ఇక్కడ ఉన్న శ్రీకృష్ణుడి దేవాలయం 500 ఏళ్ల కి పూర్వం అయినదిగా చెబుతారు. ఇక్కడికి చేరడానికి ముందుగా ఒఖ పోర్ట్ జెట్టి కి చేరుకొని అక్కడి నుండి బెయ్ట్ ద్వారక కు సుమారు 5 కిలో మీటర్ల దూరం పడవలో రావలసి ఉంటుంది. వల్లభాచార్యునిచే నిర్మితమైన పురాతనమైనటువంటి ఈ దేవాలయం లో ఉన్నటువంటి ప్రతిమ స్వయంగా రుక్మిణి యే చేసిందని చెప్తారు. పురాణం ఇతిహాసం ప్రకారం, శ్రీ కృష్ణుడి స్నేహితుడైన సుధాముడు ద్వారక కి వచ్చి నప్పుడు తన శక్తి కి తగ్గట్టు అటుకులు బహుమతిగా అందిస్తాడు. ఇప్పటికీ భక్తులు, సందర్శకులు ఇక్కడి బ్రాహ్మణులకు అటుకులు ఇవ్వడం ఆచారం.



Click it and Unblock the Notifications