాణానికి నిదర్శనం.



Click it and Unblock the Notifications