కరదియూర్ వ్యూ పాయింట్ ఈరోడ్ పురపాలక పట్టణంలో ఎనభై మూడు కిలోమీటర్లు ఈశాన్యం వైపు ఉంది. ఇది ప్రకృతి అందాన్ని ఆస్వాదించే వారికి అద్భుతమైన ప్రదేశం. ఈ స్థల సహజ అందం అపారమైనది, ఈ స్థలం అద్భుతంగా, అతను లేదా ఆమె స్వర్గంలో ఉన్నట్లు భావన కలుగుతుంది. ఈ స్థలం సందర్శించిన తరువాత చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. ఈరోడ్ నుండి బస్సు సేవలు పొందవచ్చు లేదా కారులో అక్కడి నుండి ప్రయాణించవచ్చు. ఈ అందమైన పదేశాన్ని చేరుకోవడానికి గంటకంటే ఎక్కువ సమయం పడుతుంది.
ఈ ప్రదేశం విచారంగా లేదా నిరుత్సాహంగా ఉన్నవారికి పూర్తీ ప్రశా౦తతను అందిస్తుంది. కరదియూర్ వ్యూ పాయింట్ ని దక్షిణ భారతదేశంలోని అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటిగా పరిగణిస్తారు. సెలవలలో ఈ రాష్ట్రాన్ని సందర్శించేవారు ఈ అందమైన ప్రదేశాన్ని తప్పక చూడాలి.